Brain Stroke: ఈ చెడు అలవాట్లతో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం.. ఇలా చెక్​ పెట్టండి..

ప్రతీకాత్మక చిత్రం

మన ఆరోగ్యం మన జీవనశైలి అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. కొన్నిరకాల ఈ అలవాట్లు ప్రమాదకరమైన వ్యాధులకు ఆహ్వానం పలుకుతూ ఉంటాయి. వీటిల్లో ఒకటి బ్రెయిన్‌ స్ట్రోక్‌.

  • Share this:
మన ఆరోగ్యం(Health) జీవనశైలి అలవాట్లపై(Habbits) ఆధారపడి ఉంటుంది. కొన్నిరకాల ఈ అలవాట్లు ప్రమాదకరమైన వ్యాధులకు ఆహ్వానం పలుకుతూ ఉంటాయి. వీటిల్లో ఒకటి బ్రెయిన్‌ స్ట్రోక్‌ (Brain Stroke). ఇది ఒక ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితి. మెదడు(Brain)లోని భాగాలకు రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌(Brain Stroke) సంభవిస్తుంది. రక్త సరఫరా ఆగిపోవడం లేదా రక్త సరఫరాలో జాప్యం జరగడం వలన మెదడు కణజాలానికి తగిన మొత్తంలో ఆక్సిజన్‌, పోషకాలు అందవు. దీంతో స్ట్రోక్‌ సంభవిస్తుంది.

Weight loss Tip: లావు తగ్గాలని అనుకుంటున్నారా.. ఈ ఒక్క చిట్కా పాటించండి.. మూడు నెలల పాటు ఈ టీని తాగితే..


అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, విపరీతంగా పొగ తాగడం వంటి అలవాట్ల కారణంగా బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ముప్పు తీవ్రంగా ఉంటుంది. అంతేకాదు, గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా స్ట్రోక్‌ ముప్పు ఉంటుందనిఅమెరికాలోని జాప్‌ హాప్కిన్స్ సంస్థకు చెందిన వైద్య పరిశోధకులు గుర్తించారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌కు కారణమయ్యే కొన్ని జీవనశైలి అలవాట్లను ఆ పరిశోధన తెలియజేసింది. అవేంటో చూద్దాం.

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. జీలకర్రను ఇలా ఉపయోగించండి..


శారీరక శ్రమ లేకపోవడం
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వచ్చిన తర్వాత చాలా మందిలో శారీరక శ్రమ అన్నది పూర్తిగా తగ్గిపోయింది. కదలికలు తగ్గడం వలన ఊబకాయ ముప్పు ఏర్పడుతుంది. దాని వలన తీవ్రమైన అనారోగ్యాలు సంభవిస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం, చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం భుజించడం ద్వారాబ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటిప్రాణాంతక సమస్యలు, ముప్పులను కొంత దూరం పెట్టవచ్చు.

Saffron Flower Benefits: గర్భిణులు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల బేబీ తెల్లగా పుడతాడా..! ఉపయోగాలేంటి..


పొగ తాగడం(Smoking)
పొగ తాగడం వలన స్ట్రోక్‌ ముప్పు తీవ్రమవుతుంది. ఐసెమిక్‌ స్ట్రోక్‌ ముప్పును పొగతాగడం రెట్టింపు చేస్తుందని జాన్‌ హాప్కిన్స్‌ వైద్యులు గుర్తించారు. ఆరోగ్యాన్ని నాశనం చేయడమే కాదు సిగెరెట్ల కారణంగా ఊపిరితిత్తుల్లోసమస్యలు ఏర్పడి వాటి పనితీరు స్థంభించిపోతుంది.

విపరీతంగా మద్యం తాగడం(Drinking Alcohol)
విపరీతంగా మద్యం తాగడం స్ట్రోక్‌కు దారితీస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. రోజుకు రెండు డ్రింక్స్‌ కంటే ఎక్కువ తీసుకోవడం వలన మనిషి శరీరంలో బ్లడ్‌ ప్రెషర్‌ పెరుగుతుంది. తక్కువ సమయంలో చాలా తాగడాన్ని విపరీతంగా తాగడమని చెప్పవచ్చు. పురుషులు ఒకసారి 8 యూనిట్స్‌,స్త్రీలు6 యూనిట్లు ఆల్కాహాల్‌ తీసుకున్నారంటే అది విపరీతమైన తాగుడు కింద లెక్క.

Pregnant Women: రైల్వే స్టేషన్ వద్ద నొప్పులతో గర్భిణి.. ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది..


వైద్య పరిస్థితులు
డయాబెటీస్‌, హై కొలెస్టరల్‌, హైపర్‌టెన్షన్‌, ఆట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ వంటి అనారోగ్యాలు కలిగిన వారికి స్ట్రోక్‌ సంభవించే ముప్పు అధికంగా ఉంటుంది. ఈ అలవాట్లన్నీ నియంత్రించుకోదగినవే. అయితే, కొంతమందిలోవంశపార్య పరంగా కూడా బ్రెయిన్​ స్టోక్​ సంభవిస్తుంది. దీన్ని నియంత్రించడం చాలా కష్టం.

బ్రెయిన్‌ స్ట్రోక్‌కు చికిత్స ఏంటి..?
స్ట్రోక్‌ బారిన పడ్డారని ఎవరినైనా గుర్తించినట్టు అయితే వెంటనే ఎదుటివారు స్పందించాలి. ఐసెమిక్‌ స్ట్రోక్‌ అయితే చికిత్సలో భాగంగా మెదడుకు రక్తప్రసరణ వెంటనే అందేలా చూడాలి. హెమరోహాగిక్‌స్ట్రోక్‌ అయితేశస్త్రచికిత్స కోసం వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Published by:Veera Babu
First published: