HEALTH TEN HEALTHY EATING HABITS THAT WILL CHANGE THE WAY OUR LIVE UMG GH
Healthy Eating Habits: ఎప్పటికీ ఫ్రెష్ అండ్ హెల్దీగా ఉండాలనుకుంటున్నారా..? అయితే, ఇవి పాటించండి..!
సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇవి పాటించండి
మన ఆరోగ్యం మనం తీసుకుంటున్న ఆహారం (Food)పైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అయితే సంపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే ఆహార మొక్కటే హెల్దీగా ఉంటే సరిపోదు. ఆహారపుటలవాట్లు (Eating Habits) కూడా ఆరోగ్యకరంగా ఉండాలి.
మన ఆరోగ్యం మనం తీసుకుంటున్న ఆహారం (Food)పైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అయితే సంపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే ఆహార మొక్కటే హెల్దీగా ఉంటే సరిపోదు. ఆహారపుటలవాట్లు (Eating Habits) కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. ఏ సమయంలో తినాలి, ఎంత తరచుగా తినాలి వంటి విషయాలలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకుంటే ఆరోగ్యకరమైన బరువు (Healthy Weight)ను మెయింటైన్ చేయడం సులభమవుతుంది. అంతేకాదు నిపుణుల ప్రకారం, పెద్దగా కష్టపడకుండానే బరువు తగ్గొచ్చు. మరి ఆరోగ్యాన్ని పూర్తిగా మెరుగుపరిచే ఆహారపుటలవాట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
* మితంగా తినాలి
నిత్యం పోషకాలు ఉన్న ఆహారమే తినక్కర్లేదు. అప్పుడప్పుడు ఐస్క్రీమ్ వంటి రుచికరమైన ఐటమ్స్ ఆస్వాదించవచ్చు. అయితే వీటిని ఎంత మితంగా తింటే అంత మంచిది. ఫ్రిజ్లో లేదా ఇంట్లో ఐస్క్రీమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలా అనారోగ్యకరమైన ఫుడ్స్ ఎక్కువగా ఉంచుకోకూడదు. ఎందుకంటే వీటిని చూస్తే తినకుండా మనసును కంట్రోల్లో పెట్టుకోవడం అసాధ్యం. అలానే సరిపడా పోషకాలు అందించే ఆహారాలు మాత్రమే మీకు అందుబాటులో ఉండేలా ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి.
* అతిగా తినకూడదు
సాధారణంగా ఒక పెద్ద ప్లేట్/కంచంలో కడుపునింపేంత ఆహారం ఉన్నా.. ఆ ఆహారం కొంచెమే ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు మీరు ఎక్కువగా ఆహారం వడ్డించుకోవచ్చు. దీనివల్ల మీకు తెలియకుండానే మీరు అతిగా తింటారు. అందుకే చిన్న ప్లేట్లో ఆహారం సర్వ్ చేసుకొని తినడం మంచిది. ఒక చిన్న ప్లేట్ నిండా ఆహారం పెట్టుకుంటే.. మీ మెదడు మోసపోయి మీరు ఎక్కువగా తింటున్నారనే భావన కలిగిస్తుంది. అలా మీరు అతిగా తినకుండా చిన్న ప్లేట్ సహాయపడుతుంది.
* శరీరం ఇచ్చే సంకేతాలు అర్థం చేసుకోవాలి
కడుపు నిండిందన్న భావన కలగలేదు కదా అని అదే పనిగా తినకూడదు. అలాగే ఖాళీగా ఉన్నప్పుడు ఆహారాన్ని ఆరగించకుండా ఆకలి అయినప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి మింగకుండా.. దాని రుచిని ఆస్వాదిస్తూ మెల్లగా నములుతూ తినాలి. నెమ్మదిగా తినడం వల్ల తక్కువ ఆహారం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు బరువు పెరుగుదల వంటి సమస్యలు రావు. ఆకలి అయినప్పుడు మాత్రమే తినడం, కడుపు నిండగానే చేయి కడుక్కునే అలవాటుతో ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుంది.
* ఆహారాన్ని స్కిప్ చేయకూడదు
కొందరు ఏదో ఒక బిజీలో పడిపోయి ఒకపూట ఆహారం తినడమే మానేస్తారు. తరచూ ఇలా ఆహారం తినడం మానేస్తుంటే మెటబాలిజం స్లోగా మారి త్వరగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. ఆఫీసులో లేదా కాలేజీలో ఆకలిగా అనిపించినప్పుడు స్నాక్స్ తినాలి. ఆకలితో ఎప్పుడూ కూడా ఉండకూడదు.
* ఆహారంలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసుకోవాలి
మీరు రోజు తింటున్న ఆహారంలో ఎన్ని పోషకాలను పొందుతున్నారో తెలుసుకోవాలి. తద్వారా మీ శరీరానికి ఎక్కువ తక్కువ కాకుండా సరిపడా పోషకాలను తీసుకోవడం సాధ్యమవుతుంది.
* తగినంత నీరు తాగాలి
కూల్ డ్రింక్స్, సోడాలకు బదులుగా మంచి నీరు తాగడం మంచిది. రోజూ తగినంత నీరు తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
* పార్టీలు, ఫంక్షన్లలో జాగ్రత్తగా ఉండాలి
ఏదైనా పార్టీ లేదా ఫంక్షన్లలో పాల్గొన్నప్పుడు చెడు కొవ్వు అధికంగా గల ఆహారాన్ని ఎక్కువగా తినాలనే కోరిక పుట్టడం సహజం. అందుకే ఫంక్షన్లకు వెళుతున్నప్పుడు ఇంటి దగ్గరే కడుపునిండా ఆహారం తినాలి. అప్పుడు ఫంక్షన్లలో అనారోగ్యకరమైన ఆహారం మీరు ఎక్కువగా తినలేరు.
* ఇంటి భోజనమే చేయాలి
స్ట్రీట్ ఫుడ్ లేదా హోటల్స్, రెస్టారెంట్స్లో ఫుడ్ తీసుకోకూడదు. ఇంట్లో వండిన ఆహార పదార్థాలను తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రసాయనాలు లేని సేంద్రీయ కూరగాయలు వంటలకు వాడితే మంచిది.
* మరీ మొండిగా ఉండాల్సిన అవసరం లేదు
ఆరోగ్యకరమైన ఆహారమే నిత్యం తీసుకోవాలని మీపై మీరు కఠిన ఆంక్షలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒకసారి లేదా రెండుసార్లు మీరు మీ ఫ్యామిలీతో కలిసి పిజ్జా తినొచ్చు. అప్పుడప్పుడు ఒక స్వీట్ లేదా డిసర్ట్ ఆస్వాదించవచ్చు. వీటిని అప్పుడప్పుడు తిన్నా ఆరోగ్యానికి ఎలాంటి హానీ జరగదు.
* 30 డేస్ ఛాలెంజ్
30 రోజుల పాటు మీరు మంచి ఆహారాన్ని తీసుకునేలా తీర్మానించుకోవాలి. బయటి ఫుడ్ తినకూడదని, ఎక్కువగా నీళ్లు తాగాలని, సినిమాలు చూసేటప్పుడు అధికంగా అనారోగ్యకరమైన స్నాక్స్ తినకూడదని బలంగా అనుకోవాలి. దీనిని నెలపాటు ఆచరిస్తే ఒక చక్కటి ఆహారపు అలవాటును అలవర్చుకోవడం సాధ్యమే!
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.