HEALTH TIPS DO YOU KNOW ABOUT SALT TEA IT WILL REDUCE SORE THROAT HEADACHE ENERGY BOOSTS IMMUNITY KNOW HOW TO MAKE IT SK
Salt Tea: ఉప్పుతో ఛాయ్.. ఈ టీ తాగితే సీజనల్ వ్యాధులన్నీ పరార్.. ఎలా తయారు చేయాలో తెలుసా?
సాల్ట్ టీ
Salt Tea: చలికాలంలో సాల్ట్ తాగితే శరీరానికి అవసరమైన వెచ్చదనం లభిస్తుంది. రుచి కూడా అదిరిపోతుంది. మరి సాల్ట్ టీ వల్ల ఎలాంటి ప్రయోజాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
చల్లని చలిలో పొగలు కక్కే వేడి వేడి టీ తాగుతుంటే ఆ కిక్కే వేరు. చలి కాలమే కాదు.. ప్రతి ఉదయం ఛాయ్ పడనిదే చాలా మందికి రోజు గడవదు. కొందరైతే కప్పులకు కప్పులు టీ లాగిస్తారు. టీల్లో ఎన్నో రకాలున్నాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, జింజర్ టీ.. ఇలా ఎన్నో వైరైటీలు మనకు లభిస్తున్నాయి. కొందరు టేస్ట్ కోసం తాగితే.. మరికొందరు ఆరోగ్యం కోసం టీ సేవిస్తారు. ఐతే ఇవాళ మరో వెరైటీ టీ గురించి ఇక్కడ తెలుకుందాం. ఆ ఛాయ్ తాగితే చలికాలంలో తరచూ వేధించే జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో శక్తి పెరుగుతుంది. మరి ఆ టీ ఏంటో తెలుసా? సాల్ట్ టీ. అవును.. ఉప్పుతో చేసిన టీ..! సాధారణంగా టీలో చక్కెర వేసుకుంటాం. కానీ ఈ టీలో చక్కెర స్థానంలో ఉప్పు వేసుకోవాలి. చలికాలంలో సాల్ట్ తాగితే శరీరానికి అవసరమైన వెచ్చదనం లభిస్తుంది. రుచి కూడా అదిరిపోతుంది. మరి సాల్ట్ టీ వల్ల ఎలాంటి ప్రయోజాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారు సాల్ట్ టీ తాగితే.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. అంతేకాదు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. తద్వారా మీరు దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు మీ దరి చేరవు.
చలికాలంలో ఉప్పు టీ తాగితే జలుబు, గొంతులో కఫం సమస్య తొలగిపోతుంది. జలుబు చేసినప్పుడు.. మీరు ఒక కప్పు ఉప్పు టీని తీసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. మీ గొంతులో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వస్తుంది. అప్పుడు చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది.
తలనొప్పిని తగ్గించడంలో సాల్ట్ టీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక్క కప్పు టీ తాగితే చాలు.. ఎంతటి తలనొప్పైనా ఇట్టే తగ్గిపోతుంది. బాడీలో శక్తి తగ్గుతోందని అనిపిస్తే.. ఉప్పు టీ తాగండి చాలు. శరీరంలో శక్తి రావడానికి సోడియం అవసరం. ఇది సాల్ట్ టీలో పుష్కలంగా ఉంటుంది. ఈ తాగితే శరీరంలో సోడియం లోపం తగ్గుతుంది.
డయాబెటిక్ పేషెంట్లకు సాల్ట్ ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా షుగర్ పేషెంట్లు చక్కెర వేసిన టీ తాగరు. షుగర్ లేకుండానే చప్పగా తాగుతుంటారు. అలాంట వారు సాల్ట్ టీ తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ టీ వలన శరీరంలో చక్కెర స్థాయి పెరగదు. డాక్టర్ సలహా తీసుకుంటే ఇంకా మంచిది.
సాల్ట్ టీ తయారీ విధానం:
ఉప్పు టీని ఇలానే చేయాలన్న రూల్ ఏమీ లేదు. మన టేస్ట్‌గా నచ్చినట్లుగా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ బ్లాక్ టీని ఇష్టపడితే.. ఒక కప్పు నీటిలో టీ ఆకులు వేసి మరిగించాలి. ఆ తర్వాత కొద్దిగా పింక్ సాల్ట్ వేసుకోవాలి. మనలో చాలా మంది పాలతో చేసిన టీనే తాగుతారు. అలాంటి వారు.. ఒక కప్పు నీటిలో టీ ఆకులు వేసి మరిగించాలి. అనంతరం పాలను పోసి మరికాసేపు ఉడకనివ్వాలి. చివరగా చక్కెర బదులు.. పింక్ సాల్ట్ వేసి కలపాలి. వేడివేడిగా తాగితే.. టేస్ట్ అదిరిపోతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.