హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Mushroom Soup : పుట్టగొడుగుల సూప్... తయారీ విధానం ఇదీ...

Mushroom Soup : పుట్టగొడుగుల సూప్... తయారీ విధానం ఇదీ...

పుట్టగొడుగుల సూప్ (credit - twitter - Frances)

పుట్టగొడుగుల సూప్ (credit - twitter - Frances)

Healthy Diet : పోషకాలు ఫుల్లుగా ఉండే పుట్టగొడుగులతో సూప్ చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. టేస్టుకి టేస్టు, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎలా తయారుచెయ్యాలో తెలుసుకుందాం.

Health Tips : మనందరికీ... కొత్త కొత్త రెసిపీలను టేస్ట్ చెయ్యాలని ఉంటుంది. ఎందుకంటే... ఎప్పుడూ అవే వంటలు, అవే కూరలు తినాలంటే బోరే కదా. అందుకని పుట్టగొడుగులతో 3 రకాల సూప్స్ తయారీ తెలుసుకుంటే... కొత్త రుచుల్ని టేస్ట్ చెయ్యొచ్చు. నిజానికి పుట్టగొడుగులనేవి ఒక రకమైన ఫంగస్. బ్యాక్టీరియాలో ఎలాగైతే మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా అని ఉంటాయో... ఫంగస్‌లో కూడా మష్రూమ్స్ అనేవి మంచివన్నమాట. ఐతే పుట్టగొడుగుల్లో రెండు రకాలుంటాయి. ఒకటి మనం సాగుచేసి పండించేవి. రెండో రకం అడవుల్లో వాటంతట అవే పెరిగేవి. మనం సాగుచేసేవాటిలో బట్టన్ మష్రూమ్స్, షీటేక్ మష్రూమ్స్, మేటేక్ మష్రూమ్స్, మోరెల్స్, గుచ్చీ మష్రూమ్స్ పేరున్నవి. రుచికి తోడు... వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో... వీటిని బాగా తినమని డాక్టర్లు సూచిస్తున్నారు.

మనకు సూపర్ మార్కెట్లలో బటన్ మష్రూమ్స్ ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిలో కేలరీలు చాలా తక్కువ. 100 గ్రాముల పుట్టగొడుగుల్లో కేలరీలు 22 మాత్రమే ఉంటాయి. ఫ్యాట్ దాదాపు ఉండదు. అందువల్లే ఈ రోజుల్లో పుట్టగొడుగుల పొడిని కూల్ డ్రింక్స్, కాఫీలు, స్మూతీలు, టీలలో వాడుతున్నారు. వంటల్లో ఎలాగూ వాడుతున్నాం. ఇటీవల పాస్తాలు, రైస్ డిషెస్‌తోపాటూ... పిజ్జాలు, ఫ్రైల్లో కూడా వీటిని వాడుతున్నారు. కాబట్టి మనం మూడు రకాల మష్రూమ్ సూప్స్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.

1. బ్రకోలీ క్రీమ్, మష్రూమ్ సూప్ రెసిపీ :

టైమ్ ఎక్కువగా లేనప్పుడు... బ్రకోలీ, బటన్ మష్రూమ్‌లను కుక్కర్‌లో వేసి... కాస్త నీరు పోసి వండితే రుచికరమైన సూప్ రెడీ. గార్నిషింగ్ కోసం కాస్తంత డైరీ క్రీమ్ వేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే... కాస్త సోంపు, మిరియాల పొడిని పైపైన చల్లుకోవచ్చు. కొద్దిగా ఉప్పు కూడా కలిపి తీసుకుంటే... సూప్ సూపరే.

2. మష్రూమ్ క్లియర్ సూప్ రెసిపీ :

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే క్లియర్ సూప్స్. దీన్ని ఇతర కూరగాయలు, ఆకు కూరలతో కలిపి వండుకోవచ్చు. చిన్న మంటపై మెల్లగా ఉడికించడం ద్వారా... పోషకాలన్నీ మనకు అందడమే కాదు... మంచి టేస్ట్ కూడా ఉంటుంది. జపాన్ ప్రజలు ఎక్కువగా ఇలాంటి సూప్ తయారుచేసుకుంటారు.

3. బాదాం, మష్రూమ్ సూప్ రెసిపీ :

కాస్త ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అనుకునేవారికి ఈ సూప్ బాగా నచ్చుతుంది. పుట్టగొడుగుల ముక్కలు, బాదాం ముక్కల్ని కలిపి... అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి కలిపి... కొద్దిగా నీరు, పాలు పోసి... బాగా కలపాలి. సూప్ గట్టిపడేవరకూ... సిమ్‌లో వండుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి కలుపుకొని తింటే ఉంటుందీ... టేస్టే టేస్టు.

First published:

Tags: Health benefits, Health Tips, Life Style, Tips For Women, Women health

ఉత్తమ కథలు