Health Tips: డెంగీ జ్వరం రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Health Tips: తెలుగు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ఏడాది దీనివల్ల ఇప్పటికే పదుల సంఖ్యలో మృతి చెందగా, వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 26, 2019, 5:20 PM IST
Health Tips: డెంగీ జ్వరం రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాలు, విష జ్వరాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ఏడాది దీనివల్ల ఇప్పటికే పలువురు మృతి చెందగా, వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. అసలు డెంగీ అనేది ఒక వైరస్. ‘ఈడిస్ ఈజిప్టై’ అనే ఒక రకం ఆడదోమ కుట్టడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. పగటిపూట ఈ దోమ కుడితే కొద్ది రోజుల్లోనే డెంగీ బారిన పడతాం. ఇది జ్వరంతో ప్రారంభ‌మై ప్రాణాలు తీసే వ‌ర‌కు వెళ్తుంది. పరిసరాల పరిశుభ్రత, ముందు జాగ్రత్త చర్యలతో దీనికి చెక్ పెట్టవచ్చు. డెంగీ జ్వరం వస్తే శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. దాంతో రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. అలా శరీరమంతా అధిక నొప్పులు వచ్చి.. మంచాన పడే పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి మరణం సంభవించే ప్రమాదమూ ఉంది.

అందువల్ల ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలేంటంటే..


  • ఫ్లవర్‌ వాజ్‌, ఎయిర్‌ కూలర్‌ నీళ్లను మార్చుతూ ఉండాలి. కాలనీ, ఇళ్లలో నిల్వ ఉండే నీటి గుంతలను పూడ్చాలి.

  • ప్లాస్టిక్‌ బకెట్లు, ట్యూబ్‌, టైర్లు ఇళ్లలో ఉంచవద్దు. ఇంటిపై ఉండే నీళ్ల ట్యాంకులకు కచ్చితంగా మూతలు పెట్టాలి.

  • డబ్బాలు, కుండలు కుండీల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్త పడాలి.

  • డెంగీ దోమ పగటి పూట కుట్టే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. దోమలు రాకుండా దోమ తెరను ఏర్పాటు చేసుకోవాలి. మస్కిటో రిఫిలెంట్స్‌ వినియోగించాలి.
  • తలుపులు, కిటికీలు మస్కిటో స్ర్కీన్‌తో కవర్‌ చేసుకోవాలి. అలా చేయడం వల్ల దోమల నుంచి రక్షణ పొంది రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

Published by: Shravan Kumar Bommakanti
First published: September 26, 2019, 5:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading