మనలో కొంతమంది స్పైసీ ఫుడ్‌ను(Spice Foods) ఇష్టపడుతుంటారు. కొందరు తీపి పదార్థాలనూ ఇష్టంగా ఆరగిస్తుంటారు. అయితే ఆయుర్వేదం (Ayurveda) ప్రకారం మొత్తం ఆరు రుచులు(Six Tastes)ఉన్నాయి. వీటిని సంస్కృతంలో ‘రస’ అని కూడా పిలుస్తారు. అవి మధుర, లవణం, ఉసిరి, తిక్త, కటు, కషాయ, రుచులు. వీటిని పలు విధాలుగా వర్గీకరించిన నిపుణులు.. వాత, పిత్త, కఫ దోషాల (vata pitta kapha) నివారణకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. మరి ఆ ఆరు రుచులు ఏంటి? ఆరోగ్యకరమైన జీవన శైలికి అవి ఎలా తోడ్పడతాయో మీరూ తెలుసుకోండి మరి..
పులుపు (లవణం)
నీటిశాతం అధికంగా కలిగిఉండే ఈ రుచి.. పిత్త, కఫ దోషాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలో లాలాజల ఉత్పత్తికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పచ్చి మామిడి, చింతపండు, నిమ్మకాయలో పులుపు బాగా లభిస్తుంది.
మధుర(తీపి)..
తీపి.. భూమితో పాటు నీటిలోని మూలకాలను కలిగి ఉండే ఈ రుచి వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. ఆయుర్వేదంలో అత్యంత ప్రాధాన్యం ఉండే ఈ రుచితో పోషక విలువలు సైతం మెండుగా సమకూరుతాయి. పండ్లు, పాలల్లో చక్కెర సహజంగా లభిస్తాయి. అయితే దీనిని మితంగా తీసుకోవాలని, అధికంగా తింటే ఊబకాయం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉప్పు
భూమిలోని అగ్ని మూలకాలతో తయారయ్యే ఈ రుచి.. వాత దోషాలను తగ్గించడంలో సహాయపడుతుంది. పిత్త, కఫ దోషాలను పెంచుతుంది. జీర్ణక్రియలో సహాయపడే.. ఈ రుచికి ఉత్తమ వనరు సముద్రపు ఉప్పు. అయితే ఆయుర్వేదం ప్రకారం.. ఉప్పగా ఉండే పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అందువల్ల మితంగా తీసుకోవాలి.
ఘాటు రుచి
మనమంతా 'స్పైసీ' అని పిలుచుకునే ఈ ఘాటైన రుచి అగ్ని, గాలి మూలకాలను కలిగి ఉంటుంది. కఫ దోషాన్ని సమతుల్యం చేయడంలో ఘాటైన రుచి సహాయపడుతుంది. ఆకలి, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. అయితే దీనిని అధికంగా తీసుకుంటే పిత్త దోషం అధికం అవుతుంది. మిరియాలు, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయల్లో అధికంగా లభిస్తుంది.
చేదు
గాలితో పాటు.. అంతరిక్ష మూలకాలను కలిగి ఉండే ఈ రుచి మొత్తం ఆరు రుచుల్లోకెల్లా ఉత్తమమైనది. చేదు ఆహారం పిత్త, కఫ దోష నివారణకు చాలామంచిది. శరీరంలోని విష పదార్థాలను సహజంగా తొలగించడంలో సహాయపడుతుంది. వేప, కాకరకాయ, కాఫీ, మెంతుల్లో అధికంగా లభిస్తుంది.
కషాయ రుచి
గాలి, భూమి నుంచి లభించే ఈ రుచి.. మనసును ప్రశాంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అయితే దీనిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో ఉబ్బరం ఏర్పడే అవకాశాలున్నాయి. ఆయుర్వేదం ప్రకారం.. అరటిపండ్లు, క్రాన్బెర్రీస్, పైనాపిల్, దానిమ్మపండ్లలో సమృద్ధిగా లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Life Style