హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Tips : శరీరానికి సరిపడా ఐరన్ తీసుకుంటున్నారా... ఇలా చెయ్యండి

Health Tips : శరీరానికి సరిపడా ఐరన్ తీసుకుంటున్నారా... ఇలా చెయ్యండి

శరీరానికి సరిపడా ఐరన్ తీసుకుంటున్నారా... ఇలా చెయ్యండి

శరీరానికి సరిపడా ఐరన్ తీసుకుంటున్నారా... ఇలా చెయ్యండి

Health Tips For Iron Intake : మన దేశంలో ఇప్పుడిప్పుడే అన్ని వర్గాల ప్రజలకూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. ఆ క్రమంలో ఇప్పుడు మనం శరీరానికి ఐరన్ ఎంత అవసరమో, దాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం.

Health Tips For Iron Intake : మీకు తెలుసు కదా... మన శరీరంలో రకరకాల ఖనిజాలుంటాయి. మనం రోజూ వాడే ఉప్పు కూడా ఖనిజమే. ఈ ఖనిజాల్లో ముఖ్యమైనది ఐరన్. ఇది మనకు ఎంత అవసరమంటే... ఇది గానీ సరిపడా లేకపోతే... మనకు ఊరికే నీరసం వచ్చేస్తుంది. ఏ పనీ చెయ్యబుద్ధి కాదు. ఏదైనా పని చేసినా... వెంటనే అలసిపోతాం. నీరసంగా ఉంటాం. కత్తిలా ఉండాల్సిన మనం... పత్తిలా అయిపోతాం. కాబట్టి మనకు ఐరన్ అత్యవసరం. ముఖ్యంగా మహిళలకు ఐరన్ లోపం చాలా ఎక్కువ. ఎందుకంటే... పీరియడ్స్ టైమ్‌లో వారు ఐరన్ కోల్పోతారు. అందువల్ల ప్రతి ఒక్కరం ఐరన్ బాగా పొందాలి. శక్తిమంతమైన పౌరులుగా మనం ఉండాలి. అందుకోసం మనం ఐరన్ ఏ ఆహారంలో ఉంటుందో, మనం తినే ఆహారంలో ఐరన్ ఎలా చేర్చుకోవాలో ఫటాఫట్ తెలుసుకుందాం.

ఐరన్ బాగా ఉండేది పప్పు ధాన్యాలు, గింజలు, పాస్తా, దుంపలు, వేర్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు, నట్స్ వంటి వాటిలో. ఇవన్నీ శాఖాహారమే. కాబట్టి అందరం వీటిని తినవచ్చు. వీటిని తినడం వల్ల కేలరీలు పెరిగినా... ఇవి మంచి ఆహారం కాబట్టి... మన శరీరానికి అదనపు కొవ్వేదీ ఏర్పడదు. పైగా ఇవి శరీరంలో ఆల్రెడీ ఉన్న కొవ్వు నిల్వలను క్రమబద్ధీకరిస్తారు. చెడు కొవ్వును తరిమేస్తాయి. ఇవన్నీ తింటే ఐరన్ పుష్కలంగా లభించి... కొడితే గోడ బద్ధలైపోయేలా తయారవుతాం.

అథ్లెట్లు, క్రీడాకారులకు మనలా సాధారణ ఐరన్ చాలదు. వాళ్లకు ఇంకా ఎక్కువ కావాలి. అందుకోసం వాళ్లు గుడ్లు బాగా తినాలి. సూపులు, సాస్‌లు వాడొచ్చు. గుడ్లు తినడం వల్ల చాలా మంది బాడీ బిల్డర్లు కొండల్లాండి కండలు పెంచుతారు. ఐరన్ లోపంతో డాక్టర్ల దగ్గరకు వెళ్తే... వాళ్లు ఐరన్ టాబ్లెట్లు ఇస్తారు. అవి రక్త హీనతను తగ్గిస్తాయి. ఐతే... అలా టాబ్లెట్లు వాడటం కంటే... రియల్ తాజా కూరగాయలు, ఆకు కూరలు వంటివి తింటూ ఐరన్ పెంచుకోవడం ఎంతో మేలు. గోంగూరనే తీసుకోండి. దాన్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలాంటివి వాడితే ఆరోగ్యం, ఐరన్ రెండు లభిస్తాయి.

First published:

Tags: Health benefits, Health Tips, Women health

ఉత్తమ కథలు