HEALTH SIGNS OF VIRGINITY TO DISAPPEAR FROM SECOND YEAR MBBS BOOKS BS
వాటిల్లో ‘వర్జినిటీ’ కోల్పోనున్న మెడికల్ విద్యార్థులు.. ఎందుకంటే?
ప్రతీకాత్మక చిత్రం (Photo courtesy: AFP Relaxnews/ Nikodash/ IStock.com)
కంజార్‌భట్ తెగతో పాటు మరికొన్ని సమూహాల్లో కన్యత్వ పరీక్షల ఆచారం కొనసాగుతుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆ ప్రభుత్వం కన్యత్వ పరీక్షలను ఇకపై నేరంగా పరిగణించనున్నట్లు పేర్కొంది.
కన్యత్వ పరీక్ష.. ఒక అమ్మాయి, అబ్బాయితో శృంగారం చేసిందా? లేదా? అని తెలుసుకోవడానికి నిర్వహించేది. స్త్రీల జననాంగం లోపల ఉండే హైమన్ పొర చిరిగితే ఆమె కన్య కాదని, చిరగకపోతే ఆమె కన్య అని నిర్ధారణ చేస్తారు. ఇలాంటి పరీక్షలు నిర్వహించడం మహారాష్ట్రలోని ఓ తెగలో సర్వసాధారణం. అక్కడి కొన్ని సమూహాల్లో పెండ్లికి ముందు యువతులకు బలవంతంగా కన్యత్వ పరీక్షలు చేపించే ఆచారం ఈనాటికి కొనసాగుతూ వస్తుంది. కంజార్‌భట్ తెగతో పాటు మరికొన్ని సమూహాల్లో కన్యత్వ పరీక్షల ఆచారం కొనసాగుతుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆ ప్రభుత్వం కన్యత్వ పరీక్షలను ఇకపై నేరంగా పరిగణించనున్నట్లు పేర్కొంది. లైంగిక వేధింపులుగా పరిగణించి బాధ్యులను శిక్షించనున్నట్లు తెలిపింది. అయితే, ‘కన్యత్వం’ పుస్తకాల్లోనూ ఉండటం గమనార్హం. ‘వర్జినిటీ సంకేతాలు’ పేరుతో ఎంబీబీఎస్ రెండో సంవత్సరంలో ఒక చాప్టర్ ఉంది. ఇందులో తెలిపిన పరీక్ష విధానం సరికాదని తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ వర్సిటీ స్పష్టం చేసింది. ఆ చాప్టర్‌ను తొలగించాలని నిర్ణయానికి వచ్చింది.
అసలు విషయానికి వస్తే.. ఎంబీబీఎస్ రెండో సంవత్సరంలో ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ సబ్డెక్ట్ ఉంది. అందులోని ఒక చాప్టర్ పేరు.. ‘సైన్స్ ఆఫ్ వర్జినిటీ’. అందులో పేర్కొన్న ఒక వర్జినిటీ టెస్ట్.. టూ ఫింగర్ టెస్ట్. అంటే స్త్రీ యోనిలోకి వేళ్లను చొప్పించి హైమన్ పొర ఉందో లేదో చెక్ చేయడం. ఇది శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. దీంతో శాస్త్రీయంగా నిరూపితం కాని ఆ పరీక్ష పద్ధతిని పుస్తకాల్లో ఉంచడం సరికాదని, మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ప్రతిపాదించింది. ఆ విధానం మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని, మహిళల గౌరవానికి భంగం కలిగించేదని ప్రొఫెసర్ డాక్టర్ ఇంద్రజిత్ ఖండేకర్ వాదిస్తున్నారు.
అమానుష పరీక్ష
టూ ఫింగర్ టెస్ట్‌ను 2013లోనే సుప్రీం కోర్టు బ్యాన్ చేసింది. అయితే, ఈ పరీక్ష చేసి బాధితురాలు రేప్‌కు గురైందో లేదో చెప్పాలని మెడికల్ ఎగ్జామినర్లను పోలీసులు ఇప్పటికీ కోరుతున్నారని ఇంద్రజిత్ అంటున్నారు. బాధితురాలు అత్యాచారానికి గురైందో లేదో కనుగొనేందుకు రక్త నమూనాలు మాత్రమే సేకరించాలని, కానీ ఈ పద్ధతిని ప్రోత్సహించడం సరైందని కాదని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతానికి ఈ టాపిక్‌ను మహారాష్ట్రలోనే తొలగించనున్నారు. అయితే, దేశవ్యాప్తంగా మెడికల్ సబ్జెక్టుల నుంచి తొలగించాలని ఇంద్రజిత్ సుప్రీం కోర్టుకు, కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.