Home /News /life-style /

HEALTH TEETH QUICK FIX AT HOME A CROOKED BIZ DENTISTS FULL DETAILS HERE GH VB

Tooth Fix: ఇంట్లోనే దంతాలకు క్లిప్ వేస్తామంటూ యాడ్స్.. తర్వాత జరిగేదంతా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆన్‌లైన్ మోసాలు మనకు కొత్తేమి కాదు. జాబ్ ఇప్పిస్తామని, లాటరీ తగిలిందని, షాపింగ్ ఆఫర్ ఉందని.. ఇలా చాలా రకాలుగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వలవేసి డబ్బులు గుంజే కేటుగాళ్లు చాలా మంది ఉన్నారు.

ఆన్‌లైన్ మోసాలు(Online Fraud) మనకు కొత్తేమి కాదు. జాబ్(Job) ఇప్పిస్తామని, లాటరీ తగిలిందని, షాపింగ్ ఆఫర్ ఉందని.. ఇలా చాలా రకాలుగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వలవేసి డబ్బులు(Money) గుంజే కేటుగాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే కొత్తగా ఈ తరహా తంతు వైద్య రంగంలోనూ ప్రవేశించింది. కరోనా కాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఎందుకని భావించిన కొంతమందికి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వంకర పళ్లను సరిచేసేందుకు డెంటల్ బ్రేసెస్ అమర్చుతారనే విషయం తెలిసిందే. అయితే పళ్లకు క్లిప్స్ వేస్తామని కొన్ని ఫేక్ డెంటల్ కేర్ సెంటర్లు విస్తృతంగా ప్రమోషన్ చేస్తున్నాయి. ఇలాంటి కొన్ని యాడ్స్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమై అయాయకులను ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి సెంటర్లు బాధితుల నుంచి డబ్బు వసూలు చేస్తాయి.

పేషెంట్ ఇంటికే వచ్చే డెంటిస్టులు నామమాత్రపు సేవలు అందిస్తున్నారు. నాణ్యతలేని డెంటల్ అలైన్మెంట్ అమర్చి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఈ సమస్య గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడు. కరోనా కాలంలో చాలా మంది ఆన్‌లైన్ డెంటల్(dental) సెంటర్లకు ముడుపులు సమర్పించుకుని మోసపోయారు.

Research on Ageing: మనిషి వృద్ధాప్యం సమస్యను అధిగమించే ప్రయోగం.. ఎలా సాధ్యం..? పూర్తి వివరాలిలా..


ఖర్చుతో కూడిన విషయం..
సాధారణంగా డెంటిస్టులు బ్రెసెస్ అమర్చడానికి ఎంతో సమయం పడుతుంది. అంతేకాకుండా నొప్పి కూడా అధికంగా ఉంటుంది. రెగ్యులర్‌గా అనుభవం ఉన్న నిపుణులు వాటిని ఎంతో దృఢంగా ఉండేలా, సరైన క్రమంలో అమర్చుతారు. అంతేకాకుండా ప్రతి కొన్నివారాలకోసారి సరిగ్గా ఉన్నాయో లేదో పర్యవేక్షిస్తారు. లోపముంటే అలైన్మెంట్స్ బ్రాకెట్స్ రీప్లేస్ చేస్తారు. ఇది అందరూ పాటించే సంప్రదాయమైన విధానం. ఇందుకు అలైనర్ రకాన్ని బట్టి రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ ఆన్‌లైన్ డెంటల్ సేవల్లో ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ నాణ్యత మాత్రం లోపిస్తుంది. ఫలితంగా బాధితులు మోసపోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా దంతక్షయంతో పాటు పళ్లల్లో నొప్పి రావడం, కొత్త బ్రేసెస్ సూట్ కాకపోవడం లాంటి తదితర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

దంత నిపుణుల ఆగ్రహం..
కరోణా సమయంలో గతేడాది చాలామంది దంత వైద్యులు తమ పేషెంట్లు ఆన్‌లైన్ యాడ్స్‌ చూసి మోసపోయినట్లు గుర్తించారు. పళ్ల క్లిప్ కోసం ఆన్‌లైన్‌లో వెతికి, వారి చేతిలో మోసపోయామని చెప్పినట్లు తెలిపారు. ఈ విషయాన్ని భారత దంత మండలికి నివేదించామని, అర్హత లేనివారిని ఇళ్లకు పంపించి దంత సమస్యలను ఎలా పరిష్కారిస్తారని మహారాష్ట్ర డెంటల్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ నరేంద్ర కాలే అన్నారు. గత దశాబ్ద కాలంలో డెంటల్ అలైనర్ చికిత్స ఎంతో అభివృద్ధి చెందిందని, ఈ క్రమంలో కొత్త పద్ధతుల రూపకల్పన సాధ్యపడిందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి మోసాలు చూస్తే పెద్దలు బ్రేసెస్ పెట్టుకోవడానికి ఇష్టపడరని అన్నారు.

Trending News: ఈ రోజుల్లో కూడా రూపాయిన్నరకే అరచేయంత ఇడ్లీ.. ఈ బామ్మ ఎవరు, ఎందుకిలా చేస్తోందో తెలుసుకోండి..


క్లిష్టతరమైన దంత సమస్యలకు డెంటల్ బ్రేసెస్‌ను అమర్చడం ఇప్పటికీ ప్రత్యామ్నాయ మార్గం కాదని డెంటల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఆన్‌లైన్ డెంటల్ కేర్ సెంటర్ల వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని దంత వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాగాలు ఈ విషయంపై దృష్టిపెట్టి ఇలాంటి మోసాలను అరికట్టాలని సూచిస్తున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: CYBER FRAUD, Fraud, Life Style, Teeth

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు