Home /News /life-style /

HEALTH SIGNS YOUR KIDNEYS ARE NOT WORKING PROPERLY GH VB

Kidney Problems: కిడ్నీ ప్రాబ్లమ్‌ను ముందుగానే గుర్తించే లక్షణాలు.. ఇవి కనిపిస్తే అలర్ట్ కావాల్సిందే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

మీ కిడ్నీ పనితీరు మందగిస్తోందని తెలుసుకోవడం ఎలా? దానికి సంకేతాలేంటి? మూత్రపిండాల పనితీరు సరిగా లేకపోవడాన్ని గుర్తించే లక్షణాలు ఏవి? వంటి వివరాలు తెలుసుకుందాం.

శరీరంలోని వ్యర్థ పదార్థాలను ఫిల్టర్(Filter) చేసి మూత్రం ద్వారా బయటకు పంపే కిడ్నీలు(Kidney) మన శరీరంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తాయి. అయితే మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దానిని ఎర్లీ స్టేజ్ లోనే గుర్తించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో చాలామందిని కిడ్నీ సమస్య వేధిస్తోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా చాపకింద నీరులా మూత్రపిండాల సమస్య విస్తరిస్తోంది. కిడ్నీలు సరిగ్గా పని చేయనప్పుడు మన శరీరం విషపదార్థాలతో నిండిపోతుంది. ఓ స్టేజి వరకు అయితే ఫర్వాలేదు కానీ.. అదుపుతప్పితే ఇది ప్రాణాంతకమే. మరి మీ కిడ్నీ(Kidney) పనితీరు మందగిస్తోందని తెలుసుకోవడం ఎలా? దానికి సంకేతాలేంటి? మూత్రపిండాల పనితీరు సరిగా లేకపోవడాన్ని గుర్తించే లక్షణాలు ఏవి? వంటి వివరాలు తెలుసుకుందాం.

మోకాళ్లు-పాదాలు ఉబ్బడం..
కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఒంట్లో సోడియం నిలువ ఉండిపోతుంది. ఫలితంగా ఇది మోకాళ్లు, పాదాలను ఉబ్బేలా చేస్తుంది. కొన్నిసార్లు వాపు ఇతర అనారోగ్య పరిస్థితులూ ఎదురు కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ చేయించుకోవాలి.

SkyDive: హైదరాబాద్‌లో స్కైడైవింగ్‌ చేసే అవకాశం.. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లోనూ అందుబాటులోకి..!


కళ్ల చుట్టూ ఉబ్బరం..
మూత్రపిండాలు దెబ్బతింటే రక్తంలోకి పెద్ద మొత్తంలో ప్రోటీన్‌ను లీక్ చేస్తుంటాయి. దీనితో కళ్ళ చుట్టూ ఉబ్బినట్లు కనిపిస్తుంది. కిడ్నీపనితీరు ప్రభావితం అయిందనేందుకు ఇది ఓ సంకేతం కావచ్చు. మీకూ ఇలా ఉంటే అలర్ట్ అవ్వాల్సిందే.

మూత్రంలో నురుగు..
నురుగుతో కూడిన మూత్రం రక్తంలో అధిక ప్రోటీన్ ను లీక్ చేస్తుందనేందుకు సంకేతం. శరీరంలోని మాక్రోన్యూట్రియెంట్‌ను మూత్రపిండాలు ఫిల్టర్ చేయలేనప్పుడు ఈ పరిస్థితి తలెత్తవచ్చు.

అస్తమానం అలసట..
కిడ్నీలు వీక్ అయితే విషపదార్థాలు రక్తంలో పేరుకుపోతాయి. దీనితో ఎప్పుడూ అలసిపోయి, బలహీనంగా అనిపిస్తుంటుంది. బాగా నిద్రపోయినప్పటికీ.. మీ రోజువారీ పనిని నిర్వహించడం కష్టంగా అనిపించవచ్చు.

ఆకలి లేకపోవటం..
కిడ్నీల పనితీరు మందగిస్తే ఆకలి తగ్గిపోతుంది. సాధారణంగా ఇతర కారణాల వల్ల సైతం ఆకలి లేకపోయినప్పటికీ మూత్రపిండాల పనితీరు ప్రధాన సమస్య అయ్యే అవకాశాలు ఎక్కువ.

ఇది కూడా చదవండి : ముద్దు భారత్ లోనే పుట్టిందా..? ఆ తర్వాత మన దగ్గర నుంచి ప్రపంచం నేర్చుకుందా..?

మూత్రంలో రక్తం..
మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు రక్త కణాలు మూత్రంలోకి రావడం ప్రారంభిస్తాయి. ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా రావడం గమనించవచ్చు.

చర్మం పొడిబారడం, దురద..
రక్తంలో ఖనిజాల స్థాయిని మూత్రపిండాలు బ్యాలెన్స్ చేస్తుంటాయి. ఈ ప్రక్రియలో అసమతుల్యత ఏర్పడితే చర్మం పొడిగా మారుతుంది. దురదగా కూడా అనిపిస్తుంది.

ఏకాగ్రత లోపించడం..
మూత్రపిండాలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా.. ఏకాగ్రత తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఏ పనిపైనా దృష్టి సారించలేకపోవచ్చు.

నిద్ర పట్టకపోవటం..
కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు నిద్ర కరవవుతుంది. నిద్రపోవడం ఒక పనిలాగా అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. చాలా సందర్భాల్లో నిద్రలేమి, గాఢ నిద్రకు భంగం కలుగుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: Health, Healthbenefits, Kidney, Life Style

తదుపరి వార్తలు