హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Digestion Problems: డైజెషెన్ ప్రాబ్లమ్‌కు కారణాలు ఇవే.. ఈ తప్పులు చేస్తే అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్లే..

Digestion Problems: డైజెషెన్ ప్రాబ్లమ్‌కు కారణాలు ఇవే.. ఈ తప్పులు చేస్తే అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్లే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Digestion Problems: రోజూ మనం పాటించే కొన్ని రకాల అలవాట్లు డైజెషన్ ప్రాబ్లమ్‌కు కారణం కావచ్చు. భోజనం చేసిన వెంటనే నీరు తాగడం, లేదా స్నానం చేయడం వంటి అలవాట్లు జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vijayawada | Hyderabad

    Digestion Problems: డైజెషెన్ (Digestion ) ప్రాబ్లమ్‌కు కారణాలు ఇవే.. ఈ తప్పులు చేస్తే అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్లే.. తినే ఆహారం, తీసుకునే వేళను బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో మారిన జీవన‌శైలి (Lifestyle) కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అందులో ప్రధానమైనది జీర్ణక్రియ సమస్య. గట్ హెల్త్ బాగా ఉంటే రోగనిరోధక వ్యవస్థ మరింత మెరుగవుతుంది. లేకపోతే మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. రోజూ మనం పాటించే కొన్ని రకాల అలవాట్లు డైజెషన్ ప్రాబ్లమ్‌కు కారణం కావచ్చు. భోజనం చేసిన వెంటనే నీరు తాగడం, లేదా స్నానం చేయడం వంటి అలవాట్లు జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియను మెరుగుపరచడానికి నివారించాల్సిన అలవాట్లను పరిశీలిద్దాం.

    * భోజనం చేసిన వెంటనే నడక

    భోజనం చేసిన వెంటనే కొందరికి నడక అలవాటు. అది పరిమితంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. అయితే ఎక్కువ దూరం నడిస్తే డైజెషన్ ప్రాబ్లమ్‌కు కారణం కావచ్చు. కాబట్టి తిన్న వెంటనే నడక పరిమితంగా కొనసాగించండి. అలాగే ఫుడ్ తిన్న తర్వాత ఈత కొట్టడం, వ్యాయామం చేయడం వంటివి కూడా అసలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించలేదు. దీంతో కడుపు ఉబ్బరం, ఇతర సమస్యలు ఎదురుకావచ్చు.

    ఇది కూడా చదవండి: శీతాకాలంలో మీ ఎముకలు బలాన్ని కోల్పోతాయి.. ఉపశమనం కోసం ఈ ఆహారాలను తినండి

    * మధ్యాహ్నం 2 తరువాత భోజనం

    వేళకాని వేళలో భోజనం చేయడం వల్ల ఉపయోగం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య భోజనానికి సరైన సమయమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో భోజనం చేస్తే సులువుగా జీర్ణం అవుతుంది. అయితే, మధ్యాహ్నం 2 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ అస్తవ్యస్తంగా మారుతుందని, శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాబట్టి రెండు గంటలలోపే భోజనం చేయడానికి ప్రయత్నించండి.

    * భోజనం తరువాత స్నానం చేయడం

    కొంత మంది భోజనం చేసిన తరువాత స్నానం చేస్తుంటారు. అయితే అలా చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. భోజనం చేసిన తరువాత జీర్ణక్రియ కోసం రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ సమయంలో స్నానం చేస్తే, శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఫలితంగా జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందుకే తిన్న తర్వాత కనీసం 2 గంటల వరకు స్నానం చేయకపోవడం బెటర్.

    ఇది కూడా చదవండి: గర్భనిరోధక మాత్రలు వాడితే పిల్లలు అసలు పుట్టారా..? వీటిపై ఉన్న అపోహలు ఇవే.. 

    * తినగానే నిద్ర

    భోజనానికి, నిద్రకు మధ్య గ్యాప్ కనీసం 3 గంటలు ఉండాలని నిపుణులు అంటున్నారు. ఒకవేళ అలా లేకపోతే అజీర్తి, గుండెల్లో మంట, అధిక బరువు, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యల రిస్క్ ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నిద్ర సమయంలో శరీరం రిపేర్, హీల్, రీస్టోర్ అవుతుంది. అయితే తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల సరైన నిద్ర పట్టదు. దీంతో పైన చెప్పిన చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి నిద్ర ముందు కనీసం మూడు గంటల ముందు భోజనం చేయడానికి ప్రయత్నించండి.

    * రాత్రిపూట పెరుగు వద్దు

    సాధారణంగా పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది. ఇది జీర్ణక్రియలో కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే రాత్రి భోజన సమయంలో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రావచ్చు. రాత్రి పెరుగు తింటే జలుబు, దగ్గు, మలబద్ధకం వంటి సమస్యలు వేధించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Note: ఈ సమాచారం వివిధ నివేదికల నుంచి స్వీకరించినది మాత్రమే. ఈ విషయాలను వైద్యులు, ఇతర నిపుణులు ధ్రువీకరించలేదు.

    First published:

    Tags: Health Tips

    ఉత్తమ కథలు