హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Tips: టేస్టీగా ఉన్నాయని..ఈ పదార్థాలను ఎక్కువగా తినొద్దు..ఈ వ్యాధులు రావచ్చు

Health Tips: టేస్టీగా ఉన్నాయని..ఈ పదార్థాలను ఎక్కువగా తినొద్దు..ఈ వ్యాధులు రావచ్చు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Health Tips: కొన్నిసార్లు కొన్ని ఆహారాలు పదార్థాలు ఎక్కువగా తింటే కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. అందుకే వాటికి దూరంగా ఉండడం బెటర్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కొంతమంది తరచుగా కడుపు ఉబ్బరం (Stomach  Problems) సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఉబ్బరం అంటే కడుపు, ప్రేగులలో గ్యాస్ ఏర్పడటం. కార్బోనేటేడ్ పానీయాల వినియోగం, అతిగా తినడం, మలబద్ధకం మొదలైన వాటి వల్ల ఇది వస్తుంది. నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కూర్చోవడం, కడుపులో గ్యాస్ ఏర్పడటం (Gas Problem), జీర్ణవ్యవస్థ (Digestive System) సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం సమస్య పెరుగుతుంది. ఉబ్బరం కారణంగా కడుపు నిండినట్లు, ఉబ్బినట్లు అనిపిస్తుంది. ఆకలి అనిపించదు. కడుపు ఉబ్బరం సమస్యల కారణంగా కడుపు నొప్పి, విశ్రాంతి లేకపోవడం, గ్యాస్, త్రేనుపు వంటి సమస్యలతో కూడా ఇబ్బంది పడవచ్చు. కొన్నిసార్లు కొన్ని ఆహారాలు పదార్థాలు ఎక్కువగా తింటే కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. అందుకే వాటికి దూరంగా ఉండడం బెటర్.

బ్రకోలీ, కాలీఫ్లవర్ తీసుకోవడం తగ్గించండి. ఇది కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది. ఈ కూరగాయలు త్వరగా జీర్ణం కావు. వీటిని జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా పొట్టలో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి.

శీతాకాలంలో క్యారెట్ తినడం వల్ల అపారమైన ప్రయోజనాలు..

వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, సోడా, కార్బోనేటేడ్ పానీయాలు ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం సమస్యలు వస్తాయి. ఇవి త్వరగా జీర్ణం కావు. ఫలితంగా గ్యాస్, కడుపులో మంట వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

మీకు ఇప్పటికే కడుపు ఉబ్బరం సమస్య ఉంటే యాపిల్స్ ఎక్కువగా తినకండి. యాపిల్ ఆరోగ్యానికి మంచిదే. కానీ ఇందులో ఉండే ఫ్రక్టోజ్, ఫైబర్ గ్యాస్‌ను పెంచుతాయి. తద్వారాలో పొట్టలో ఇబ్బందులు కలుగుతాయి.

ఈ 6 గింజలు జలుబును తగ్గిస్తాయి.. ఆహారంలో తప్పనిసరి చేర్చుకోవాలట.

వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనది. కొంతమంది ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటారు. ఐతే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉంటే వెల్లుల్లి తినకండి. ఇందులో ఉండే ఫ్రక్టాన్స్ కడుపు ఉబ్బరం పెంచుతుంది.

బీన్స్, కాయధాన్యాలు వంటి చిక్కుళ్ళు అధికంగా తీసుకోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఉబ్బరం కలిగిస్తుంది. ఇందులో సంతృప్త కొవ్వు, సోడియం తక్కువగా ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీరు చిక్కుళ్ళు నుంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందాలనుకుంటే వాటిని ఎక్కువగా కాకుండా తక్కువ మొత్తంలో తీసుకోవాలి.

ఫైబర్ జీర్ణవ్యవస్థ తన పనితీరును సజావుగా నిర్వహించడానికి సహాయపడుతుంది. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా మీరు అతిగా తినకుండా ఉంటారు. అందుకే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు రావు.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

First published:

Tags: Health, Health Tips, Life Style, Lifestyle

ఉత్తమ కథలు