Health Tips : ఇంట్లో ఎక్కువగా దూప్‌స్టిక్స్, అగరుబత్తులు వెలిగిస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

మనం అగరుబత్తి, దూప్ స్టిక్స్ వెలిగించడం వల్ల ఉన్నట్టుండి దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. ఆ సమస్యను మనం తేలిగ్గా తీసుకోవద్దు.. ఎందుకంటే.. చాలాసమయాల్లో దూప్‌స్టిక్స్, అగరుబత్తులు పాలీఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు, కార్బన్‌డైఆక్సైడ్ కలిగిఉంటాయి. దీని వల్ల జలుబు, దగ్గు వంటి చిన్న సమస్యలే కాదు.. ఆస్తమా, క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యలు కూడా చుట్టుముడతాయి.

news18-telugu
Updated: June 3, 2019, 9:54 AM IST
Health Tips : ఇంట్లో ఎక్కువగా దూప్‌స్టిక్స్, అగరుబత్తులు వెలిగిస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం(image: shutterstock)
news18-telugu
Updated: June 3, 2019, 9:54 AM IST
హిందూ సంప్రదాయం ప్రకారం చాలామంది ఇళ్లల్లో అగరుబత్తి, దూప్‌స్టిక్స్ వెలిగిస్తూ ఉంటారు. ఓరకంగా చెప్పాలంటే భారతీయ పూజాసామాగ్రిల్లో వీటికి ప్రత్యేకస్థానం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనసు ప్రశాంతంగా ఉంటుందని కూడా వీటిని ఆశ్రయిస్తుంటారు ప్రజలు. అయితే.. ప్రతి విషయంలోనూ సత్ఫలితాలు ఎన్ని ఉంటాయో.. వాటి వెనుక దుష్ఫలితాలూ అన్నే ఉంటాయి. అన్ని ప్రతిఒక్కరికీ సరిపోతాయనుకోవడం.. సరికాదు.. కాబట్టి.. వీటి వల్ల కలిగే ఇబ్బందులను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

* మనం అగరుబత్తి, దూప్ స్టిక్స్ వెలిగించడం వల్ల ఉన్నట్టుండి దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. ఆ సమస్యను మనం తేలిగ్గా తీసుకోవద్దు.. ఎందుకంటే.. చాలాసమయాల్లో దూప్‌స్టిక్స్, అగరుబత్తులు పాలీఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు, కార్బన్‌డైఆక్సైడ్ కలిగిఉంటాయి. దీని వల్ల జలుబు, దగ్గు వంటి చిన్న సమస్యలే కాదు.. ఆస్తమా, క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యలు కూడా చుట్టుముడతాయి.
* అగరుబత్తులు, స్టిక్స్‌లను వెలిగించడం వల్ల విడుదలయ్యే సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్‌డై మోనాక్సైడ్‌ల కారణంగా చిన్నపిల్లలు, యువకుల్లో చర్మ, కంటి సంబంధిత * * అలర్జీలు వస్తున్నాయి. అంతేకాదు.. ఎక్కువగా ఈ వాయువును పీల్చడం ద్వారా COPD, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి.

సమస్య ముదిరితే ఉపిరితిత్తుల శాసనాళాల్లో పొగు ఎక్కువగా మారి క్యాన్సర్‌కి కారకమవుతుంది.
* ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది.


కాబట్టి.. ఇలాంటి సమస్యలను గమనించినప్పుడు.. ముందుగానే మేల్కోవడం చాలా ముఖ్యం.

ఈ వీడియో కూడా చూడండి..
First published: June 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...