నిద్రలో గురక పెడుతున్నారా.. ఎంత ప్రమాదం అంటే..

Health News: సాధారణంగా చాలా మంది గురక పెడుతుంటారని.. శారీరక శ్రమ లేకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 26, 2019, 7:34 AM IST
నిద్రలో గురక పెడుతున్నారా.. ఎంత ప్రమాదం అంటే..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 26, 2019, 7:34 AM IST
నిద్రలో గురక పెడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే దానివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందట. ముఖ్యంగా మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా చాలా మంది గురక పెడుతుంటారని.. శారీరక శ్రమ లేకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతుందని వెల్లడించారు. శారీరక శ్రమ చేయకుండా పొద్దస్తమానం కూర్చోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయని, సిగరెట్ తాగడం ఎంత ప్రమాదమో శారీరక శ్రమ చేయకపోవడమూ అంతే ప్రమాదకరమని వివరించారు. ఆహారపు అలవాట్లలో తేడా వల్ల కూడా గుండె జబ్బులు వస్తాయన్నారు. యూకేలో దాదాపు 5 లక్షల మందిని పరీక్షించగా.. గురక పెట్టే వారిలో హృద్రోగాలు ఎక్కువగా వచ్చినట్లు తేలిందట.

నిద్రలో గురక రావడానికి శారీరక శ్రమ మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి అని కూడా పలువురు పరిశోధకులు చెబుతున్నారు. సరిగా ఆహారం తీసుకోకపోయినా ఈ సమస్య వస్తుందని వెల్లడించారు.

First published: August 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...