భారత్‌లో విస్కీ (Whiskey) టాప్ ఆల్కహాల్ (Alcohol) డ్రింక్‌గా నిలుస్తోంది. అత్యంత వైవిధ్యమైన ఆల్కహాల్స్‌లో ఒకటైన విస్కీకి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మందుబాబులను ఆకట్టుకునే టాప్ విస్కీ బ్రాండ్‌లన్నిటికీ భారతదేశం నిలయమంటే మీరు నమ్ముతారా.. నమ్మి తీరాల్సిందే! ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మందు ప్రియులకు ఫేవరెట్ అయిన డ్రింక్స్(Drinks) అన్నీ ఇండియాలోనే తయారవుతున్నాయి. బ్లెండెడ్ డ్రింక్స్ నుంచి సింగిల్ మాల్ట్ స్పిరిట్స్(Spirits) వరకు, గ్లోబల్ మార్కెట్‌లో(Global Market) అత్యంత ప్రజాదరణ పొందిన అంతర్జాతీయ విస్కీ(Whisky) బ్రాండ్‌లన్నీ దేశంలో లభిస్తున్నాయి. ఈ డ్రింక్స్‌ను పులియబెట్టడం, స్వేదనం లేదా శుద్ధి చేయడం, తయారు చేయడం వంటి అన్ని ప్రక్రియలు భారత్‌లోనే జరుగుతున్నాయి. అయితే ఇంటర్నేషనల్ ఆల్కహాల్ ప్రియులను ఆకట్టుకునే కొన్ని ఇండియన్ విస్కీ(Indian Whisky) బ్రాండ్‌లు ఏవో తెలుసుకుందాం.
పాల్ జాన్ సింగిల్ మాల్ట్ విస్కీ (Paul John Single Malt Whiskey)
అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న పాల్ జాన్ సింగిల్ మాల్ట్ విస్కీ ప్రతి సిప్ (Sip)లో ఇండియన్ టేస్ట్ ఉంటుంది. ఈ డ్రింక్ తాగిన ప్రతిసారీ పసుపు, సాల్టెడ్ వెన్న, సోపు గింజలు, టోఫీ, పంచదార పాకం లాంటి తీపి కలగలిపిన టేస్ట్‌ను ఆస్వాదించవచ్చు. ఈ విస్కీ గోవాలో మొదటిసారిగా తయారైంది. విశేషమేంటంటే, విస్కీ వ్యసనపరుడు, సలహాదారు జిమ్ ముర్రే సింగిల్ మాల్ట్ స్పిరిట్‌కు "లిక్విడ్ గోల్డ్ అవార్డ్" ఇచ్చారు.
వుడ్‌బర్న్స్ విస్కీ (Woodburns Whiskey)
గోవా తీరంలో తయారయ్యే మరో విస్కీ వుడ్‌బర్న్స్ విస్కీ. ఈ విస్కీ మీ అంగిలి లేదా నాలుకకు ఒక డిఫరెంట్ టేస్ట్‌ను అందిస్తుంది. కాండేపర్ గ్రామంలోని ఒక కుటుంబం ఈ డ్రింక్‌ను తయారు చేస్తోంది. వుడ్‌బర్న్స్ విస్కీ కాలిన ఓక్ బారెల్స్‌లో పులియబెడతారు. అందుకే ఈ డ్రింక్‌కు పొగ లాంటి ఒక ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది.
అమృత్ ఫ్యూజన్ సింగిల్ మాల్ట్ విస్కీ (Amrut Fusion Single Malt Whiskey)
అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన అమృత్ ఫ్యూజన్ సింగిల్ మాల్ట్ విస్కీని బెంగళూరులోని అమృత్ డిస్టిలరీస్‌లో తయారు చేస్తారు. ఈ డ్రింక్‌కు ప్రపంచంలో మూడో అత్యుత్తమ విస్కీగా ఒక టైటిల్‌ను జిమ్ ముర్రే ఇచ్చారు. ఈ విస్కీ భారతీయ మూలాలు కలిగిన మొదటి సింగిల్ మాల్ట్ విస్కీ కావడం విశేషం.
రాంపూర్ సింగిల్ మాల్ట్ విస్కీ (Rampur Select Single Malt Whiskey)
50 ఏళ్ల అనుభవం ఉన్న రాడికో ఖైతాన్ (గతంలో రాంపూర్ డిస్టిలరీస్) మొలాసిస్ ఆధారిత విస్కీని 2016లో తొలిసారిగా తయారుచేసింది. ఈ రాంపూర్ సింగిల్ మాల్ట్ విస్కీ అందుబాటులోకి వచ్చిన సమయం నుంచి బాగా పాపులర్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో అనూహ్య పాపులారిటీని దక్కించుకుంది.
ఆఫీసర్స్ ఛాయిస్ (Officer’s Choice)
అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ అనే ముంబైకి చెందిన మందు తయారీ సంస్థ ఆఫీసర్ ఛాయిస్ అనే బెస్ట్ విస్కీ ని తయారుచేసింది. ఇది ధాన్యం ఆధారంగా తయారు చేసే విస్కీ. భారతదేశంలో సరసమైన, ప్రసిద్ధ విస్కీ బ్రాండ్‌గా ఈ విస్కీ పేరు తెచ్చుకుంది. ఈ డ్రింక్ అంతర్జాతీయ బార్‌లలో బెస్ట్ విస్కీగానూ నిలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.