Home /News /life-style /

HEALTH TIPS CAN MUSIC REALLY CURE YOUR DEPRESSION HERE IS WHAT SCIENCE SAYS SK GH

Music and Health: సంగీతం వింటే మానసిక ఒత్తిడి పరార్.. ఇదిగో ప్రూఫ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Music and Health: 10 నుంచి 20 నిమిషాల మధ్య సంగీతాన్ని వినడం ద్వారా మన మెదడును మరింత ఉత్తేజమవుతుంది. తద్వారా మనసుకు మానసిక ప్రశాంతత చేకూరి నూతన ఉత్సాహంతో పనిచేస్తాం.

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో అందరూ ప్రతి ఒక్కరూ ఒత్తిడి(Depression)కి లోనవుతున్నారు. ఉద్యోగంలో ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు.. ఇలా ఎన్నో రకాలుగా ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇవి క్రమంగా ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది తమ ఉద్యోగాలను కోల్పోయి తమ భవిష్యత్తుపై కలత చెందుతూ ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడి(Depression)కి గురవుతున్నారు. సాధారణ ప్రజలే కాదు.. సెలబ్రిటీలు కూడా ఒత్తిడిని జయించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే, మానసిక ఒత్తిళ్ల నుంచి గట్టెక్కాలంటే మ్యూజిక్( music) వినండని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. భయం(fear), వేదన (anguish), ఒంటరితనం (loneliness) నుంచి బయటపడటానికి సంగీతం చక్కగా పనిచేస్తుందని పేర్కొన్నారు. మ్యూజిక్‌తో ఈ ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించవచ్చని చెబుతున్నారు.

మానసిక వైద్య నిపుణులు ఇటీవల చేసిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయం బయటపడింది. ప్రతికూల వాతావరణంలో మనసుకు నచ్చిన మ్యూజిక్ను వినడం వలన శారీరకంగా, మానసికంగా ఒత్తిడి దూరమవుతుందని వారి అధ్యయనంలో తేలింది. మ్యూజిక్(music) మనిషిలోని విషపూరిత భావోద్వేగాల(negative emotions)ను నియంత్రించడంలో ముఖ్య పాత్ర వహిస్తుందిదని, ఇది మన నాడీ(nervous), న్యూరోఎండోక్రిన్ వ్యవస్థ (neuroendocrine systems )లపై తీవ్ర ప్రభావాన్ని చూపి ప్రతికూల భావోద్వేగాల (emotions)ను నియంత్రిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

2,500 మందిపై అధ్యయనం..

అధ్యయనంలో భాగంగా బర్కిలీ పరిశోధకుల బృందం అమెరికా, చైనాకి చెందిన 2,500 మందిలో భావోద్వేగ (emotions ))ప్రతిచర్యలను విశ్లేషించారు. అధ్యయనంలో పాల్గొన్న వారికి ఎడ్ షీరాన్ రాసిన హిట్ సాంగ్ "ది షేప్ ఆఫ్ యు", "జాస్" సౌండ్‌ట్రాక్‌తో కూడిన సంగీత నమూనాలను వినిపించారు. ఈ సంగీతాన్ని విన్న వారిలో 13 విభిన్న భావోద్వేగాలు ప్రేరేపించడాన్ని వారు కనుగొన్నారు. ఈ 13 భావోద్వేగాల్లో వినోదం, బాధ, శక్తి, శృంగారం, కోపం, ఉద్రేకం వంటివి గుర్తించారు.

కాగా, అధ్యయన రచయిత సీన్ లుజి (Sean Luzi)పేర్కొన్న దాని ప్రకారం “ కేవలం 10 నుంచి 20 నిమిషాల మధ్య సంగీతాన్ని వినడం ద్వారా మన మెదడును మరింత ఉత్తేజమవుతుంది. తద్వారా మనసుకు మానసిక ప్రశాంతత చేకూరి నూతన ఉత్సాహంతో పనిచేస్తాం. మనం వినే సంగీతం అప్పటి మన భావోద్వేగ స్థితిపై ముడిపడి ఉంటుంది.” అని అన్నారు. కాగా, దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్న 60 మంది పెద్దలపై 2006లో హార్వర్డ్ రీసెర్చ్ బృందం (Harvard Harvard research study) అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో మ్యూజిక్ నొప్పి(pain), ఒత్తిడి (depression), మానసిక వైకల్యాన్ని(disability) తగ్గించగలదని వారు కనుగొన్నారు. 2009లో జరిగిన మరో అధ్యయనంలో మ్యూజిక్ అనేది మన నిద్ర నాణ్యత (quality of sleep)ను మెరుగుపరుస్తుందని తేలింది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా నచ్చిన మ్యూజిక్ వినడం ఎంతో మంచిది. సంగీతానికి రాళ్లు కరుగుతాయో లేదో గానీ.. మానసిక ఒత్తిడిని మాత్రం జయించగలమన్న మాట.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Health benefits, Health care, Health tip, MUSIC

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు