హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Gastric Cancer: మిమ్మల్ని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నుంచి కాపాడే ఆహార పదార్థాలు ఇవే

Gastric Cancer: మిమ్మల్ని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నుంచి కాపాడే ఆహార పదార్థాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gastric Cancer: బ్రెస్ట్‌ క్యాన్సర్‌, బోన్‌ క్యాన్సర్‌, లంగ్‌ క్యాన్సర్‌ వంటి చాలా రకాల క్యాన్సర్‌లు ఉండగా.. అందులో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఒకటి. దీన్ని స్టమక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. కడుపు కణాల DNAలో జన్యు మార్పుల వల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Gastric Cancer:  ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌ బాధితుల (Cancer Victims) సంఖ్య పెరుగుతోంది. జీవనశైలి, అలవాట్ల ద్వారా ఎక్కువ మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. వంశపారపర్యంగా కూడా ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి. బ్రెస్ట్‌ క్యాన్సర్‌, బోన్‌ క్యాన్సర్‌, లంగ్‌ క్యాన్సర్‌ వంటి చాలా రకాల క్యాన్సర్‌లు ఉండగా.. అందులో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఒకటి. దీన్ని స్టమక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. కడుపు కణాల DNAలో జన్యు మార్పుల వల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుంది. అంతేకాకుండా హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక సాధారణ బాక్టీరియ వల్ల కూడా ఈ క్యాన్సర్ సంభవించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఇప్పుడు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ (Gastric Cancer) రావడానికి కారణాలు, వాటి లక్షణాలేంటో తెలుసుకుందాం.

లక్షణాలు

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వ్యాధి ఉన్న వారు ఆహారాన్ని మింగడంలో చాలా ఇబ్బందిపడతారు. తక్కువ మొత్తంలో ఆహారం తిన్నా కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్లు అనిపించడం, పొత్తి కడుపు నొప్పి, గుండెల్లో మంట, అజీర్తి సమస్య, ఆకలిగా అనిపించక పోవడం, బరువు తగ్గడం, రక్తం వాంతి చేసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ సమస్య ఉన్నవారి ఆహారంలో పసుపు అస్సలు వేయకూడదు..! ఉల్లంఘిస్తే ..?

కారణాలు

గ్యాస్ట్రిక్ క్యానర్స్ రావడానికి కారణాలు ఇలా ఉన్నాయి. హైపర్ అసిడిటి, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి కారణంగా కూడా ఈ క్యాన్సర్ రావచ్చు. ఉప్పగా ఉండే ఆహారం అధికంగా తీసుకోవడం, స్మోకింగ్, పండ్లు - కూరగాయలు తరచూ తీసుకోకపోవడం, లించ్ సిండ్రోమ్ వంటి జనటిక్ సిండ్రోమ్ ఫ్యామిలీ హిస్టరీ వంటి కారణాల వల్ల కూడా ఈ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది.

శృంగారానికి ముందు, తర్వాత మూత్ర విసర్జన చేయాలా..? వద్దా..? ఏది మంచిదో తెలుసుకోండి..!

నిరోధించే ఆహారాలు

ఈ క్యాన్సర్ నివారణలో కెరోటినాయిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అవకాడో, బొప్పాయి, గుమ్మడికాయ, బత్తాయి, మొక్కజొన్న, గుడ్డు, బచ్చలికూర వంటి వాటిల్లో కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో వీటిని తరచూ డైట్‌లో చేర్చుకోవాలి. విటమిన్ -సి లభించే ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. ప్రధానంగా నారింజ, మిరియాలు, స్ట్రాబెర్రీ, బ్రోకలీ, బంగాళదుంపలు, బెల్ పెప్పర్స్, టమోటాలు, మామిడి పండ్లలో విటమిన్- సి పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనంతో విటమిన్ -సి ఉంటుంది. కాబట్టి ఇది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.

విటమిన్- సి, కెరోటినాయిడ్స్ యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. దీంతో డీఎన్‌ఏ డ్యామేజ్, క్యాన్సర్ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌లో ఇతర ప్రభావాలను నివారించడంలో కీలక పాత్ర పోషించే ఆక్సిజన్ జాతులను ఇవి ఈ యాక్టివేట్ చేస్తాయి. అయితే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నివారణలో విటమిన్- సి, కెరోటినాయిడ్స్ పాత్రపై ఖచ్చితమైన ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు.

మిజోరంలో అధికం

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కేసులు భారత్‌లో ఇప్పటివరకు పెద్దగా నమోదు కాలేదు. అయితే ఇండియాలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సమస్య కనిపిప్తోంది. భారత్‌లో ప్రధానంగా మిజోరంలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రోగుల్లో 1% నుంచి 3% మంది మాత్రమే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వంశపారంపర్య రూపాన్ని కలిగి ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

First published:

Tags: Cancer, Gastric Cancer, Health Tips, Life Style

ఉత్తమ కథలు