HEALTH THIS WINTER KEEP DRY SKIN WOES AT BAY WITH THESE SIMPLE TIPS GH VB
Winter Skin Care: చలికాలంలో చర్మం పొడిబారుతోందా..? ఈ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి..
ప్రతీకాత్మక చిత్రం
Winter Skin Care: చలికాలం చాలామందికి ఇష్టమే. కానీ ఇదే కాలంలో దగ్గు, జలుబు లాంటి కొన్ని అనారోగ్యాలతో సహా చర్మ వ్యాధులు వేధిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే శీతాకాలం మొదలైంది. ఈ క్రమంలో చర్మాన్ని చలి నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం తప్పనిసరి.
చలికాలం చాలామందికి ఇష్టమే. కానీ ఇదే కాలంలో దగ్గు, జలుబు లాంటి కొన్ని అనారోగ్యాలతో సహా చర్మ వ్యాధులు వేధిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే శీతాకాలం మొదలైంది. ఈ క్రమంలో చర్మాన్ని చలి నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడం తప్పనిసరి. చలికాలంలో చర్మం నుంచి ద్రవాలు(sebum), తేమంతా ఆవిరైపోతుంది. ఫలితంగా చర్మం పొడిగా తయారవుతుంది. దీనివల్ల బాగా సున్నితమైన చర్మం ఉన్నవారికి శీతాకాలపు దద్దుర్లు కూడా వస్తుంటాయి. అందుకే చలికాలం పూర్తయ్యేవరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చర్మవ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు. పొడి చర్మ సమస్యలకు కొన్ని చిట్కాల ద్వారా చెక్ పెట్టొచ్చని అంటున్నారు. మరి వైద్య నిపుణుల ప్రకారం, చర్మం పొడిబారకుండా ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పొడి చర్మతత్వం ఉన్నవారు ప్రతిరోజూ స్నానం చేస్తున్నప్పుడు శరీరాన్ని సబ్బుతో రుద్ది కోవాల్సిన అవసరం లేదు. బాహుమూలల్లో సబ్బు రుద్దుకుంటుంటే సరిపోతుంది. మిగతా ప్రాంతాల్లో వారంలో ఒకటి రెండుసార్లు సోప్(soap)అప్లై చేసినా ఎలాంటి సమస్యలు రావు. అంతేకాకుండా మొక్కల ఆధారిత నూనెలతో తయారుచేసిన గ్లిజరిన్ సోప్(glycerine based soap)తోనే స్నానం చేయండి. అలాగే చలికాలంలో కూడా ప్రకాశవంతమైన చర్మం కోసం నాణ్యమైన మాయిశ్చరైజర్లు వాడండి.
స్నానం చేసిన తర్వాత కొద్ది మొత్తంలో మాయిశ్చరైజర్ శరీరంపై అప్లై చేయడం ద్వారా చర్మం తేమను కోల్పోదు. వైద్యుల ప్రకారం యూరియా ఆధారిత హ్యాండ్, ఫుట్ క్రీమ్ యూజ్ చేయడం ద్వారా పొడి చర్మానికి చరమగీతం పాడొచ్చు.
*డ్రై స్కిన్/ పొడిచర్మం తో బాధపడేవారి కోసం సింపుల్ టిప్స్
- బాగా వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయకండి. అలాగే మరీ చల్లగా ఉన్న నీళ్లతో కూడా స్నానం చేయకండి.
- చలికాలంలో ముఖ్యంగా పెదాలు పగులు తుంటాయి. అయితే చర్మంపై పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో సహజసిద్ధమైన అలోవెరా లేదా కొబ్బరి నూనె అప్లై చేయండి. మీ ఆయిల్ రోజుకి రెండు మూడు సార్లైనా అప్లై చేసుకోవచ్చు.
- క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోండి. పోషకాలు సమృద్ధిగా లభించే సీజనల్ ఫ్రూట్స్ తరచూ తినండి. అంతేకాకుండా తరచూ మంచి నీరు తాగడం ద్వారా చర్మం పొడి బారదు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.