HEALTH REGULAR EXERCISE MAY LOWER ANXIETY DISORDER RISK BY 60 SAYS NEW STUDY GH VB
పురుషుల కంటే మహిళల్లోనే అవి ఎక్కువగా ఉండటానికి గల కారణం ఏమిటి..? తాజా అధ్యయనంలో సంచలన విషయాలు..
ప్రతీకాత్మక చిత్రం
యాంగ్జైటీ (Anxiety) లేదా ఆందోళన అనేది ప్రతి ఒక్కరిలోనూ కనిపించే సాధారణ భావం. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ప్రాణాపాయ, ప్రమాద స్థితులలో ఉన్నప్పుడు విపరీతమైన ఆందోళనకు గురవ్వడం సహజం. ఇలాంటి సందర్భాల్లో ఆందోళన చెందడం మంచిదే. కానీ ప్రతి చిన్న విషయానికీ మితిమీరిన ఆందోళనకు గురైతే.. మానసిక వ్యాధి ఉన్నట్లే! దీన్నే వైద్య పరిభాషలో ఆందోళన రుగ్మత (anxiety disorder) అని పిలుస్తారు. అయితే తాజాగా స్వీడన్లోని లండ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అతి ఆందోళన సమస్యపై అధ్యయనం నిర్వహించారు.
యాంగ్జైటీ (Anxiety)లేదా ఆందోళన అనేది ప్రతి ఒక్కరిలోనూ కనిపించే సాధారణ భావం. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ప్రాణాపాయ, ప్రమాద స్థితులలో ఉన్నప్పుడు విపరీతమైన ఆందోళనకు గురవ్వడం సహజం. ఇలాంటి సందర్భాల్లో ఆందోళన చెందడం మంచిదే. కానీ ప్రతి చిన్న విషయానికీ మితిమీరిన ఆందోళనకు గురైతే.. మానసిక వ్యాధి ఉన్నట్లే! దీన్నే వైద్య పరిభాషలో ఆందోళన రుగ్మత (anxiety disorder) అని పిలుస్తారు. అయితే తాజాగా స్వీడన్లోని లండ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అతి ఆందోళన సమస్యపై అధ్యయనం నిర్వహించారు. ఇతరులతో పోలిస్తే క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తుల్లో ఆందోళన సమస్యలు తలెత్తే ముప్పు దాదాపు 60 శాతం వరకు తగ్గుతుందని అధ్యయన పరిశోధకులు తేల్చారు.
ఈ అధ్యయన ఫలితాలు సైకియాట్రీలోని ఫ్రాంటియర్స్ లో ప్రచురించారు. స్వీడన్లోని లండ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దాదాపు 400,000 మంది వ్యక్తుల డేటా ఆధారంగా అధ్యయనం చేపట్టారు. స్త్రీలు, పురుషులు పాల్గొన్న ఎపిడెమియాలజీ అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.వ్యాయామ పనితీరు స్థాయిలు ఆందోళన సమస్యల ముప్పుపై ప్రభావం చూపిస్తాయని తాము కనుగొన్నట్లు పరిశోధకుడు మార్టిన్ స్వెన్సన్ వెల్లడించారు. వ్యాయామాలు చేయడం ద్వారా స్త్రీ, పురుషులలో ఆందోళన స్థాయి ఎలా మారుతుందో గుర్తించామన్నారు.
సాధారణంగా మనుషుల్లో అతి ఆందోళన సమస్యలు యుక్త వయసు నుంచే తలెత్తుతాయి. ప్రపంచవ్యాప్తంగా 10 శాతం మంది ప్రజల ఆందోళన సమస్యలతో బాధ పడుతున్నారని అంచనా. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా ఆందోళన సమస్యలు కనిపిస్తాయని కూడా పరిశోధకులు తేల్చి చెప్పారు. ఈ అధ్యయనంలో స్కీయింగ్ చేసే (మంచు ఆట) పురుషులు, స్త్రీలు పాల్గొన్నారు. అయితే పురుషుల బృందం కఠిన శ్వ్యాయామాలుచేసినా.. వారిలో ఆందోళన సమస్యలు వచ్చే ముప్పుపై ఎలాంటి ప్రభావం ఉండదని అధ్యయనంలో తేలింది.
కానీ తేలిక వ్యాయామాలు చేసిన మహిళా బృందంతో పోలిస్తే.. కఠిన వ్యాయామాలు చేసిన మహిళల్లో ఆందోళన వ్యాధి వచ్చే ప్రమాదం రెట్టింపయ్యిందని పరిశోధనలో వెల్లడైంది. ఎన్నడూ వ్యాయామాలు చేయని సాధారణ మహిళలతో పోలిస్తే.. అత్యధిక స్థాయిలో వ్యాయామాలు చేసే మహిళల్లో ఆందోళన సమస్యల ప్రమాదం తక్కువ అని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు.
4 లక్షల మందిపై జరిపిన అధ్యయనం..
తమ అధ్యయనం ఇప్పటివరకు సైంటిఫిక్ రీసెర్చ్ కనిపెట్టలేని విషయాలను కనిపెట్టిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటివరకూ చేసిన అధ్యయనాలు మానసిక అనారోగ్యం, డిప్రెషన్ వంటి సమస్యలపై దృష్టి సారించాయి. కానీ ప్రత్యేకంగా ఆందోళన సమస్యలపై పరిశోధనలు చేయలేదని శాస్త్రవేత్తలు తెలియజేశారు. కొన్ని పెద్ద అధ్యయనాలు కేవలం పురుషులపై.. అది కూడా తక్కువ మందిపైనే పరిశోధనలు చేశాయని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.
వ్యాయామం, ఆందోళన మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండకపోవచ్చని తమ అధ్యయనం సూచిస్తుందని మార్టిన్ స్వెన్సన్ తెలిపారు. మనుషుల ప్రవర్తన, జన్యు సంబంధిత లక్షణాలు, మానసిక కారకాలు కూడా ముప్పుని ప్రభావితం చేస్తాయన్నారు. స్త్రీ, పురుషుల్లోని ఆందోళన సమస్యల్లో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో తెలుసుకునేందుకు మరిన్ని అధ్యయనాలు అవసరమన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.