• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTH TIPS HERE ARE INTERESTING NUTRITIONAL FACTS ABOUT THE BEETROOTS SU GH

Beetroots: బీట్‌రూట్‌ను అవైడ్ చేస్తున్నారా?.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..

Beetroots: బీట్‌రూట్‌ను అవైడ్ చేస్తున్నారా?.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..

బీట్ రూట్

బీట్‌రూట్‌ ఆరోగ్యానికి మంచిదని మనలో చాలా మంది తింటుంటారు. ముఖ్యంగా, రక్త హీనత సమస్యతో బాధపడేవారు బాట్రూట్ తినడం వల్ల వారి శరీరంలో రక్తం బాగా వృద్ధి చెందుతుంది.

  • Share this:
బీట్‌రూట్‌ ఆరోగ్యానికి మంచిదని మనలో చాలా మంది తింటుంటారు. ముఖ్యంగా, రక్త హీనత సమస్యతో బాధపడేవారు బీట్‌రూట్ తినడం వల్ల వారి శరీరంలో రక్తం బాగా వృద్ధి చెందుతుంది. అలానే పచ్చి బీట్ రూట్, జ్యూస్ వల్ల అనేక పోషకాలు మన శరీరానికి అందుతాయి. అందువల్లే, క్రీడాకారులు ఎక్కువగా ఆట మధ్యలో బీట్ రూట్ జ్యూస్ను తాగుతుంటారు. ఇది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటు, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాక, దీనిలో ఐరన్ శాతం అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో రక్తం వృద్ధి చెంది, రక్తహీనత సమస్యని తగ్గిస్తుంది. బీట్ రూట్ తినడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.

కడుపులో మంటను తగ్గిస్తుంది
బీట్‌రూట్స్‌లో బీటాలైన్స్ అని పిలువబడే ఫైటోన్యూట్రియెంట్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా, కడుపులోని దీర్ఘకాలిక మంట నివారించబడుతుంది. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్‌లో నొప్పి కూడా తగ్గుతుంది.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
బీట్‌రూట్‌లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు బీట్‌రూట్‌ జ్యూస్లో గ్లూటామైన్, అమైనో ఆమ్లాలు, 3.4 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మలబద్దకం, ప్రేగు వ్యాధులు, డైవర్టికులిటిస్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, మిమ్మల్ని ఎక్కువ సేపు ఎనర్జీగా ఉంచుతుంది.

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
బీట్‌రూట్స్‌లో ఉండే నైట్రేట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాక, ఇది రక్త నాళాలను విడదీయడానికి, మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా మెదడు పనితీరును సులభతరం చేస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది
బీట్‌రూట్స్‌లో ఉండే డైటరీ నైట్రేట్‌ మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మీ రక్తపోటును తగ్గించడంలో, గుండెపోటు నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుంది
బీట్రూట్స్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బీట్రూట్స్ తెల్ల రక్త కణాల ఉత్పత్తిని సులభతరం చేస్తాయి, అంతేకాక, అసాధారణ కణాల పెరుగుదలను, కణితి కణాల విభజనను తగ్గిస్తుంది. బీట్రూట్లలో ఉండే విటమిన్ బి 6, సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన పోషకాల కోసం మీ రోజూవారి డైట్లో బీట్ రూట్స్ ఉండేలా చూసుకోవాలని డాక్టర్లు సలహాలిస్తున్నారు
Published by:Sumanth Kanukula
First published:

అగ్ర కథనాలు