HEALTH SEXUALLY TRANSMITTED DISEASE CAUSES INFERTILITY REASON SYMPTOMS AND SOLUTION GH VB
Sexually Transmitted Disease: లైంగిక సంక్రమిత వ్యాధులు.. వాటికి కారణం అవుతాయంటున్న నిపుణులు..
ప్రతీకాత్మక చిత్రం
లైఫ్‌స్టైల్ మార్పుల కారణంగా గతంతో పోలిస్తే గర్భిణులు ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. నిరంతర వైద్య పర్యవేక్షణలో కడుపులో బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా కాపాడుకుంటున్నారు. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల సంతానోత్పత్తి విషయంలో మహిళలు కొన్ని సమస్యలు(Problems) ఎదుర్కొంటున్నారు.
లైఫ్‌స్టైల్(Life style) మార్పుల కారణంగా గతంతో పోలిస్తే గర్భిణులు ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. నిరంతర వైద్య పర్యవేక్షణలో కడుపులో బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా కాపాడుకుంటున్నారు. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల సంతానోత్పత్తి విషయంలో మహిళలు కొన్ని సమస్యలు(Problems) ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా క్లామిడియా, గోనేరియా(Chlamydia and gonorrhea) అని పిలిచే లైంగిక సంక్రమణ వ్యాధులు స్త్రీల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. శృంగారం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ఈ వ్యాధులను అదుపు చేయకపోతే మహిళల్లో వంధ్య్యత్వానికి (Infertility) దారితీయవచ్చు. STD(sexually transmitted diseases), మహిళల వంధ్య్యత్వానికి సంబంధించిన కొత్త పరిశోధన ప్రకారం లైంగిక సంక్రమిత వ్యాధులు కొన్ని సందర్భాల్లో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్(PID), మహిళల ఫెలోపియన్ ట్యూబ్‌కు హాని కలగించి వారిలో సంతానోత్పత్తిని నివారించే అవకాశముందని పేర్కొన్నాయి.
ఈ లైంగిక సంక్రమిత వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంపర్కం(Sexual Intercourse) ద్వారా వ్యాపిస్తాయి. యోని, ఆనల్, ఓరల్ లాంటి ఇతర శారీరక సన్నిహిత సంబంధాల ద్వారా వస్తాయి. ఇవి మహిళలను వంధ్య్యత్వానికి గురిచేస్తాయి. పీఐడీ ఎగువ జననేంద్రియ మార్గంలో ఏర్పడుతుంది. ఇది ఫెలోపియన్ ట్యూబ్, గర్భాశయానికి శాశ్వత నష్టం కలిగించవచ్చు. చివరకు వంధ్యత్వానికి దారితీయవచ్చు. సాధారణంగా అంతర్గత పునరుత్పత్తి అవయవాలకు క్రిములు, ఇన్ఫెక్షన్లు చేరకుండా నిరోధించడానికి అవరోధంగా గర్భాశయం పనిచేస్తుంది. అయితే గర్భాశయం కలుషితమైన దాని చుట్టుపక్కల కణజాలాల్లోకి సూక్ష్మజీవుల ప్రవేశాలను ఆపడంలో విఫలమైనప్పుడు ఇలా జరుగుతుంది. WebMD జర్నల్ కూడా ఇదే విషయాన్ని నివేదించింది.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
లైంగిక సంక్రమిత వ్యాధి అయిన క్లామిడియా.. క్లామిడియా ట్రాకోమాటిస్ అనే జీవి వల్ల వస్తుందని న్యూఢిల్లీ శాంతాఫెర్టిలిటీ సెంటర్ కు చెందిన డాక్టర్ అనుభా సింగ్ తెలిపారు. అంతేకాకుండా ఎక్కువ మంది భాగస్వాములతో శృంగారంలో పాల్గొన్న స్త్రీలు, గర్భం దాల్చడానికి సరైన వయసు ఉన్నవారికి ఇది ఎక్కువగా వస్తుందని తెలిపారు. 25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న స్త్రీలకు పీఐడీ సమస్య వచ్చే అవకాముందని స్పష్టం చేశారు. 25 ఏళ్ల లోపు ఉన్న ఆడవారి గర్భాశయం లైంగిక సంక్రమిత వ్యాధితో పోరాడటానికి సిద్ధంగా ఉండదు. ఫలితంగా పీఐడీ వస్తుందని తెలిపారు.
లక్షణాలు
చాలా మంది మహిళలు క్లామిడియా లేదా గోనేరియా బారిన పడతారు. అయితే పెద్దగా లక్షణాలు కనిపించవు. ఫలితంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స చేయడం కష్టమవుతుంది. మీరు లైంగికంగా చురుకుగా ఉన్నట్లయితే లేదా మీ భాగస్వామికి ఎప్పుడైనా STD బారిన పడినట్లయితే మీ పొత్తికడుపులో నొప్పి, అసాధారణంగా ఉండటం, యోని నుంచి ద్రవాలు ఎక్కువగా రావడం, జ్వరం, వాంతులు, సంభోగం సమయంలో తీవ్రమైన నొప్పి, శృంగారం తర్వాత రక్తస్రావం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స ఎలా?
మీకు పీఐడీ ఉండవచ్చని భయపడుతుంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పెల్విక్ టెస్ట్, STD టెస్టుల ద్వారా పీఐడీని గుర్తించవచ్చు. మీరు ఇప్పటికే వంధ్య్యత్వానికి సంబంధించిన సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, పీఐడీ ద్వారా ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించనట్లయితే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించండి. హిస్టెరోసల్పింగోగ్రామ్ అని పిలిచే ఎక్స్‌రే, లాపరోస్కోపి అనే డయాగ్నస్టిక్ సర్జికల్ ప్రక్రియల ద్వారా డాక్టర్ మీ ఫెలోపియన్ ట్యూబ్‌లో ఏదైనా అడ్డంకి ఉందో లేదో గమనిస్తారు.
పరిష్కారం ఏంటి?
పీఐడీ సమస్యను నయం చేయవచ్చు. దీని కంటే కూడా వ్యాధిని నివారించడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. కండోమ్ లాంటి అవరోధ పద్ధతిని ఉపయోగించడం ద్వారా STDలను నివారించవచ్చు. రెగ్యులర్ గా లైంగిక ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవాలి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.