HEALTH TIPS BEST FOODS THAT CAN REDUCE STRESS HERE IS THE DETAILS SU GH
Foods for Mental Health: ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను దూరం చేయాలనుకుంటే.. ఈ ఆహారం తీసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి అనేది సర్వసాధారణంగా మారింది. శారీరక శ్రమ తగ్గిపోవడం, పని ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల ఒత్తిడి, ఆందోళన బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది.
ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి అనేది సర్వసాధారణంగా మారింది. శారీరక శ్రమ తగ్గిపోవడం, పని ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల ఒత్తిడి, ఆందోళన బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యపై దృష్టి పెట్టకపోతే దీర్ఘకాలంలో ఇతర తీవ్రమైన అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి స్థాయులను తగ్గించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఆహార పదార్థాల్లో ఉండే కొన్ని రకాల పోషకాలు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయని పరిశోధనల్లో తేలింది. ఒత్తిడి, ఆందోళన వల్ల శరీరంలో కార్టిసోల్ హార్మోన్ స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల ఆకలి పెరగడం, మధుమేహం, బరువు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. సహజ మార్గాల్లో మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచేందుకు కొన్ని ఆహార పదార్థాలు కృషి చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
1. చేపలు
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా లభించే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ పోషకం ఎక్కువగా లభించే సాల్మన్, ట్రౌట్, మాకెరెల్ వంటి చేపలు, ఇతర సీ ఫుడ్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటినుంచి లభించే DHA (docosahexaenoic acid), EPA (eicosapentaenoic acid) అనే యాసిడ్లు ఒత్తిడిని దూరం చేసి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి వల్ల శరీరంలో ఏర్పడే మంటను (inflammation), కార్టిసోల్ స్థాయులను కూడా ఇవి తగ్గించి ఒత్తిడిని నియంత్రిస్తాయి. చేపలలో ఉండే ఈ ఫ్యాటీ యాసిడ్లను ఎక్కువగా తీసుకుంటే డిప్రెషన్ నుండి కూడా కాపాడుకోవచ్చని పరిశోధనల్లో కనుగొన్నారు.
2. విటమిన్ B12
విటమిన్ B12, ఇతర B విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తూ, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. ముస్సెల్, క్లామ్స్, ఆయిస్టర్స్ వంటి షెల్ ఫుడ్స్ నుంచి విటమిన్ బి12 శరీరానికి అందుతుంది. ఇతర మాంసాహారంలో కాలేయం ఈ పోషకానికి వనరుగా ఉంటుంది. విటమిన్ బి, బి12 లోపాల వల్ల చిరాకు, బద్ధకం, డిప్రెషన్ వంటి ఒత్తిడి సంబంధిత లక్షణాలు అభివృద్ధి చెందే ప్రమాదం పెరుగుతుంది. ఇవి శరీరానికి అందేలా చూసుకోవడం వల్ల మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చు. విటమిన్ బి12 శాకాహారం నుంచి పెద్దగా లభించదు. వీరు డాక్లర్ల సలహాలతో బి12 సప్లిమెంట్లు తీసుకోవాలి.
3. విటమిన్ సి
రోగనిరోధక శక్తిని పెంచే సి విటమిన్ ఒత్తిడి, ఆందోళనను కూడా అదుపులో ఉంచుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, నారింజ, ద్రాక్ష, కివి పండ్ల నుంచి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఇది యాంటీ డిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుందని పరిశోధనల్లో తేలింది. మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వంటి సమస్యను సి విటమిన్ దూరం చేసి, మనసిక అనారోగ్యాలకు దూరంగా ఉంచుతుంది. నిమ్మ, ఇతర పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటే దుష్ర్పభావాలు రావచ్చు. వీటిని పరిమితంగా తీసుకోవాలి.
4. హెల్తీ కార్బోహైడ్రేట్లు
మెదడు పనితీరుపై ప్రభావం చూపే సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడానికి కార్బోహైడ్రేట్లు సహాయపడతాయి. సెరోటోనిన్ సంతోషం, వెల్‌బీయింగ్‌కు కారణమవుతుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించడంతో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలేమి సమస్యలను దూరంచేసి, శరీరానికి, మెదడుకు తగినంత విశ్రాంతి లభించేలా చేస్తుంది. మెదడులో సెరోటోనిన్ స్థాయులు తక్కువగా ఉంటే, మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తెలిసింది. ట్రైప్టోఫాన్ అనే ఎమైనో యాసిడ్ వల్ల మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది అధికంగా లభించే సోయాబీన్స్, బఠానీ, ఇతర ధాన్యాలు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు.
5. మెగ్నీషియం అభించే ఆహారం
ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో మెగ్నీషియం స్థాయులు క్షీణించవచ్చు. దీంతోపాటు మెగ్నీషియం లోపం సమస్య ఉంటే, ఒత్తిడిని పెంచే హార్మోన్లు శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ పోషకం అధికంగా లభించే ఆకుకూరలు, నట్స్, సీడ్స్, చిక్కుళ్లు వంటివి క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చు. దీంతోపాటు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ, చాక్లెట్లు వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.