Custard apple Health Benefits: సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

Custard apple Health Benefits : సెప్టెంబర్ రాగానే... సీతాఫలాలు పలకరిస్తాయి. ఎంతో రుచికరమైన ఈ పండు నిజంగానే మనకు దివ్యౌషధం అనుకోవచ్చు. దీని ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల్ని ఓసారి తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 25, 2020, 4:02 AM IST
Custard apple Health Benefits: సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి
Health Tips : సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి
  • Share this:
Custard apple Health Benefits : వినాయకచవితి రాగానే మనకు సీతాఫలాలు కనిపిస్తాయి. మన అదృష్టం కొద్దీ ఈ చెట్లు ప్రతి చోటా ఉంటాయి. ప్రస్తుతం సీతాఫలాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటూ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ పండ్లను కొనుక్కుంటున్నారు. అందువల్ల వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంతలా కొనుక్కోవడానికి కారణం వీటిలో తీపి రుచితోపాటు... ఎన్నో పోషకాలు కలిగి ఉండటమే. మీకు తెలుసా... సీతాఫలంలో మన బాడీలోని విష వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎంతో మేలు చేసే విటమిన్ C ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటివి మన గుండెను కాపాడేస్తాయి. అందువల్లే సీతాఫలాలకు అంతలా డిమాండ్ పెరిగిపోయింది.

బీపీని కంట్రోల్ చేసే శక్తి కూడా సీతాఫలాలకు ఉంది. ఈ పండ్లలోని విటమిన్ A... మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మన కంటి చూపు కూడా మెరుగవుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు సీతాఫలం తింటే... జీర్ణక్రియ బాగా అవుతుంది. ఈ ఫలంలోని కాపర్... మలబద్ధకాన్ని తరిమికొడుతుంది. డయేరియాకు చెక్ పెట్టే గుణం సీతాఫలానికి ఉంది.

సీతాఫలంలోని మెగ్నీషియం... మన బాడీలోని వాటర్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది. కీళ్లలోని యాసిడ్స్‌ని బయటకు తరిమేసి... రుమాటిజం, కీళ్లనొప్పులకు చెక్ పెడుతుంది. మీకు నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే సీతాఫలం తినండి. ఇందులోని పొటాషియం... మీ కండరాల బలహీనతను తగ్గించి... మీకు శక్తిని ఇస్తుంది.

రక్తహీనతతో బాధపడేవారు సీతాఫలం తినాలి. ఎందుకంటే ఇందులో కేలరీలు ఎక్కువ. బరువు పెరగాలంటే కూడా సీతాఫలం చక్కటి పండు. ఇందులోని సహజ చక్కెర... ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆస్తమాతో బాధపడేవారు కస్టర్డ్ యాపిల్ (సీతాఫలం) తింటే మేలు జరుగుతుంది. ఇందులోని విటమిన్ B6... ఆస్తమాకి చెక్ పెడుతుంది.

గర్భిణీలు కూడా తప్పక తినదగ్గ పండు సీతాఫలం. పిల్లలు పుట్టే సమయంలో నొప్పుల్ని నివారించే గుణం ఈ పండుకి ఉంది.

డయాబెటిస్ ఉన్నవారు కూడా సీతాఫలం తినవచ్చు. ఇందులో భారీగా ఉండే డైటరీ ఫైబర్ (జీర్ణమయ్యే పీచు పదార్థం)... షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. టైప్-2 డయాబెటిస్ మరింత పెరగకుండా చేస్తుంది. బరువు తగ్గాలంటే కూడా సీతాఫలం తినాలి. ఇందులోని నియాసిన్, ఫైబర్... కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. అందువల్ల రేటు ఎక్కువైనా ఈ సీజన్‌లో సీతాఫలాలు కొనుక్కు తింటే మంచిదే.
Published by: Krishna Kumar N
First published: September 25, 2020, 3:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading