Health Tips : కిడ్నీల్లో రాళ్లున్నాయా.. కొబ్బరినీళ్లు తాగండి..

కొబ్బరి నీళ్లు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. అవేంటంటే..

Amala Ravula | news18-telugu
Updated: June 3, 2019, 5:29 PM IST
Health Tips : కిడ్నీల్లో రాళ్లున్నాయా.. కొబ్బరినీళ్లు తాగండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: June 3, 2019, 5:29 PM IST
ఎండాకాలంలో శరీరంలోని నీరు చెమటరూపంలో బయటికి వెళ్లిపోతుంది. అలాంటప్పుడు ఎక్కవుగా లిక్విడ్స్ తీసుకోవాలి. దీంతో మన శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా ఉంటాయి. ముఖ్యంగా కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం ఎవరికైనా ఆరోగ్యసమస్యలున్నా వారికోసం కొబ్బరినీళ్లు తీసుకెళ్తుంటాం. వైద్య నిపుణులు చెప్పేదేంటంటే..
* సెలాయిన్స్‌‌లో ఉండే సమానమైన మినరల్స్ కొబ్బరినీళ్లలో ఉంటాయి. కాబట్టి ఎండాకాలంలో ఈ కొబ్బరినీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అలసిన శరీరానికి తిరిగి ఉత్తేజం ఇచ్చినట్లువుతుందని చెబుతున్నారు.
* కొబ్బరి నీళ్లల్లో ప్రోటీన్స్, కొవ్వు, పిండిపదార్థాలు, డైటరీ ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

* గ్లాసు కొబ్బరినీళ్లల్లో 2 టీస్పూన్స్ నిమ్మరసం వేసి కలిపి తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యమవుతాయి.
*  కొబ్బరినీళ్లు తాగడం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. హార్ట్ పేషెంట్స్ వీటిని తాగడం చాలా మంచిది.
*  కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు మూత్రనాళ ఇన్ఫెక్షన్లని తగ్గిస్తాయి.


*  కొబ్బరినీళ్లు బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది.
Loading...
*  అదేవిధింగా కొబ్బరినీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయంలోని టాక్సిన్లని అరికడతాయి.
*  కిడ్నీలోని రాళ్లను కరిగించే లక్షణాలు కొబ్బరినీళ్లలో ఎక్కువగా ఉన్నాయి.
*  కొబ్బరి బోండాలు రెగ్యులర్‌గా తాగితే అధికబరువు అదుపులోకి వస్తుంది.
*  రోజూ ఉదయాన్నే కొబ్బరినీటిని తాగడం వల్ల శరీరరోగ నిరోధక శక్తి పెరుగుతుతుంది. దీంతో.. బాడీలోని చెడు బాక్టీరియా, వైరస్‌లు బయటికి వెళ్లిపోతాయి.
*  కొబ్బరినీళ్లని తాగడం వల్ల అజీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.
*  అదేవిధంగా.. శరీరానికి కొత్త శక్తినిచ్చి రోజంతా యాక్టివ్‌గా ఉంచడంలో కొకనట్ వాటర్ ముందుంటుంది.
*  చర్మకాంతిని మెరుగుపరుచడంలో కొబ్బరినీళ్లు ముందుంటాయి.
* కొబ్బరినీళ్లని తాగడం వల్ల నేత్రసమస్యలు తగ్గిపోతాయట.
* కొబ్బరినీళ్లు తాగడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
First published: June 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...