HEALTH SOME OF THE WOMEN WILL LOSE HAIR AFTER POST PREGNANCY KNOW ABOUT THE REASON AK GH
Post Pregnancy Hair Loss: గర్భధారణ తర్వాత జుట్టు రాలుతోందా? సమస్యకు పరిష్కారం ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
కొంత మంది గర్భిణుల్లో మచ్చలు, పిగ్మేంటేషన్, స్ట్రెచ్ మార్క్స్, కళ్లు ఉబ్బడం, కళ్ల కింద నల్లమచ్చల వంటివి ఏర్పడతాయి. హర్మోన్ మార్పుల కారణంగా జుట్టు పొడి బారుతుంది, చిక్కులు ఏర్పడతాయి. సాధారణంతో పోల్చితే గర్భధారణలో జుట్టు రాలడం రెట్టింపు ఉంటుంది.
చాలా మంది మహిళల్లో గర్భధారణ సమయంలో జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. హర్మోన్ల స్థాయిలో తీవ్రంగా ఒడిదొడుకుల కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. గర్భిణుల్లో ప్రోజెస్టిరాన్ హార్మోన్ అధికస్థాయిలో ఉంటుంది. ఈస్ట్రోజెన్ స్థాయి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా జుట్టు విపరీతంగా రాలుతూ ఉంటుంది. శిశుంవు జననం తర్వాత జుట్టు రాలడం(Hair loss) తగ్గి కొత్త జుట్టు రావడం ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా ప్రసవం తర్వాత మూడు నుంచి ఆరు నెలల తర్వాత జరుగుతుంది. అనంతరం మహిళలకు(Women) జుట్టు మళ్లీ మూమూలుగా మారిపోతుంది.
కొంత మంది గర్భిణుల్లో(Pregnant) మచ్చలు, పిగ్మేంటేషన్, స్ట్రెచ్ మార్క్స్, కళ్లు ఉబ్బడం, కళ్ల కింద నల్లమచ్చల వంటివి ఏర్పడతాయి. హర్మోన్ మార్పుల కారణంగా జుట్టు పొడి బారుతుంది, చిక్కులు ఏర్పడతాయి. సాధారణంతో పోల్చితే గర్భధారణలో జుట్టు రాలడం రెట్టింపు ఉంటుంది. జుట్టు కుదుళ్లు బలంగా లేకపోతే కండిషనర్ వాడకాన్ని బాగా తగ్గించాలి. పైన జల్లే స్ప్రేలను కూడా దూరం పెట్టాలి. కండిషనర్ పెట్టిన తర్వాత జుట్టును చల్లని నీటితో కడగాలి.
చిక్కు జుట్టుకు యాంటీ ఫ్రిజ్ షాంపూ, కండిషనర్లు వాడటం ఉత్తమం. బ్లోతో డ్రైయింగ్ చేయకపోవడం మంచిది. పండ్లు బాగా తీసుకోవాలి. ప్రోటిన్లు, డ్రై ఫ్రూట్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి. తల, వెంట్రుకలు శుభ్రంగా ఉంచుకోవాలి. సున్నితమైన యాంటీ హెయిర్ లాస్ షాంపూతో తల శుభ్రం చేసుకోవాలి. జుట్టు చివర్లు చిట్లిపోకుండా చూసేందుకు కండిషన్ చేయాలి. మీకు సమయం లేకపోతే లీవ్-ఇన్- కండిషనర్ అప్లై చేయవచ్చు.
* ఈ జాగ్రత్తలు కూడా..
జుట్టు బాగా లాగి ముడివేయకండి. అలా చేయడం వల్ల మీ తలపై, జుట్టుపై ఒత్తిడి పెరుగుతుంది. అలా గట్టిగా లాగడం వలన వెంట్రుకలు సులభంగా ఊడివస్తాయి.
* ఆరోగ్యకరమైన ఆహారం
మీ ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. స్ట్రాబెర్రీ, యాపిల్స్, రాజ్మా, వంటివి తీసుకోవాలి. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు.
* విటమిన్ సప్లిమెంట్లు
ప్రసవానంతరం తిరిగి మీ శరీరం శక్తి నింపుకునేందుకు కొన్ని సప్లిమెంట్లు అవసరం. మీ శిరోజా సౌందర్యం కోసం విటమిన్ B, విటమిన్ C క్రమం తప్పకుండా తీసుకోవాలి.
* కెమికల్ ట్రీట్మెంట్
జుట్టుకు కలరింగ్, స్ట్రెయిటెనింగ్, పెర్మింగ్ వంటివి చేయకూడదు. వీటి వలన జుట్టు రాలవచ్చు. అంతే కాదు ఈ ట్రీట్మెంట్కు మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఏదైనా ప్రత్యేక సందర్భానికి ఎప్పుడైనా ఒకసారి బాగుంటుంది కానీ, సాధారణ పరిస్థితుల్లో వీటిని దూరం పెట్టడం ఉత్తమం.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.