ప్రస్తుతం వైద్య రంగంలో కూడా రోబోలు ప్రవేశిస్తున్నాయి. కొన్ని రకాల శస్త్రచికిత్సలో రోబోల వినియోగంపై పరిశోధనలు సైతం జరుగుతున్నాయి. ముఖ్యంగా వీటితో హిప్ రీప్లేస్‌మెంట్ చికిత్సలో మెరుగైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ల నొప్పిని తగ్గించడానికి లేదా తుంటి పగుళ్లకు సాధారణంగా టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ చేస్తారు. హిప్ రీప్లేస్‌మెంట్ అనేది మెడికల్ సర్జరీ. ఇందులో తొడ జాయింట్‌ను ప్రోస్తెటిక్ ఇంప్లాంట్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియను హిప్ ప్రొస్థెసిస్ అంటారు.
* 1960లో ప్రారంభం
టోటల్ హిప్ ఆర్థ్రోప్లాస్టీ (THA)ని ఆరోగ్య సంరక్షణలో అందుబాటులో ఉన్న అత్యంత విజయవంతమైన శస్త్రచికిత్సా విధానాలలో ఒకటిగా పరిగణిస్తారు. మోడర్న్ THAని 1960ల ప్రారంభంలో UKలోని రైటింగ్‌టన్ హాస్పిటల్‌లో బ్రిటీష్ సర్జన్ సర్ జాన్ చార్న్‌లీ ప్రారంభించారు. అప్పటి నుంచి ఫలితాలను మెరుగుపరచడం కోసం THA అభివృద్ధిపై దృష్టి సారించారు. ప్రస్తుతం THAలో రోబోటిక్స్ వినియోగాన్ని అభివృద్ది చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రోబోటిక్ THA మొదటిసారిగా 1990లో జరిగింది. కొత్త టెక్నాలజీ THA చేయించుకుంటున్న రోగులలో ఫలితాలను మెరుగుపరుస్తుందా? లేదా? అనే సందేహాలు ఉన్నాయి.
THA విజయం ఎక్కువగా సర్జన్ కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియ విజయాన్ని ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన సర్జన్ కారకాల్లో ఒకటి పొజిషనింగ్, ప్లేస్‌మెంట్ ఆఫ్ ఇంప్లాంట్స్. నేషనల్ జాయింట్ రిజిస్ట్రీ UK డేటా ప్రకారం.. అత్యంత సాధారణంగా డిస్‌లొకేషన్ వల్ల హిప్ సర్జరీ మళ్లీ చేయాల్సి వస్తుంది.
కాంపోనెంట్స్ ప్లేస్‌మెంట్ సరిగా లేనప్పుడు హిప్ డిస్‌లొకేషన్ సమస్య ఎదురవుతుంది. శస్త్రచికిత్స చేయడంలో ఎంత అనుభవం ఉన్నా కాంపోనెంట్ పొజిషనింగ్ సమస్యలకు అవకాశం ఉంది. కాంపోనెంట్ పొజిషనింగ్ సరిగా లేకపోతే తుంటికి అంతరాయం కలిగిస్తుంది. యాక్సలరేటెడ్ వేర్ ఆఫ్ ఇంప్లాంట్స్, పెరిప్రోస్తేటిక్ ఫ్రాక్చర్‌కి రివిజన్ హిప్ సర్జరీ అవసరమవుతుంది. THAలో రోబోటిక్ వినియోగం ద్వారా కచ్చితంగా కాంపోనెంట్స్ ప్లేస్ చేసే అవకాశం ఉంటుంది. వైవిధ్యమైన శరీర నిర్మాణ శాస్త్రం, పాథాలజీతో 100 శాతం ప్రతి రోగిలో కచ్చితమైన కాంపోనెంట్స్ పొజిషనింగ్, రీప్రొడక్టబిలిటీ సామర్థ్యాన్ని చూపింది.
* చికిత్సలో కచ్చితత్వం
రోబోటిక్ అసిస్టెడ్ THA ద్వారా వీలైనంత ఎక్కువ ఎసిటాబులర్, ఫెమోరల్ బోన్ స్టాక్‌ను సంరక్షించడంతో స్థిరత్వాన్ని నిర్వహించడం వీలవుతుంది. భవిష్యత్తులో రోగులలో రివిజన్ హిప్ సర్జరీ అవసరం తలెత్తితే, ప్రాథమిక శస్త్రచికిత్సలో ఎముక స్టాక్‌ను పెంచడం వల్ల రివిజన్ సర్జరీ సులువవుతుంది. ఇన్‌కరక్ట్ ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్, లెగ్ లెన్త్ వ్యత్యాసానికి దారి తీస్తుంది. దీని ఫలితంగా రోగి అసంతృప్తికి గురవుతారు, తక్కువ ఫలితాలు వస్తాయి. అయినప్పటికీ, రోబోటిక్ అసిస్టెడ్ THAలో, లెగ్ లెంగ్త్ సమానత్వం నిర్వహణలో మెరుగుదల ఉంది.
THAలో రోబోటిక్ సహాయం THAలో ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ కచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇది ప్రతి రోగి వ్యక్తిగత శరీర నిర్మాణం కోసం రూపొందించారు. నియంత్రిత వాతావరణంలో జూనియర్ సర్జన్లకు శిక్షణ అవకాశాలను అందించడానికి కూడా ఈ టూల్ ఉపయోగపడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health care, Health Tips