హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Coffee: నిద్ర లేవగానే కాఫీ తాగుతున్నారా..? కాఫీ తాగేందుకు కరెక్ట్ టైం ఏదో మీకు తెలుసా..?

Coffee: నిద్ర లేవగానే కాఫీ తాగుతున్నారా..? కాఫీ తాగేందుకు కరెక్ట్ టైం ఏదో మీకు తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆధునిక మానవుడు ఎప్పుడుపడితే అప్పుడు కాఫీ తాగేస్తున్నాడు. అదేమంటే కాఫీ షాపులు వచ్చాక నచ్చిన సమయంలో కాఫీ తాగే కొత్త కల్చర్ అలవాటు అయిపోయింది మరి. ఇంతకీ కాఫీ ఏ టైంలో తీసుకోవటం బెస్ట్ అన్నది మీకు తెలుసా..

కాఫీ.. ఇది ఒక చోదక శక్తి. ఇది ఓ మూడ్ సెట్టర్. ఇది ఓ స్ట్రెస్ బస్టర్. సరిగ్గా చెప్పాలంటే ఇది ఒత్తిడికి చెక్ పెట్టి, ఉత్సాహాన్ని రెట్టించే ఓ టానిక్ అంతే. పూర్వం కాఫీ అంటే ఉదయం, సాయంత్రం మాత్రమే తాగేవారు. కానీ ఆధునిక మానవుడు ఎప్పుడుపడితే అప్పుడు కాఫీ తాగేస్తున్నాడు. అదేమంటే కాఫీ షాపులు వచ్చాక నచ్చిన సమయంలో కాఫీ తాగే కొత్త కల్చర్ అలవాటు అయిపోయింది మరి. ఇంతకీ కాఫీ ఏ టైంలో తీసుకోవటం బెస్ట్ అన్నది మీకు తెలుసా. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఉదయం 10 గంటల తరువాత లేదా మధ్యహ్నం కాఫీ తీసుకునేందుకు రైట్ టైం. అదేంటి తెల్లారి కాఫీ తాగితే గానీ రొటీన్ స్టార్ట్ కాదు, నిద్ర మత్తు వదలదు, తెల్లారినట్టు అనిపించదు అంటారా అదంతా మీకు అలవాటైన విషయం అంతేకానీ జస్ట్ ఆ ఫీలింగ్ నుంచి బయటికి వస్తే సరి.

ఇది కూడా చదవండి: అదృష్టం అంటే అతనిదే.. 53 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న పర్సు దొరికింది.. ఎక్కడంటే..?

అలాగే రాత్రి సమయంలో కాఫీ తాగితే నిద్ర తూలటం కష్టం దీనికి కారణం కెఫిన్ కు ఆరు గంటలపాటు నిద్రకు కళ్లెం వేసే శక్తి ఉండటమే. కాబట్టి ఏదో మేల్కోవాల్సి వచ్చినప్పుడు కాకుండా మిగతాటప్పుడు అనవసరంగా రాత్రిపూట కాఫీ తాగితే నిద్రలేమి బారిన పడాల్సి వస్తుంది. అంతేకాదు రోజూ కప్పులకొద్దీ కాఫీ తాగటాన్ని ఇష్టంగా చేసేవారు జాగ్రత్త ఎందుకంటే కాఫీలోని కెఫిన్ అంటే మైల్డ్ డ్రగ్ దీనికి మీరు బానిసలు కావద్దు, పైపెచ్చు ఇలా కాఫీలు లాగిస్తూ పోతే మీ ఒంట్లో కెఫిన్ నిల్వలు అమాంతం పెరగటమే కాదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా అది మోసుకొస్తుంది. మీ జీర్ణ క్రియపై ప్రభావం చూపి ఆకలి మందగించేలా చేస్తూ, కాఫీలోని పాలు, క్రీమ్, చక్కెర మీకు హాని చేస్తాయి కూడా. కాబట్టి అతిగా కాఫీ తాగకుండా, వీలైతే బ్లాక్ కాఫీ ట్రై చేయండి మీ మెటబాలిజం పెంచుకోండి. పెద్ద మగ్గు నిండా కాఫీ తాగుతూ ఉండకండి చిన్న కప్పులో మితంగా కాఫీని ఎంజాయ్ చేయండి.

ఇది కూడా చదవండి: 5 నెలల పాపకు అరుదైన వ్యాధి.. తల్లి కన్నీటి విన్నపం.. మోదీ నిర్ణయంపై నెట్టింట ప్రశంసల వెల్లువ

మార్నింగ్ కాఫీ వద్దు..

ఉదయం లేవగానే ఫస్ట్ మీల్ గా కాఫీ తాగటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం తెల్లారి మనం లేవగానే మన ఒంట్లో కార్టిసాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో కాఫీ తాగితే అది కార్టిసాల్ ప్రొడక్షన్ పై ప్రభావం చూపుతుంది. కార్టిసాల్ తోనే మనం హుషారుగా ఉండి, ఎనర్జిటిక్ గా ఉండగలం. ఒకవేళ మీరు ఉదయమే కాఫీతో డే స్టార్ట్ చేశారంటే కార్టిసాల్ తక్కువ ఉత్పత్తి అయి..మీరు రోజంతా ఎక్కువ కాఫీ తాగాలనే ఫీలింగ్ లో ఉంటారు. లేదంటే హుషారు తగ్గి, బద్ధకంగా, నిద్ర తూగుతున్నట్టు ఉంటారు. అందుకే మీ ఫస్ట్ కాఫీని ఉదయం 10 గంటల సమయంలో తాగితే కార్టిసాల్ ప్రొడక్షన్ పై దుష్ప్రభావం అస్సలు లేకపోగా మీ డే అంతా మీరు ఎనర్జిటిక్ గా ఉండేలా చేస్తుంది. ఇక మధ్యహ్నం కూడా కప్పు కాఫీ తాగితే మీరు రెట్టించిన ఉత్సాహంతో ఉంటారని నిపుణులు చెబుతున్నారు. తక్కువ పరిమాణంలోనే కాఫీ తాగటం ఎప్పుడూ మంచిది ఎందుకంటే ఇది అరగంటలో ప్రభావం చూపటాన్ని మొదలుపెడుతుంది.

Published by:Hasaan Kandula
First published:

Tags: Ayurveda health tips, Best health benefits, Health food, Health secrets

ఉత్తమ కథలు