HEALTH TIPS ARE YOU NOT INTERESTED TO DRINK WINTER THESE FRUITS KEEP YOUR BODY HYDRATED SK
Winter Tips: చలికాలంలో నీరు తాగాలనిపించడం లేదా? ఐతే ఈ పండ్లు తినండి.. చాలా మంచిది
ప్రతీకాత్మక చిత్రం
winter Tips: చలి కాలంలో మీకు నీటిని తాగాలని అనిపించకపోతే.. కొన్ని పండ్లను తీసుకోవచ్చు. అవి మీ శరీరానికి అవసరమయ్యే నీటిని అందిస్తాయి. బాడీలో వాటర్ లెవెల్‌ను మెయింటేన్ చేస్తాయి.
చలి కాలం (Winter)లో చాలా మంది నీరు తక్కువగా తాగుతుంటారు. శరీరానికి అవసరమైన మోతాదులో నీరు తీసుకోరు. దాహం వేసినా నీళ్లు తాగలని అనిపించదు. ఏదో అన్నం తిన్నాక.. కాస్త తాగుతారు. తప్ప మిగతా సమయాల్లో నీరు తీసుకునేందుకు పెద్దగా ఇష్టపడరు. కానీ శరీరానికి సరిపడా నీటిని తాగకపోతే ఇబ్బందులు వస్తాయి. డీహైడ్రేషన్ (Dehydration)తో పాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే శరీరానికి అవసరమయ్యే నీటిని మనం అందిస్తుండాలి. ఐతే వింటర్లో మీకు నీటిని తాగాలని అనిపించకపోతే.. కొన్ని పండ్లను తీసుకోవచ్చు. అవి మీ శరీరానికి అవసరమయ్యే నీటిని అందిస్తాయి. బాడీలో వాటర్ లెవెల్‌ను మెయింటేన్ చేస్తాయి. మరి ఆ పండ్లేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పుచ్చకాయ (Water Melon): పుచ్చకాయను చాలా మంది వేసవిలో తింటుంటారు. కానీ ఈ పండు ప్రతి సీజన్లోనూ అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరకే లభిస్తుంది. సూపర్ మార్కెట్లలో ఈజీగా దొరుకుతుంది. శరీరంలో నీటి కొరతను తీర్చేందుకు పుచ్చకాయను తినవచ్చు. పుచ్చకాయలో నీరు 90 శాతం కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, ఐరన్, విటమిన్లు A, C మరియు B సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసే లైకోపీన్ అనే మూలకం కూడా ఇందులో ఉంటుంది. పుచ్చకాయను తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరడమే కాదు.. ఎముకల గట్టి పడతాయి. కండరాలను బలోపేతమవుతాయి. రక్తం పెరుగుతుంది. మల బద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
నారింజ (Oranges) నారింజ పండ్లు కూడా ప్రతి సీజన్లో లభిస్తాయి. ఇవి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఐతే వీటిని శీతకాలంలో తింటే జలుబు చేస్తుందని చాలా మంది అపోహ పడుతుంటారు.కానీ అలా ఏమీ ఉండదు. ఇందులో 92 కంటే ఎక్కువ శాతం నీరుటుంది. వీటిని తింటే శరీరంలో నీటి స్థాయులు సరిగ్గా మెయింటేన్ అవుతాయి. ఈ పండ్లల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్లు సి, ఎ, బి పుష్కలంగా ఉంటాయి. శరీరంలో నీటి కొరత సమస్యను తగ్గించడమే కాదు.. బీపీని కూడా నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తి (Immunity)ని పెంచుతుంది. చర్మానికి మంచి నిగారింపు తీసుకొస్తుంది.
దోసకాయలో 80 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. శరీరంలో నీటిని అవసరమైన స్థాయిలో ఉంచేందుకు దోసకాయను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో విటమిన్ కె, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. దోసకాయ దాహాన్ని తీర్చడంతో పాటు శరీరంలో సరైన నీటి స్థాయిని మెయింటేన్ చేసేందుకు దోహదపడుతుంది. అంతేకాదు దోసకాయ మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుపర్చుతుంది. ఎములకను దృఢంగా చేస్తుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.