హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Guava Leaf Tea: జామ ఆకులతో టేస్టీ టీ.. ఒక్కసారి తాగి చూడండి..ఇక వదలరంతే..

Guava Leaf Tea: జామ ఆకులతో టేస్టీ టీ.. ఒక్కసారి తాగి చూడండి..ఇక వదలరంతే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Guava Tea Health Benefits: జామ ఆకులను శుభ్రం చేసుకుని, ఒక గ్లాసు మంచి నీటిలో వేసి మరిగించాలి. గోరువెచ్చగా అయిన తరువాత ఈ టీని తాగాలి. దీనిని తరచూ సేవిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Guava Leaf Tea: జామలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో దీన్ని సూపర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇందులో 80 శాతం నీరు ఉంటుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. జామ పండు (Guava  Fruit)తో పాటు ఆకుల్లో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకులతో టీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్య సమస్యలన్నింటికీ మంత్రదండంగా పనిచేస్తుంది. జామ ఆకులతో చేసిన టీలో ఫ్లేవనాయిడ్స్, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి కడుపు, పేగు సంబంధ సమస్యల నివారణలో కీలకంగా వ్యవహరిస్తాయి. మధుమేహం ఉన్నవారిలో షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి.

జామ ఆకుల టీ తయారీ

జామ ఆకులను శుభ్రం చేసుకుని, ఒక గ్లాసు మంచి నీటిలో వేసి మరిగించాలి. గోరువెచ్చగా అయిన తరువాత ఈ టీని తాగాలి. తరచూ దీన్ని సేవిస్తే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

వర్షాకాలంలో మెరిసే చర్మాన్ని పొందడానికి ఉపయోగకరమైన చర్మ సంరక్షణ చిట్కాలు..!

*రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుదల

జామపండు, దాని ఆకుల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో విటమిన్-సి లోపిస్తే.. అనేక ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. తరచూ జామ ఆకుల టీ సేవిస్తే శరీరానికి కావాల్సినంత విటమిన్ -సి లభిస్తుంది. అంతేకాకుండా ఇందులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఏదైనా ఇన్ఫెక్షన్‌కు చికిత్స చేసేటప్పుడు శరీరంలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. విటమిన్- సి శరీరంలోని మలినాలను అప్రయత్నంగా బయటకు పంపుతుంది.

* ప్రకాశవంతమైన చర్మం 

జామ ఆకులోని అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు, సమ్మేళనాలు మృదువుగా ఉండే చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే హానికర ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతూ వృద్ధాప్య చాయలను తగ్గిస్తాయి. జామ ఆకుల టీలో యాంటీమైక్రోబయాల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మంపై మొటిమలను నివారిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.

* బరువు తగ్గడం

జామ ఆకులతో చేసిన టీలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి వేగంగా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో కేలరీలు అసలు ఉండవు. ఫుడ్ కోరికలను నియంత్రిస్తుంది. దీంతో ఆకలి మందగిస్తుంది. ఇవన్నీ శరీరంలోని అదనపు బరవును తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

 Health Tips: పచ్చి పాలు తాగే అలావాటు ఉందా? అస్సలు మంచిది కాదట..ఇవి తెలుసుకోండి

* క్యాన్సర్ రిస్క్ తక్కువ

జామ ఆకుల్లో లైకోపీన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. క్యాన్సర్ రిస్క్ (Cancer Risk) తగ్గించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా విధ్వంసక కణాలలోని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది. దీంతో క్యాన్సర్ కణాల వృద్ధి అడ్డకుంటుంది.

* రక్తంలో అధిక చక్కెర స్థాయిల తగ్గింపు

జామ ఆకుల్లో తగిన పరిమాణంలో పొటాషియం ఉంటుంది. ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. పొటాషియం, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయి (Diabetes)ని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. జీర్ణక్రియ మెరుగుదలకు ఫైబర్ సాధన లాంటిది. ఇది నేరుగా రక్తప్రవాహంలో కలిసిపోకుండా ఉంటుంది.

* బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్

రెగ్యులర్‌గా జామ ఆకుల టీ తాగడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ (Bad Cholesterol levels) తగ్గిపోతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.

* దంత సమస్యల నివారణ

దంత క్షయం, దంతాలలో నొప్పి వంటి సమస్యలను నివారించడంలో జామ ఆకులు పెద్దన్న పాత్ర పోషిస్తాయి. ఒక కప్పు జామ ఆకుల టీని బాయియిల్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటితో నోటిని రోజుకు రెండు, మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి. అలాగే లేతగా ఉండే జామ ఆకులను పేస్ట్ చేసి, నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే ఉపశమనం లభిస్తుంది.


(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Health, Health benefits, Life Style, Lifestyle

ఉత్తమ కథలు