• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTH RESEARCHERS HAVE WARNED HAIR LOSS MAY BE A HARSH REALITY FOR MANY COVID SURVIVORS GH SSR

Long COVID: కోవిడ్ నుంచి కోలుకున్నాక జుట్టు ఊడిపోతోందట.. ఎందుకంటే..

Long COVID: కోవిడ్ నుంచి కోలుకున్నాక  జుట్టు ఊడిపోతోందట.. ఎందుకంటే..

బట్టతల (ఫైల్ ఫొటో)

కరోనా వైరస్ మహమ్మారి వెలుగుచూసి సంవత్సరం దాటిపోయింది. దీని మూలాలు, లక్షణాలు, వ్యాప్తిపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వైరస్ స్ట్రెయిన్, దీర్ఘకాలిక లక్షణాలు, వైరస్ దుష్ప్రభావాలపై చేస్తున్న అధ్యయనాల్లో ఎప్పటికప్పుడూ...

  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి వెలుగుచూసి సంవత్సరం దాటిపోయింది. దీని మూలాలు, లక్షణాలు, వ్యాప్తిపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వైరస్ స్ట్రెయిన్, దీర్ఘకాలిక లక్షణాలు, వైరస్ దుష్ప్రభావాలపై చేస్తున్న అధ్యయనాల్లో ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కోవిడ్-19 దీర్ఘకాలిక వ్యాధి లక్షణాల్లో జుట్టు రాలిపోవడం కూడా ఉంటోందని ఇటీవల చేసిన పరిశోధనలు వెల్లడించాయి. కరోనా బారిన పడి చికిత్స తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు కొన్ని నెలల వరకు కొనసాగుతున్నాయి. దీన్ని లాంగ్ కోవిడ్ అని పిలుస్తున్నారు. లాంగ్ కోవిడ్ ఐదు ప్రధాన లక్షణాల్లో జుట్టు రాలిపోవడం ఒకటని పరిశోధకులు తెలిపారు. మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావాలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

* లాంగ్ COVID అంటే? 
కొంతమంది కోవిడ్ రోగుల్లో కరోనా వచ్చి కోలుకున్న కొన్ని వారాలు, నెలల తరువాత కూడా దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న తరువాత కూడా లక్షణాలు, దుష్ప్రభావాలు కనిపించే స్థితిని లాంగ్ COVID అంటున్నారు. లాంగ్ కోవిడ్ 12 వారాల కంటే ఎక్కువ కాలం ఉంటుందని ఇంగ్లండ్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ (NICE) చెబుతోంది. రోగులు కోలుకున్న తరువాత.. వైరస్ లక్షణాలు ఎనిమిది వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లాంగ్ కోవిడ్‌గా గుర్తిస్తున్నారు.

* జుట్టు రాలడం ప్రధాన సమస్య
ప్రతి ఐదుగురు కరోనా వైరస్ రోగుల్లో ఒకరికి ఐదు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని బ్రిటన్‌లోని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ONS) సంస్థ వెల్లడించింది. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో ఆరు నెలల తరువాత కూడా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని లాన్సెట్ అధ్యయనం చెబుతోంది. ఇందులో జుట్టు రాలడం ఆందోళన కలిగించే ప్రధాన అంశంగా ఉందని అధ్యయనం పేర్కొంది.

* ఆడవాళ్లలో ఎక్కువ జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ కరోనా వైరస్ వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. ఇది లాంగ్ కోవిడ్ లక్షణంగా మారుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో పావు వంతు మందిలో జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువ అవుతోందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించింది. చైనాలోని వుహాన్‌ హాస్పిటల్‌లో చేరిన 1,655 మంది కరోనా రోగులపై ఈ పరిశోధన చేశారు. వీరిలో పూర్తిగా కోలుకున్న 359 (22 శాతం) మందికి.. ఆరు నెలల తరువాత జుట్టు రాలిపోయే సమస్య ఎదురైందని కనుగొన్నారు. ఈ సమస్య మగవాళ్లకంటే ఆడవాళ్లలో ఎక్కువగా ఉందని పరిశోధకులు వెల్లడించారు.

* ఆ సమస్యలు కూడా..
జుట్టు రాలిపోవడంతోపాటు అలసట, కండరాల బలహీనత, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలు కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తున్నాయని అధ్యయనంలో కనుగొన్నారు. తీవ్రమైన వ్యాధి లక్షణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు, ఎక్కువ రోజులు చికిత్స తీసుకొని కోలుకున్న వారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపించడం విశేషం. కరోనా నుంచి కోలుకున్నవారిలో జుట్టు రాలిపోయే సమస్య 22 శాతం, నిద్ర సంబంధ సమస్యలు 26 శాతం, ఒత్తిడి, ఆందోళన వంటివి 23 శాతం మందిలో కనిపించాయని ఈ నివేదిక పేర్కొంది.
Published by:Sambasiva Reddy
First published:

అగ్ర కథనాలు