Home /News /life-style /

HEALTH THESE ARE THE POPULAR AND TASTY RECEPIES WHICH IS RICH IN VITAMIN C D AND K AK GH

Vitamins: టేస్ట్‌తో పాటు పోషకాలను అందించే విటమిన్ రిచ్ రెసిపీలు.. ఇలా తయారు చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శరీర పోషణకు విటమిన్లు అవసరం. శరీరానికి విటమిన్లు తగిన స్థాయిలో అందకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు. కాబట్టి ప్రతి రోజూ విటమిన్లు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. మరి ఏయే వంటకాల్లో ఎలాంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయో తెలుసుకుందాం. 

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
శరీర పోషణకు విటమిన్లు అవసరం. శరీరానికి విటమిన్లు తగిన స్థాయిలో అందకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు. కాబట్టి ప్రతి రోజూ విటమిన్లు(Vitamins) పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. మరి ఏయే వంటకాల్లో(Food Recepies) ఎలాంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయో తెలుసుకుందాం.

* దోసకాయ రైతా
బలవర్థకమైన పెరుగులో విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్, గట్-ఫ్రెండ్లీ బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటాయి. దోసకాయలో విటమిన్ కె, బి, సి తోపాటు రాగి, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమ‌ృద్ధిగా ఉంటాయి.

తయారీ విధానం
దోసకాయ రైతా చేయడానికి, 2 దోసకాయలను తురుము చేసుకోవాలి. ముందుగా ఒక కప్పు పెరుగు (Curd)గిన్నెలో వేయండి. దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగ్గట్టు ఉప్పు వేయండి. ఆ తరువాత తురిమిన దోసకాయలను వేసి బాగా కలపండి. చివరిగా పుదీనా ఆకులను వేయండి. ఆ తరువాత కొద్దిసేపు ప్రిజ్‌లో ఉంచండి. చల్లచల్లని దోసకాయ రైతాను సర్వ్ చేయండి.

* పాలక్ పనీర్
పాలక్ పనీర్‌‌ను పాలకూర, చీజ్‌తో తయారు చేస్తారు. ఇందులో విటమిన్-కె పుష్కలంగా ఉంటుంది.



తయారీ విధానం
ముందు పనీర్‌ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తాజా పాలకూర ఆకులను బాగా ఉడికించాలి. ఒక పెనం తీసుకుని అందులో కొంచెం నూనె వేయాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన రెండు టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను అందులో వేయాలి. కొన్ని నిమిషాల తర్వాత పాలకూర పేస్ట్ వేసి కాసేపు ఉడికించాలి. దీనికి ¼ టీస్పూన్ పసుపు పొడి, ½ టీస్పూన్ కారం పొడి, చిటికెడు ఇంగువ, ఉప్పు కలపండి. ఆ తరువాత అవసరం మేరకు నీళ్లు పోసి ఉడికించాలి. ఆపై పనీర్ క్యూబ్స్ వేసి ఉడికిస్తే పాలక్ పన్నీర్ రెడీ.

After Meals: భోజనం చేసిన తర్వాత ఈ ఒక్క చిన్న పని చేయండి.. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం..

Goat Milk: మీరు మేక పాలు ఎందుకు తాగాలో 10 కారణాలు.. రోజూ తాగితే బోలెడు లాభాలు..

* అరటి వాల్‌నట్ లస్సీ
పాలలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. అరటిపండులో విటమిన్ బి6, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి అధిక మోతాదులో ఉంటాయి. వాల్‌నట్స్‌లో రాగి, ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, విటమిన్ బి6, మాంగనీస్, విటమిన్ ఇ ఉంటాయి.

తయారీ విధానం
ఫుడ్ ప్రాసెసర్‌లో ఒక కప్పు పెరుగు, అవిసె గింజలు, నువ్వులు, 3-4 వాల్‌నట్స్, 1-2 స్పూన్ తేనె, సగం అరటిపండు కలపండి. క్రీముతో కూడిన లస్సీలో ప్రతిదీ బాగా కలిసే వరకు బ్లెండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని పెద్ద గ్లాసులోకి మార్చండి. దీనిపై తరిగిన వాల్‌నట్‌ ముక్కలను అలంకరించండి. దీంతో అరటి వాల్‌నట్ లస్సీ రెడీ.

* కివీ జామ్
కివీ ఫ్రూట్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

తయారీ విధానం
ముందుగా కొన్ని కివీ పండ్లను సగానికి కట్ చేసుకోవాలి. చెంచా సహాయంతో పండ్లలోని గుజ్జు‌ను గిన్నెలోకి వేయండి. మూడు ఆపిల్ పండ్ల తురుమును రెడీ చేసుకోండి. సన్నని మంటపై పాన్ వేడి చేయండి. అందులో కప్పు పైనాపిల్ రసం పోసి, కివీ పండ్ల గుజ్జు, యాపిల్ తరుగు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ మరిగించాలి. చివరగా 3 కప్పుల చక్కెర వేసి అది కరిగిపోయే వరకు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని చల్లబడిన తరువాత తీసుకోవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Vitamins

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు