Health Tips : మెంతులు తీసుకుంటే ఆ సమస్యలు తగ్గుతాయట..

Health Tips | మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్స్, ఐరన్, మాంగనీస్, మెగ్నిషియం వంటివి చాలా ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. అధికబరువుతో బాధపడేవారు రోజూ మెంతులు నానబెట్టిన నీటిని తీసుకోవాలి. దీనివల్ల సమస్య అదుపులో ఉండడమే కాక.. అదనపు లాభాలుంటాయి. జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

news18-telugu
Updated: June 2, 2019, 2:02 PM IST
Health Tips : మెంతులు తీసుకుంటే ఆ సమస్యలు తగ్గుతాయట..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మెంతులు ఆరోగ్యానికి చాలామంచిది. వీటి ప్రయోజనాలు తెలిసినవారు ఖచ్చితంగా తమ డైట్‌లో మెంతులు, మెంతికూరను చేర్చుకుంటారు. ముఖ్యంగా రాత్రి పూట మెంతులను నీటిలో నానబెట్టి తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్స్, ఐరన్, మాంగనీస్, మెగ్నిషియం వంటివి చాలా ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. అధికబరువుతో బాధపడేవారు రోజూ మెంతులు నానబెట్టిన నీటిని తీసుకోవాలి. దీనివల్ల సమస్య అదుపులో ఉండడమే కాక.. అదనపు లాభాలుంటాయి. జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

ముఖ్యంగా.. చాలామంది మగవారు లైంగిక సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు మెంతికూర, మెంతులను రెగ్యులర్‌గా తీసుకుంటే సమస్య తీరుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులోని ప్రత్యేక గుణాలు సెక్స్ స్టామినాను పెంచుతుందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..Health Tips : లోబీపీ ఉన్నవారు రోజూ ఇలా చేయండి..
First published: June 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు