Bedtime Yoga: మీకు ప్రశాంతమైన నిద్రనిచ్చే 5 అద్భుతమైన యోగాసనాలు.. ఇలా సాధన చేయండి

హాయిగా నిద్రపోవడానికి ఇలా చెయ్యండి.. (ప్రతీకాత్మక చిత్రం)

ఈ యోగాసనాలు మీలో ఉన్న ఒత్తిడి, ఆందోళన లేదా టెన్షన్‌ను తగ్గిస్తాయి. అంతేకాదు, మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చుతాయి.

  • Share this:
కంటి నిండా నిద్ర పోయినప్పుడే (Sleep) మరిసటి రోజు నూతనోత్సాహంతో పని చేయగలం. అయితే నేటి అస్తవ్యస్తమైన జీవన విధానం (Life Style), ఎక్కువ పని గంటలు, ఒత్తిడి (Pressure) కారణంగా చాలా మంది రాత్రి సంపూర్ణ నిద్రకు (complete Sleep) దూరమవుతున్నారు. అటువంటి వారు నిద్రవేళకు ముందు 5 ప్రముఖ యోగా (Yoga) ఆసనాలు వేయడం ద్వారా సులభంగా నిద్ర పడుతుంది. ఈ యోగాసనాలు మీలో ఉన్న ఒత్తిడి, ఆందోళన లేదా టెన్షన్‌ను తగ్గిస్తాయి. అంతేకాదు, మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చుతాయి. ప్రతి ఒక్కరు నిద్ర వేళకు ముందు చేయాల్సిన 5 యోగాసనాల గురించి తెలుసుకుందాం.

* వృక్షాసనం
ఒక కాలు మీదే నిలబడేట్లు మీ బాడీని బ్యాలెన్స్ చేసుకోండి. మరో కాలు మీ లోపలి తొడపై మడిచి సపోర్ట్ ఇవ్వండి. మీ చేతులను తల పైకి చాచి, నమస్కరించండి. ఆ తర్వాత మీ బరువును ఎడమ కాలిపై వేయండి. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమను ప్రయత్నించండి.

ప్రయోజనాలు
ఈ ఆసనం మీ మనస్సు, శరీరాన్ని బ్యాలెన్స్​ చేస్తుంది. ఇది మీ కాళ్ళను బలంగా చేస్తుంది. మీ ఏకాగ్రతను రెట్టింపు చేస్తుంది. మొత్తం శరీర బరువును మీ కాళ్లపై పెట్టడం ద్వారా మీ పాదాలు మరింత బలోపేతం అవుతాయి.

* ఉస్త్రాసనం
ఒక చాప మీద మోకాళ్లపై కూర్చోండి. ఆ తర్వాత వెనక్కి వంగి మీ పాదాలను చేతులతో పట్టుకోండి. ఇలా కొన్ని సెకన్లపాటు చేయండి.

ప్రయోజనాలు
ఈ యోగాసనం వల్ల మీ భుజాలు, పాదాలు మరింత బలోపేతం అవుతాయి. ఉస్త్రాసనం మీ ఛాతిని మరింత పటిష్టం చేస్తుంది. అంతేకాదు ఈ ఆసనం ద్వారా మీ శ్వాస క్రియ మెరుగవుతుంది. ఉదర ప్రాంతాన్ని విస్తరించడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. నడుము నొప్పిని నివారిస్తుంది. తొడల వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

* భుజంగాసనం
నేలపై మీ కాళ్ళు, అరచేతులు పెట్టి మీ ఛాతీని , తలని పైకి లేపండి. మీ చేతులు మీ శరీరానికి దగ్గరగా ఉండేలా చూసుకోండి. గట్టిగా ఊపిరి పీల్చుకోండి. మీ నుదురు, మెడ, భుజాలను పైకి ఉండేలా చూసుకోండి.

ప్రయెజనాలు
భుజంగాసనం ద్వారా వెన్నెముక, బట్, బట్ కండరాలు, ఛాతీ, పొత్తికడుపు, భుజాలు, ఊపిరితిత్తులు బలపడతాయి. ఇది మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది.

* బాలాసనం
నేలపై మీ మడమల మీద కూర్చొండి. ఆ తర్వాత మీ మోకాళ్లను వెడల్పుగా ఉంచండి. నెమ్మదిగా, మీ శ్వాసను వదులుతూ, ముందుకు వంగి నుదుటితో నేలను తాకేందుకు ప్రయత్నించండి.

ప్రయోజనాలు
ఈ యోగాసనం పిల్లలు సాధన చేయడం మంచిది. ఇది వారి ఛాతీ, వీపు, భుజాలను మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. మైకం లేదా అలసటగా ఉన్నప్పుడు ఈ ఆసనం వేస్తే అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. మీ వెనుక తుంటి, తొడలను సున్నితంగా సాగదీయడం వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

* పరివృత్త పార్శ్వకోనాసనం
మీ కాళ్లు దూరంగా పెట్టి ఒక కాలి పాదాన్ని చేతితో తాకేందుకు ప్రయత్నించండి. మరో చేతిని పైకి చూపండి. ఈ క్రమంలో గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ముందుకు చూస్తూ 10 నుండి 15 సెకన్ల పాటు ఈ భంగిమను ప్రాక్టీస్ చేయండి.

ప్రయోజనాలు
పరివృత్త పార్శ్వకోనాసనం మీ వెన్నెముకను యాక్టివేట్​ చేస్తుంది. మీ శరీర భాగాలను మరింత సరళంగా చేస్తుంది. వెనుక కండరాలకు మరింత బలం చేకూర్చుతుంది. ఈ ఆసనం ద్వారా మీ ఏకాగ్రత రెట్టింపవుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆస్తమా, డయేరియా, వెర్టిగో, మైగ్రేన్, నిద్రలేమి సమస్యలు, మెడ లేదా వెన్నునొప్పి లేదా తక్కువ/అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ వ్యాయామాలు చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించాలి.
Published by:John Naveen Kora
First published: