హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Lower back Pain: ఇలా వ్యాయామం చేస్తే.. మీకు వెన్నునొప్పి అస్సలు రాదు..

Lower back Pain: ఇలా వ్యాయామం చేస్తే.. మీకు వెన్నునొప్పి అస్సలు రాదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Lower Back Pian: ఈరోజుల్లో వెన్ను నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టే వ్యాయామాలు ఏవో తెలుసుకోండి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈరోజుల్లో వెన్ను నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కోసారి బ్యాక్ పెయిన్ వల్ల కలిగే శారీరక బాధ వ్యక్తిని తీవ్రంగా వేధిస్తుంటుంది. అయితే, ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు తీవ్రంగా చెమట చిందించాల్సిన పనిలేదని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. క్రమంగా చిన్నపాటి వ్యాయామాలు చేస్తే లోయర్ బ్యాక్ పెయిన్ నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చని సూచిస్తున్నారు. లోయర్ బ్యాక్ పెయిన్ నుంచి బయటపడేందుకు ఫిట్‌నెస్ నిపుణురాలు నమ్రతా పురోహిత్ నాలుగు ముఖ్య సూచనలు చేశారు. అవేంటో తెలుసుకుందాం.

* ప్లాంక్

సరైన భంగిమల్లో ఎక్కువ సమయం పాటు కూర్చోకపోవడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ సమస్య మొదలవుతుంది. అందుకే నిటారుగా కూర్చునేందుకు ప్రయత్నించాలి. అయితే, ఇలా కూర్చోవడానికి తగినంత సాధన చేయాలి. లోయర్ బ్యాక్ పెయిన్ నుంచి విముక్తి కల్పించేందుకు ‘ప్లాంక్’ వేయడం ఒక ప్రధాన ఆయుధం. ప్లాంక్ వేయడం వల్ల వెన్నుపాము దృఢంగా మారుతుంది. లోయర్ బ్యాక్ పెయిన్‌ని తగ్గించడంలో ప్లాంక్ కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

* కండరాల బలోపేతం

వెన్నుపాముకు పొత్తికడుపు కండరాలు బాసటగా నిలుస్తాయి. కాబట్టి వీటిని వీలైనంత మేర యాక్టివ్‌గా ఉంచాలి. అంటే కాళ్లని ముందుకు లేదా వెనక్కి కదపడం; మోకాళ్లని దగ్గరగా తెచ్చి పడుకుని ఎక్సర్‌సైజులు చేయడం వల్ల వెన్నునొప్పిపై భారం తగ్గే అవకాశం ఉంది. చేతులను తలకు నిటారుగా పెట్టి పైకి లేచేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల పొత్తికడుపు కండరాలతో పాటు, వెన్నుపాము స్టెబిలైజ్ కావడానికి అవకాశం ఉంటుంది.

* హిప్స్‌ కదల్చడం

హిప్ ఎక్సర్‌సైజ్ కూడా వెన్నుపాము ఆరోగ్యానికి ముఖ్యమైనదే. హిప్‌ని స్టిఫ్‌గా ఉంచడం వల్ల తగిన లబ్ధి పొందవచ్చు. ఇందుకోసం పడుకుని ఎడమ, కుడి మోకాళ్లని శరీరానికి దగ్గరగా తీసుకురావడం, అనంతరం దూరంగా చాచడం వల్ల హిప్ దృఢంగా మారేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా వెన్నునొప్పి సమస్య తగ్గుతుంది.

* నడుమును పైకి లేపటం

వెన్నునొప్పి నివారణకు ఈ వ్యాయామం మరింత తోడ్పడుతుంది. పిరుదుల కండరాలు పెల్విస్‌ని స్టెబిలైజ్ చేయడంలో సహాయపడతాయి. ఈ కండరాలు బలహీనంగా ఉంటే మొదటికే మోసం వస్తుంది. వెన్నుపాముపై తీవ్రంగా ఒత్తిడి కలుగుతుంది. తద్వారా లోయర్ బ్యాక్ పెయిన్ మరింత తీవ్రమవుతుంది. దీన్ని నివారించేందుక ఇలా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. నేలపై పడుకుని నడుము కింది భాగాన్ని పైకి లేపే ప్రయత్నం చేయాలి. ఈ ప్రక్రియలో పాదాలను కిందనే ఉంచాలి. ఇలా నడుముని పైకి లేపడం అనంతరం యథాస్థితికి తీసుకురావడం వల్ల పెల్విస్ స్టెబిలైజ్ అవుతుంటుంది.

ఈ చిన్నపాటి వ్యాయామాల వల్ల మీ సమస్య పరిష్కారం కాకపోతే తప్పకుండా మీరు సంబంధిత వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. సమస్య తీవ్రతను బట్టి చికిత్స తీసుకోవాలి.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

First published:

Tags: Back pain, Health Tips, Life Style, Lifestyle

ఉత్తమ కథలు