Home /News /life-style /

Running vs Skipping: రన్నింగ్ లేదా స్కిప్పింగ్​.. త్వరగా బరువు తగ్గేందుకు ఏది సరైన వ్యాయామం?.. తెలుసుకోండి

Running vs Skipping: రన్నింగ్ లేదా స్కిప్పింగ్​.. త్వరగా బరువు తగ్గేందుకు ఏది సరైన వ్యాయామం?.. తెలుసుకోండి

రన్నింగ్ లేదా స్కిప్పింగ్​.. త్వరగా బరువు తగ్గేందుకు ఏది సరైన వ్యాయామం? (ప్రతీకాత్మక చిత్రం)

రన్నింగ్ లేదా స్కిప్పింగ్​.. త్వరగా బరువు తగ్గేందుకు ఏది సరైన వ్యాయామం? (ప్రతీకాత్మక చిత్రం)

మీ లక్ష్యం ఎక్కువ కేలరీలను తక్కువ సమయంలో కరిగించడమే అయితే, స్కిప్పింగ్​ బెస్ట్ ఆప్షన్​. ఎందుకంటే ఒక నిమిషం స్కిప్పింగ్​తో 10 నుంచి 16 కేలరీలు బర్న్ చేయవచ్చు. అంటే 30 నిమిషాలు స్కిప్లపింగ్​ చేయడం వల్ల దాదాపు 480 కేలరీలు బర్న్ చేయవచ్చు.

ఇంకా చదవండి ...
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారింది. చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, అధిక పని ఒత్తిడి వంటికి అధిక బరువుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. వీటి కారణంగా చిన్నపిల్లలు, యువకులు సైతం అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తుంటారు. వాటిలో ఎక్కువ మంది ఉదయం, సాయంత్రం రన్నింగ్​, స్కిప్పింగ్​ వంటివి పాటిస్తుంటారు. ఈ రెండూ బరువు ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే, మీ గుండె కండరాలను బలోపేతం చేయడానికి, ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఏది మంచిది? అనే విషయాన్ని తెలుసుకుందాం.

స్కిప్పింగ్​ ప్రయోజనాలు

వేగంగా బరువు తగ్గడం

మీ లక్ష్యం ఎక్కువ కేలరీలను తక్కువ సమయంలో కరిగించడమే అయితే, స్కిప్పింగ్​ బెస్ట్ ఆప్షన్​. ఎందుకంటే ఒక నిమిషం స్కిప్పింగ్​తో 10 నుంచి 16 కేలరీలు బర్న్ చేయవచ్చు. అంటే 30 నిమిషాలు స్కిప్లపింగ్​ చేయడం వల్ల దాదాపు 480 కేలరీలు బర్న్ చేయవచ్చు. పది నిమిషాల స్కిప్పింగ్​ ఎనిమిది నిమిషాల రన్నింగ్​తో సమానమని వైద్యులు చెబుతున్నారు. స్కిప్పింగ్ వల్ల వేగంగా కొవ్వు కరుగుతుంది. ముఖ్యంగా ఇది మీ పొత్తికడుపు, కండరాల చుట్టూ కొవ్వు కరిగించి అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలను తగ్గిస్తుంది.

శరీర కండరాలను బలపరుస్తుంది

స్కిప్పింగ్​ మీ దిగువ శరీర కండరాలను బలంగా చేస్తుంది. రన్నింగ్​తో పోలిస్తే స్కిప్పింగ్​ మీ మోకాళ్లపై తక్కువ ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే, గాయాలతో ఉన్న వ్యక్తులు తమ బరువు తగ్గించుకునేందుకు రన్నింగ్​ కంటే స్కిప్పింగ్​ చేయడం మంచిది.

చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది

తాడుతో చేసే స్కిప్పింగ్​ ద్వారా మీరు నిరంతరం పైకి ఎగురుతుంటారు. తద్వారా మీ మణికట్టు బలంగా మారుతుంది. అందుకే, వేగవంతమైన ఫుట్‌వర్క్, పూర్తి శరీర సమన్వయం కోసం స్కిప్పింగ్​ చేయడం అవసరం. ఇది అథ్లెటిక్ కండిషనింగ్, బ్యాలెన్స్, మీ స్టామినాను పెంచడంలో గొప్పగా పనిచేస్తుంది.

రన్నింగ్ ప్రయోజనాలు

కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్​ను మెరుగుపరుస్తుంది

మీ హృదయనాళ వ్యవస్థను మెరుగుపర్చేందుకు, గుండె గోడలను బలోపేతం చేయడానికి రన్నింగ్​ బాగా ఉపయోగపడుతుంది. మీ శరీర సామర్థ్యాన్ని పెంచడానికి రన్నింగ్ ఒక అద్భుతమైన వ్యాయామం. ఇది ఆరోగ్యకరమైన రక్త ప్రవాహానికి మద్దతు ఇస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ప్రతిరోజూ నడిచే వ్యక్తుల గుండె ఆరోగ్యకరంగా ఉంటుందని అనేక అధ్యయనాల్లో తేలింది. రన్నింగ్​ హీ రక్తపోటు లేదా ఇతర హృదయ సంబంధ సమస్యలను 35-నుంచి 55 శాతం మేర తగ్గిస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది

రన్నింగ్​ చేసే క్రమంలో మీ మెదడులో ఎండార్ఫిన్స్, సెరోటోనిన్ వంటి రసాయనాలు విడుదలవుతాయి. రన్నింగ్​ మీ ఒత్తిడి స్థాయిలను, ఆందోళనను తగ్గిస్తుంది. అంతేకాకుండా, డిప్రెషన్, ఒంటరితనం భావాలను కూడా తగ్గిస్తుంది. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది

రన్నింగ్ మీ ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. ఇది మీ శరీరంలోని కార్బన్ డయాక్సైడ్, శ్లేష్మం, కఫంలను కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా, రన్నింగ్ మీ శ్వాసకోశ కండరాల సామర్థ్యాన్ని, శ్వాసను మెరుగుపరుస్తుంది. ఇది మీ ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
Published by:John Naveen Kora
First published:

Tags: Health Tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు