Health Tips : గుండెసమస్యలు రాకుండా చేసే పొద్దు తిరుగుడు గింజలు

పొద్దుతిరుగుడు గింజలు.. వీటి గురించి చాలా తక్కువమందికి తెలుసు. కానీ, ఈ గింజలు తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. అవేంటో తెలుసుకుని .. ఈ గింటజలను మీ డైట్‌లో భాగం చేసుకోండి..

Amala Ravula | news18-telugu
Updated: April 21, 2019, 6:59 PM IST
Health Tips : గుండెసమస్యలు రాకుండా చేసే పొద్దు తిరుగుడు గింజలు
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 21, 2019, 6:59 PM IST
సాధారణంగా స్నాక్స్ అనగానే మన మనసు బర్గర్, సమోసా, చిప్స్ వంటి వాటిపైకి మళ్లీస్తాం. కానీ అలా కాకుండా ఆరోగ్యకరమైనవాటినే కాస్తా కొత్తగా ఆలోచించుకుని స్నాక్స్‌లా చేసుకుని తింటే ఎంత బావుంటుంది. అలాంటి వాటిలో ఇప్పుడు తెలుసుకోవాల్సిది పొద్దుతిరుగుడు గింజలు గురించి.. సూపర్ మార్కెట్స్, కిరాణా షాపుల్లో దొరికే వీటిని తీసుకొచ్చి వాటిని స్నాక్స్‌లా చేసుకుని తినండి..
* పొద్దుతిరుగుడు గింజలను రెగ్యులర్‌గా తినవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది.
* అదే విధంగా.. క్యాన్సర్‌ని అడ్డుకునే గుణాలు పొద్దుతిరుగుడు గింజల్లో ఎక్కువగా ఉంటాయి.

* వీటిని తినడం వల్ల హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
* పొద్దుతిరుగుడు గింజల చూర్ణానికి చక్కెర పొడి సమానంగా కలిపి రోజు ఐదుగ్రాముల చొప్పున రెండు పూటల తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి.
* పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తింటే రక్తనాళాల్లో ఉండే కొవ్వు తగ్గుతుంది. దీంతో గుండెజబ్బులు రాకుండా ఉంటాయి


* రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో మంచి కొలెస్ట్రాల్‌ని పెంచడంలో పొద్దుతిరుగుడు గింజలు ముందుంటాయి.
Loading...
* వీటిని తినడం వల్ల డయాబెటీస్, గాయిటర్, థైరాయిడ్ వంటి ఎన్నో సమస్యలు కూడా అదుపులో ఉంటాయని తేలింది. గింజల్లోని ప్రత్యేక గుణాలు అనేక ఆరోగ్య సమస్యలకు చక్కని ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

ఎండల్లో బయటికి వెళ్తున్నారా.. ఈ మజ్జిగ తాగండి.. ఎలా చేయాలంటే..

Summer Tips : సమ్మర్‌లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తున్నారా.. అయితే జాగ్రత్త..
First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...