హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Morning Dew: ఉదయాన్నే కురిసే మంచు బిందువులు అమృతపు చుక్కలు.. ఎన్ని లాభాలో తెలుసా?

Morning Dew: ఉదయాన్నే కురిసే మంచు బిందువులు అమృతపు చుక్కలు.. ఎన్ని లాభాలో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Health Tips: ఉదయాన్నే కురిసే మంచు బిందువులు చూసేందుకు చాలా చిన్నగా కనిపించినా.. ఆరోగ్యానికి మాత్రం పెద్ద ప్రయోజనాలనే కలిగిస్తాయి. మరి వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఉదయం పూట వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. తెల్లవారుజామున మంచు (Morning Dew) ఎక్కువగా కురుస్తుంది. చెట్లు, మొక్కలు, పూలు, ఆకులు, పచ్చటి గడ్డిపై పడి ఉన్న మంచు బిందువులను చూడగానే మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. మంచు బిందువులతో నిండిన గడ్డిపై నడవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం తెలిసినా... మనలో చాలా మందికి ప్రకృతిలో సమయం గడిపేందుకు సమయం దొరకదు. పట్టణాలు, నగరాల్లో అయితే మనక అంతగా కనిపించవు. గ్రామాల్లో గడ్డి, ఇతర మొక్కలపై నీటి బిందువులు ప్రతి చోటా కనిపిస్తాయి. రైతులు (Farmers) ఉదయాన్నే పొలానికి వెళ్లినప్పుడు..ఇలాంటి మంచు బిందువులపై నడుస్తుంటారు. ఈ నీటి బిందువులు చూసేందుకు చాలా చిన్నగా కనిపించినా.. ఆరోగ్యానికి మాత్రం పెద్ద ప్రయోజనాలనే కలిగిస్తాయి. మరి మంచు బిందువుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో (Health Benefits) ఇక్కడ తెలుసుకుందాం.

 White Pumpkin : తెల్ల గుమ్మడి వాడితే.. మీలో ఈ మార్పులు కనిపిస్తాయి

మంచు బిందువులతో ఉపయోగాలు:

doctorhealthbenefits.com నివేదిక ప్రకారం.. ఉదయం పూట కురిసే మంచులో 14-16 ppm వరకు ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది. ఒక పాత్రలో ఆ మంచు బిందువులన సేకరించి ముఖానికి రాసుకుంటే చర్మానికి చాలా ప్రయోజనంగా ఉంటుంది.

రోజంతా పని చేస్తే శరీరం అలసిపోతుంది. అలాంటి సమయంలో ఉదయాన్నే సేకరించిన మంచ నీటిని తాగితే ఉపశమనం కలుగుతుంది. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. మళ్లీ యాక్టివ్‌గా పనులు చేసుకునేందుకు దోహపడుతుంది.

పెదవులు విపరీతంగా పొడిగా ఉన్నాయా? అయితే, ఈ ప్రాణాంతక వ్యాధి కాగలదు!

ఉదయం కురిసే మంచులో ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే.. మొటిమలు, మచ్చల సమస్యలు తొలగిపోతాయి. మీకు ఇప్పటికే మొటిమలు ఉంటే చర్మంపై ముఖంపై మంచు నీటిని స్ప్రే చేసుకోవాలి. తాగినా మంచి ఫలితాలు వస్తాయి.

ఉదయం నిద్రలేచిన తర్వాత మీ కళ్ళు ఎర్రగా కనిపిస్తే... కొన్ని చుక్కల మంచు నీటిని వేసుకోవాలి. దీని వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండడంతోపాటు కంటిచూపు కూడా పెరుగుతుంది. అప్పటికప్పుడు మంచు నీరు దొరకడం కష్టమయితే.. దొరికినప్పుడు ఆ మంచు బిందువులన సేకరించి.. స్టోర్ చేసి పెట్టుకోవచ్చు.

Women health: బహిష్టు సమయంలో మహిళకు వచ్చే మొటిమలను అదుపు చేయడం ఎలా..?

మొటిమలతో పాట మరికొంత మంది జిడ్డ చుర్మంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఉదయం పూట కురిసే మంచు బిందువులను మఖంపై వేసుకొని.. మర్దన చేస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి. జిడ్డు తొలగిపోయి.. చర్మం కాంతివంతమవుతుంది.

ఉదయం పూట కురిసే మంచును సేకరించి.. ఆ నీటిని తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం నుంచి మలినాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వైరస్, బ్యాక్టీరియా వల్ల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు.

ఒక పరిశోధన ప్రకారం... రోజూ ఉదయం పూట మంచు నీటిని తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండె జబ్బులు, కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు.

ఉదయ సమయంలో లభించే మంచు... బరువును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు బరువు ఎక్కువగా ఉన్నట్లయితే... సరైన ఆహారం తింటూ, వ్యాయామం చేయడంతో పాటు మంచు నీటిని కూడా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

First published:

Tags: Health, Health Tips, Life Style, Lifestyle

ఉత్తమ కథలు