వైద్యుల నిర్లక్ష్యం : కరోనా వ్యాక్సిన్ కు బదులు, రెబీస్ టీకా ఇచ్చిన వైద్యులు

ప్రతీకాత్మక చిత్రం

యూపీలో వైద్యుల నిర్లక్ష్యం : కరోనా వ్యాక్సిన్ కు బదులు, రెబీస్ టీకా ఇచ్చిన వైద్యులు యూపీలో షాకింగ్ న్యూస్, సృహ తప్పి పడిపోయిన మహిళ, సంఘటనపై జిల్లా న్యాయస్థానం విచారణ

  • Share this:
రోగులకు వైద్యం చేసి కోంత మంది దేవుళ్లు అయితే...మరికొంత మంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆ వృత్తికే కలంకం ఏర్పడుతుంది. కొంతమంది వైద్యులు తాము చేయాల్సిన వైద్యానికి బదులుగా మరో రకమైన చికిత్స చేయడం లేదంటే ఆపరేషన్ చేసి కడుపులోనే కత్తులు మరిచిపోవడంతో పాటు వైద్య చికిత్సలో వింత వింత సంఘటలనకు కారణమవుతారు కొంతమంది వైద్యులు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి యూపీలో జరిగింది.

ప్రస్తుతం కరోనా తీవ్ర రూపం దాల్చడంతో టీకా వేసుకునేందుకు ప్రజలు ఆసుపత్రులు, ఇతర టీకా ఇచ్చే సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ప్రభుత్వాలు అంత్యంత జాగ్రత్తగా, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు టీకా పంపిణి చేస్తుంటే వైద్యులు మాత్రం టీకా పంపీణిలో కూడ నిర్లక్ష్యం వహించారు. ఈ నేపథ్యంలోనే యూపీ లో షమ్లి జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు కరోనా వ్యాక్సిన్ కు బదులుగా యాంటీ రేబిస్ వ్యాధి వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సంఘటన కలకలం రేపుతోంది.

జిల్లాలోని సరోజ్, అనార్కలి, మరియు సత్యవతి అనే మహిళలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా వేయించుకునేందుకు వెళ్లారు. టీకా వేయించుకునేందుకు సిరంజీని తెచ్చుకోవాలని చెప్పడంతో బయట నుండి తీసుకువచ్చారు. వారికి ముగ్గురికి కరోనా టీకా కు బదులుగా రెబీస్ వ్యాధి టీకా వేశారు. అనంతంర వారికి రెబీస్ వ్యాధి టీకా వేసినట్టుగా స్లిప్ కూడ ఇచ్చి పంపారు.

అయితే కాసేపటికి సరోజ్ అనే మహిళ స్పృహ తప్పి క్రింద పడిపోయిది.దీంతో ఆందోళన చెందిన కుటుంభ సభ్యులు స్థానిక ప్ర్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో సరోజ్ పరీక్షించిన డాక్టర్ ప్రభుత్వ వైద్యులు ఇఛ్చిన టీకా స్లిప్ ను పరీశీంచారు. దీంతో ఆశ్చర్య పోవడం డాక్టర్ వంతయింది. వారు యాంటి రెబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా కుటుంభ సభ్యులకు తెలిపాడు. దీంతో విషయం ఉన్నతాధికారులతో పాటు జిల్లా న్యాయస్థానానికి చేరింది. సంఘనటపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని న్యాయం
స్థానం వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Published by:yveerash yveerash
First published: