HEALTH SKIN CARE PRODUCTS WANT TO BUY BETTER SKIN CARE PRODUCTS KNOW THESE THINGS GH VB
Skin Care Products: మంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
చాలామంది సరైన స్కిన్ ప్రొడక్టులను ఎంచుకోకుండా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న వాటిపై ఆసక్తి చూపుతారు. ఇది ఎప్పటికీ సరైన విధానం కాదు. అన్ని రకాల చర్మ సంరక్షణ ఒకే విధంగా ఉండదు. మంచి ప్రొడక్ట్‌ను ఎంచుకోవడానికి ఈ విషయాలు ఫాలో అవ్వండి.
అందరూ ఆరోగ్యకరమైన మెరుపుతో సిల్కీ- స్మూత్ చర్మాన్ని(Silky- Smooth Skin) కోరుకుంటారు. కానీ చర్మానికి సరైన పదార్థాలతో సరైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను(Skin Care Products) కనుగొనడం చాలా ముఖ్యం. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన చర్మం(Skin) కోసం సరైన ప్రొడక్ట్స్(Products) అవసరం. రోజంతా చర్మాన్ని సురక్షితంగా కాపాడుకోవాలి. అయితే చాలామంది సరైన స్కిన్ ప్రొడక్టులను ఎంచుకోకుండా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న వాటిపై ఆసక్తి చూపుతారు. ఇది ఎప్పటికీ సరైన విధానం కాదు. అన్ని రకాల చర్మ సంరక్షణ ఒకే విధంగా ఉండదు. మంచి ప్రొడక్ట్‌ను ఎంచుకోవడానికి ఈ విషయాలు ఫాలో అవ్వండి.
చర్మం రకాన్ని తెలుసుకోండి
స్కిన్‌కేర్ రొటీన్‌ను తయారు చేసేముందు మీ చర్మం రకాన్ని తెలుసుకోవడం తెలుసుకోండి. జిడ్డు, పొడి, సున్నితమైన లేదా మిశ్రమ చర్మంలో దేనికి చెందుతుందో అర్థం చేసుకోండి. మీ చర్మం రకానికి తగిన ప్రొడక్ట్ ఎంచుకోండి. అన్ని రకాల చర్మాలకు ఒకే రకమైన ఉత్పత్తులు పని చేయవు. మీ చర్మానికి ఏది సనైనదో తెలుసుకొని, అవే వాడాలి.
ఖరీదైనవి కాబట్టి ఎంచుకోవద్దు
మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ సలహా ఆధారంగా స్కిన్ కేర్ ప్రొడక్ట్ కొనుగోలు చేయాలనుకుంటే.. దాన్ని ప్రయత్నించే ముందు వారి చర్మ రకం ఎలాంటిదో తెలుసుకోవాలి. ఆన్లైన్లో రివ్యూలు చూడాలి. వినియోగించిన వారు చేసిన కామెంట్స్‌ను పూర్తిగా చదవాలి. దాని తయారీలో వినియోగించిన పదార్థాల గురించి తెలుసుకోవాలి. అన్ని విధాలా సక్రమంగా ఉంటేనే దాన్ని కొనుగోలు చేయాలి.
ప్యాచ్ టెస్ట్ చేయండి: ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి. ఉదాహరణకు మీ ముంజేయి లోపల చర్మం చిన్న పాచ్పై దాన్ని పరీక్షించండి. ఇలా చేయడం ద్వారా ఆ ప్రొడక్ట్‌తో మీ చర్మం రియాక్షన్ ఏంటో తెలుస్తుంది. మీకు అలర్జీ రియాక్షన్ ఉంటే, ముందుగానే గుర్తించి జాగ్రత్త పడవచ్చు. చర్మంపై ప్రొడక్ట్ అప్లై చేసిన తర్వాత అక్కడ ఎరుపుగా మారినా, పొరలుగా వచ్చినా, లేదా చర్మం ఉబ్బడం, చిరాకుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం అవ్వవచ్చు. ముఖానికి నేరుగా అప్లై చేసి ఇబ్బంది పడకుండా బయట పడవచ్చు. డెర్మటాలజిస్ట్‌ని కలవండి: మంచి స్కిన్ కేర్ రొటీన్ కోసం డెర్మటాలజిస్ట్‌ను కలవండి. వారు చర్మ సంరక్షణకు సరిపోయే ఉత్పత్తులను సూచిస్తారు. నిపుణుల సలహాలతో ఏదైనా ప్రొడక్ట్‌ను వినియోగించడం మేలు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.