Home /News /life-style /

HEALTH TIPS DRINK LEMON WATER DAILY HERE ARE AMAZING HEALTH BENEFITS SK GH

Lemon Water: రోజూ ఒక్క గ్లాస్ నిమ్మరసం తాగితే చాలు.. మీరు నమ్మలేనన్ని లాభాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Lemons: పుల్లగా ఉండి మీ రుచిమొగ్గలకు సరికొత్త ఉత్సాహం తెచ్చే నిమ్మశక్తి ఇటు సంప్రదాయ వైద్యంలోనూ, అటు ఇంగ్లీష్ మెడిసిన్ లోనూ అగ్రతాంబూలం అందుకోవటానికి చాలా కారణాలున్నాయి.

ఏడాది పొడవునా మనకు లభించే నిమ్మకాయల శక్తి తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. పుల్లగా ఉండి మీ రుచిమొగ్గలకు సరికొత్త ఉత్సాహం తెచ్చే నిమ్మశక్తి ఇటు సంప్రదాయ వైద్యంలోనూ, అటు ఇంగ్లీష్ మెడిసిన్ లోనూ అగ్రతాంబూలం అందుకోవటానికి చాలా కారణాలున్నాయి. వేసవిలో ఎవరైనా ఇంటికి వస్తే మనం తాగటానికి మంచినీళ్లు ఆతరువాత నిమ్మకాయ జ్యూస్ ఎందుకిస్తాం ఎప్పుడైనా ఆలోచించారా? ఇది సూపర్ ఫుడ్ అందుకే దీన్ని మంచికి, చెడుకు కూడా ఉపయోగిస్తారు. సంప్రదాయ ఆహారంలో, మోడ్రన్ ఫుడ్ వెరైటీల్లోనూ కూడా నిమ్మకాయకు తిరుగులేదు. నిద్ర లేవగానే మీ రొటీన్ ను నిమ్మ రసం వేసిన నీళ్లు తాగి ప్రారంభిస్తే ఇక ఆరోజంతా మీరు ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి వికారాలున్నా, నిద్ర సరిగ్గా రాకపోయినా, అలసటగా ఉన్నా, కడుపులో జీర్ణం కాకపోయినా మీలో హుషారు నింపే శక్తి నిమ్మకాయలకు ఉంది.

లెమనాయిడ్ వాటర్ .. లైమ్ వాటర్‌గా మనం పిలుచుకునే నిమ్మరసం మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. కాస్త ఉప్పు లేదా చక్కెర లేకపోతే రెండూ చిటికెడు వేసి తాగితే కొన్ని నిమిషాల్లోనే మీరు యాక్టివ్ అవుతారు. వాత, పిత్త, కఫ వంటి దోషాలన్నింటినీ ఈజీగా పారద్రోలే శక్తి ఉన్న నిమ్మకాయ ప్రత్యేకత ఇదే మరి. పాశ్చాత్యులు దీన్ని సిట్రస్‌గా దీన్ని పిలుస్తారు. ఈ సిట్రస్ మూడ్ సెట్టర్‌గానూ పనిచేస్తుంది. రుచిగా ఉండే నిమ్మకాయ రసంను పిల్లా, పెద్దా అందరూ రోజూ తాగవచ్చు.

బాడీకి హైడ్రేట్స్:
సీజన్ ఏదైనా మన ఒంటికి అవసరమైన నీరుని నిలువ చేసేలా నిమ్మశక్తి పనిచేస్తుంది. అందుకే బాడీని హైడ్రేట్‌గా ఉంచటంలో నిమ్మకాయ రసం కీలక పాత్ర పోషిస్తుంది. డీహైడ్రేట్ అవ్వకపోతే మనకు శక్తి ఉండి, ఉత్సాహంగా ఉంటాం. రుచికరమైన నిమ్మరసం వర్క్ ఫ్రం హోం వారికి దివ్యౌషధం అని చెప్పాలి. గంటలతరబడి కంప్యూటర్ ముందు కూర్చోవటంతో తలెత్తే సైడ్ ఎఫెక్ట్స్ కొన్నింటికి నిమ్మరసం విరుగుడుగా పనిచేస్తుంది. మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచటం, ఒకే చోట గంటలతరబడి లేవకుండా కూర్చోవటంతో వచ్చే ఒబేసిటీకి ఇది చెక్ పెడుతుంది. మీ మెటబాలిజంను పెంచే శక్తి నిమ్మకాయకుంది. ఒంట్లోని కొవ్వును ఇది తేలికగా కరిగించగలదు. ఇక స్వచ్ఛమైన గాలి పెద్దగా లేనిచోట తలనొప్పి, నిరుత్సాహం వంటివి మన బుర్రను ఆవరిస్తాయి. అలాంటప్పుడు కాస్త నిమ్మకాయ జ్యూస్ తాగారో ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలంటే ముందు లైమ్ జ్యూస్ ను మీ దినచర్యలో భాగంగా మార్చుకోండి. ఆ ఫలితాలు మీరే ఎంజాయ్ చేస్తారు.

ఇమ్యూనిటీ:
రోగనిరోధక శక్తిని మనకు సమకూర్చే శక్తి ఉన్నది నిమ్మకాయకే. అందుకే నిమ్మకాయలను ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉంచుకోండి. సీ విటమిన్ పుష్కలంగా ఉన్న నిమ్మకాయలతో ఇమ్యూనిటీ పెరిగి, మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు వైరస్, బ్యాక్టీరియాలను మీ శరీరం సమర్థవంతంగా ఎదుర్కోగలదు. సున్నితంగా ఉండి తరచూ ఇన్ఫెక్షన్లకు గురయ్యేవారు నిమ్మరసం తీసుకోవటం మంచిది. వీరిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉండి ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు కనుక నిమ్మకాయ రసం వారిపై సమర్థవంతంగా పనిచేస్తుంది.

అజీర్తి సమస్యలు:
అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు నిమ్మకాయను ఉపయోగించటం శ్రేష్టం. మనం తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా జీర్ణక్రియలను వేగవంతం చేసి, మలబద్ధకాన్ని పోగొట్టగల నిమ్మకాయ రసంను పరగడపును తీసుకుంటే మరింత మంచిది. నిమ్మకాయ రసంను అల్లం, తేనె వంటివాటితో కలిపి తీసుకుంటే ఇది మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.

కిడ్నీ స్టోన్స్:
నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాల్లోని రాళ్లను సైతం కరిగించగలదు. కిడ్నీలో ఏర్పడ్డ చిన్న రాళ్ల వంటి వాటిని ముక్కలుగా చేసి మన శరీరం నుంచి ఈ చిన్న రాళ్లను బయటికి పంపేలా నిమ్మరసం అద్భుతాలను చేస్తుంది.

చర్మానికి నిగారింపు:
నిమ్మకాయ జ్యూస్ తాగటం వల్ల మన చర్మం కూడా మెరుస్తూ ఉండేలా నిగారింపు సంతరించుకుంటుంది. యాంటీ ఏజింగ్‌గా పనిచేసే నిమ్మరసంలో మన చర్మంపై చిన్న వయసుకే ముడతలు రాకుండా నివారించుతుంది. ముఖంపైన ఏమైనా మచ్చలు ఉంటే దానిపై నిమ్మరసం రాస్తే కొంతకాలం తరువాత ఆ మచ్చలు చాలా పల్చబడతాయి. విటమిన్ సీ, యాంటీయాక్సిడెంట్లున్న నిమ్మరసంతో చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. నిమ్మచక్కను ముఖంపై రుద్దినా, నిమ్మరసం తాగినా మీ చర్మంపై ఈ మార్పులను మీరు ఈజీగా గుర్తించవచ్చు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Health, Health food, Health Tips, Life Style

తదుపరి వార్తలు