Health Tips : కాన్సర్‌ రిస్క్‌ని తగ్గించే కాఫీ.. రోజూ తాగమని నిపుణుల సూచన..

ప్రతీకాత్మక చిత్రం

కాఫీ అంటే చాలామంది ఎంతో ఇష్టంగా తాగుతారు. దీన్ని తాగగానే ఎంతో రిలీఫ్ పొందుతారు. అయితే, తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి అవేంటంటే..

  • Share this:
ఉదయం లేవగానే కాఫీ తాగడం చాలామందికి అలవాటు.. ఇది అలా తాగగానే ఎంతో హాయిగా ఫీలవుతారు. కొంతమంది అయితే ఈ డ్రింక్‌కి అడిక్ట్ అయిపోతారు. ఒక్కరోజూ తాగనిదే వారికి ఏ పని తోచదు. ఆ ఇష్టంతోనే చాలామంది రచయితలు కూడా దీనిపై పాటలు కూడా రాశారు. అంతటి మహత్తు కాఫీ సొంతం. కాఫీ గురించి ఇంతలా చెబుతున్నారు కానీ అసలు మేటర్ ఏంటని అంటున్నారా.. అదే విషయానికొస్తున్నాం. కాఫీ తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. తాజాగా తేలిన విషయమేంటంటే.. కాఫీలోని కొన్ని సమ్మేళనాలు ప్రొస్టేట్ కాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడతాయని తేలింది. జపాన్‌లోని కనజావా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన సరికొత్త విషయాన్ని తేల్చింది. కాఫీలోని కొన్ని సమ్మేళనాలు ప్రొస్టేట్ కాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడతాయని తేల్చిచెప్పారు శాస్త్రవేత్తలు. కాఫీలోని కహవోల్ యాక్సిటేట్, కేఫ్‌స్టాల్ అనే సమ్మేళనాలు ప్రొస్టేట్ కాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయని తేలింది. 16 ఎలుకలపై జరిగిన ఈ పరిశోధనలో ఈ నిజాలు తేలాయి. కాఫీ ద్వారా లభ్యమయ్యే ఆరు సమ్మేళనాలు ప్రొస్టేట్ కాన్సర్ కణాలు, సాధారణ కాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించాయని తేల్చారు. 

అయితే ప్రయోజనాలున్నాయి కదా అని అతిగా కాఫీ తాగితే దుష్ప్రభావాలున్నాయని చెబుతున్నారు. రోజుకు 2, 3 కప్పుల కాఫీని మించి తాగితే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు.

ఇవి కూడా చదవండి..

Summer Drink Falooda : ఇంట్లోనే ఫలుదా తయారు చేసుకోండిలా..

Health Tips: బీపీని కంట్రోల్ చేసే పచ్చ కర్పూరం
First published: