షుగర్, బీపీ పేషెంట్లకు శుభవార్త.. జీవిత కాలం పాటు వారికి..

Telangana Government: వ్యాధిగ్రస్తులకు ఒకేసారి నెలకు సరిపడా మందులు ఇవ్వాలని నిర్ణయించింది. నెలకు ఒకసారి.. అలా జీవితకాలం పాటు మందులను ఉచితంగా అందించనున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 18, 2019, 6:52 AM IST
షుగర్, బీపీ పేషెంట్లకు శుభవార్త.. జీవిత కాలం పాటు వారికి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యాధిగ్రస్తులకు ఒకేసారి నెలకు సరిపడా మందులు ఇవ్వాలని నిర్ణయించింది. నెలకు ఒకసారి.. అలా జీవితకాలం పాటు మందులను ఉచితంగా అందించనున్నారు. ఈ గోలీలను ఆశా కార్యకర్తలు వ్యాధిగ్రస్తులకు అందజేస్తారు. ప్రస్తుతానికి 104 వాహనాల ద్వారా పరీక్షలు చేసి, వారానికి లేదా పది రోజులకు సరిపడా మందులు అందజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి భారీ ఉపశమనం కలగనుంది. మరోవైపు ప్రస్తుతం ఎంపిక చేసిన 12 జిల్లాల్లో ఈ వ్యాధుల స్ర్కీనింగ్‌ జరుగుతోంది. ఆశా, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి 30 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారు నిర్వహించిన పరీక్షల్లో బీపీ, షుగర్ రోగులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నారని తేలింది. దీంతో ఈ ఏడాది చివరి నాటికి అన్ని జిల్లాల్లో ఈ పరీక్షలు పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ పట్టుదలతో ఉంది.

కాగా, బీపీకి 50 ఎంజీ, 20 ఎంజీ మోతాదుతో గోలీలు, మధుమేహానికి మూడు రకాల గోలీలను వైద్య ఆరోగ్య శాఖ ఇస్తోంది. ప్రస్తుతం స్ర్కీనింగ్‌ జరిగే జిల్లాల్లో బీపీ, షుగర్‌ స్థాయులు ఎక్కువగా ఉన్నవారికి ఈ మోతాదు సరిపోవడం లేదని, అందుకే వారికి బయట మందులు కొనుక్కోవాలని సూచిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...