బ్లడ్ షుగర్ లెవెల్స్ లో విపరీతమైన హెచ్చుతగ్గులు ఉండే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అత్యధికమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో షుగర్ లెవెల్స్‌లో ఎంత మార్పులు తక్కువ ఉంటే వారు అంత ఆరోగ్యకరమైన జీవితం గడిపే అవకాశాలుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో మార్పులు తరచుగా లేదా అతిగా ఉన్నాయంటే మాత్రం వారు మృత్యువు అంచుకు చేరుకున్నట్టే. అతిగా బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో మార్పులున్నవారు ఆసుపత్రిలో చేరిన మూడేళ్లలో శాశ్వతంగా కన్నుమూస్తున్నట్టు తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. రెండేళ్లపాటు 29,000 మందిపై సాగిన ఈ స్టడీలో పాల్గొన్నవారికి ఎవరికీ మొదట్లో హృద్రోగాలు లేవు.
యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్ A1c స్థాయిలు 2 లేదా 3 నెలలపాటు అదుపులో ఉన్నవారిలో 7 శాతం మంది గుండె జబ్బులు వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టే. లో బ్లడ్ షుగర్‌తో బాధపడేవారు, హై బ్లడ్ షుగర్‌తో బాధపడేవారికి మంచి డైట్ ఇచ్చి, తరచూ వారి షుగర్ లెవెల్స్ పై దృష్టి పెట్టడం ద్వారా వారి షుగర్ లెవల్స్ ఎప్పుడూ ఒకే రకంగా ఉండేలా చూసుకోవచ్చట. ఇదే సమయంలో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి బ్లడ్ హిమోగ్లోబిన్ A1c స్థాయిలపై కూడా పూర్తి ఫోకస్ ఉండాలి అని వెల్లడించారు. అయితే గుండె జబ్బులు రావడానికి బ్లడ్ షుగర్ కి మధ్య ఉన్న సంబంధం గురించి మాత్రం ఈ పరిశోధనలో పూర్తిగా తెలియలేదు.
గ్లూకోజ్ అంటే?
రక్తంలోని గ్లూకోజ్‌ను బ్లడ్ షుగర్ అంటారు. గ్లూకోజ్ హెచ్చుతగ్గులు అత్యధికంగా ఉండే టైప్-2 డయాబెటిక్స్ తమ షుగర్ లెవల్ పై అదుపు సాధించటం అంత సులువు కాదు. కానీ క్రమబద్ధమైన జీవన విధానం, మానసిక ప్రశాంతత, కసరత్తులో ఇది సాధ్యం. డయాబెటిస్ లో టైప్ 1, టైప్ 2 అనే రెండు రకాల మధుమేహాలున్నాయి. ఇది జన్యు సంబంధిత వ్యాధి కనుక దీన్ని నివారించటం అసాధ్యం కానీ మంచి ఆహారం తీసుకోవడం వల్ల దీని ముప్పును తగ్గించవచ్చు. ఫైబర్, ప్రొటీన్, విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాటీ ఫుడ్స్ ను తీసుకోవటం, శారీరకంగా చురుగ్గా ఉండటంతో ఈ వ్యాధి వచ్చే ముప్పును తగ్గించవచ్చు. చేయవచ్చు. అతిగా ఆహారం తీసుకోవటం, లేదా చాలా గంటలపాటు ఆహారం తీసుకోక పోవటం, ప్రాసెస్డ్, ఇన్స్టంట్ ఫుడ్స్ వల్ల షుగర్ లెవెల్స్ బాగా పెరగడం, లేదా తగ్గడం జరుగుతుంది. ఇలాంటి వారికి త్వరగా హృద్రోగాలు వస్తాయి కనుక కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం, ఒంట్లోని కొవ్వును సహజసిద్ధంగా, క్రమంగా వదిలించుకోవటంతో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.
రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చుగా ఉంటే అది రక్త నాళాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. శరీరంలో రక్తం సరిగ్గా ప్రవహించకపోతే అవసరమైన అన్ని అవయవాలకు రక్తం చేరక నాడీ వ్యవస్థ దెబ్బతిని, చూపు కోల్పోవటం, కాళ్లకు ఇన్ఫెక్షన్లు రావటం వంటివి జరుగుతాయి. కిడ్నీలు దెబ్బతినటం, గుండె పోటు, పక్షవాతం, ఏవైనా గాయాలు అయితే గ్యాంగ్రిన్ రావటం వంటివి జరుగుతాయి. మన తెలుగు రాష్ట్రాల్లో చిన్న వయసులోనే మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.