పురుషుల్లో ఆ సమస్యను తగ్గించే సొరకాయ..

దంపతులిద్దరూ మానసికంగా దృఢంగా ఉండాలి. ఎంతసేపు సమస్య ఉంది.. ఎలా అని ఆలోచించకుండా..శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరికతో దగ్గరవ్వాలి. అప్పుడే ఎలాంటి సమస్యలనైనా దూరంచేసుకోవచ్చని చెబుతున్నారు.

news18-telugu
Updated: June 22, 2019, 5:43 PM IST
పురుషుల్లో ఆ సమస్యను తగ్గించే సొరకాయ..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 22, 2019, 5:43 PM IST
సంతానలేమి సమస్యలకు చాలా కారణాలుంటంటాయి. ముఖ్యంగా మగవారిలో వీర్యవృద్ధి, లైంగికాసక్తి లేకపోవడం వల్ల కూడా సంతాన సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటివారు డైట్‌లో సొరకాయని చేర్చుకుంటే ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సొరకాయలో జీవక్రియల్ని క్రమబద్ధం చేసే అంశాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల మగవారిలో వీర్యవృద్ధి, లైంగిక శక్తి పెరుగుతుందని కొన్నిపరిశోధనల్లో వెల్లడైంది.

అయితే, సొరకాయలు మాత్రమే కాదు.. వాటి గింజల్లోనూ ఇలాంటి ప్రత్యేక గుణాలు బోలెడున్నాయి. ఈ గింజలను వేయించి.. కొంచెం ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి పౌడర్ చేసి అన్నంతో కలిపి తీసుకుంటుండాలి. ఇలా చేయడం వల్ల మంచి శరీరం సొంతమవ్వడమే కాకుండా.. లైంగిక శక్తిపెరుగుతుందని తేలింది.

వీటితో పాటు రెగ్యులర్‌గా ముందుగా దంపతులిద్దరూ మానసికంగా దృఢంగా ఉండాలి. ఎంతసేపు సమస్య ఉంది.. ఎలా అని ఆలోచించకుండా..శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరికతో దగ్గరవ్వాలి. అప్పుడే ఎలాంటి సమస్యలనైనా దూరంచేసుకోవచ్చని చెబుతున్నారు.

ఈ వీడియో కూడా చూడండి..First published: June 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...