హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Tips: కల్లుఉప్పుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips: కల్లుఉప్పుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉండే ఈ ఉప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉండే ఈ ఉప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉండే ఈ ఉప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

  ఉప్పుతో ముప్పంటారు డాక్టర్లు. ఎక్కువగా తింటే బీపీతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే ఇంట్లో కూరల్లో వాడే సాధారణ ఉప్పుతో దుష్ఫలితాలున్నా...రాతి ఉప్పుతో మాత్రం ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీన్నే కల్లుఉప్పు అని పిలుస్తారు. ఆయుర్వేద మందుల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉండే ఈ ఉప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

  రాతి ఉప్పుతో ప్రయోజనాలు:

   1. కల్లుఉప్పుతో జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కడుపు నొప్పిని కూడా దూరం చేస్తుంది.

   2. శరీర జీవ క్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా శరీరం మరింత పరిపుష్టమవుతుంది.

   3. బీపీని నియంత్రిస్తుంది. ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం.. రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులను కంట్రోల్ చేస్తుంది.

   4. రోగ్య నిరోధక వ్యవస్థ పనితీరు పెరుగుతుంది. శరీరంలోని బ్యాక్టీరియాను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

   5. రాతి ఉప్పును ఆహారంలో ఉపయోగించడం వలన నిద్ర బాగా పట్టి నిద్రలేమి సమస్య దూరమవుతుంది.

   6. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో సగం టేబుల్ స్పూన్ రాతి ఉప్పును వేసి..కరిగిపోయాక తాగాలి. దీని వలన మానసిక ఒత్తిడి దూరమవుతుంది.

   7. బకెట్ నీళ్లలో కాస్త రాతి ఉప్పును కలిపి స్నానం చేస్తే చర్మం కాంతివంతమవుతుంది. చర్మంపై ఉన్న మలినాలు తొలగిపోతాయి.

   8.షాంపూలో కొంచెం కల్లుఉప్పును కలిసి తలస్నానం చేస్తే జుట్టు ఊడే సమస్య తగ్గుతుంది. వెంట్రుకలను చక్కగా శుభ్రపరుస్తుంది.

  First published:

  Tags: Food, Health benifits, Health Tips, HOME REMEDIES, Life Style

  ఉత్తమ కథలు