Health Tips: అసలే వానాకాలం.. ఇంట్లోంచి దోమల్ని తరిమేయండిలా..

ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న మస్కిటో రీపెల్లెంట్‌లు అంత మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని రోగాలకు అవి కారణమవుతాయని తెలిపారు. వాటికి బదులు సహజంగా లభ్యమయ్యే పదార్థాలతోనే దోమల్ని దూరంగా ఉంచవచ్చు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 16, 2019, 4:32 PM IST
Health Tips: అసలే వానాకాలం.. ఇంట్లోంచి దోమల్ని తరిమేయండిలా..
దోమ
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 16, 2019, 4:32 PM IST
డెంగీ, చికున్ గున్యా, మలేరియా.. దోమలు కుట్టాయంటే ఈ రోగాలు రావడం ఖాయం. రాత్రిళ్లు నిద్ర పట్టనీయకుండా చేస్తూ, చెవి దగ్గర గుయ్.. గుయ్.. మంటూ నరకం చూపించే కీటకాన్ని చూస్తేనే కోపం వస్తుంది. అదేదో, అవి ఇంట్లోకి రాకుండా చేస్తే బెటర్ కదా. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న మస్కిటో రీపెల్లెంట్‌లు అంత మంచివి కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని రోగాలకు అవి కారణమవుతాయని తెలిపారు. వాటికి బదులు సహజంగా లభ్యమయ్యే పదార్థాలతోనే దోమల్ని దూరంగా ఉంచవచ్చు. ఆ చిట్కాలు ఏంటంటే..

1. లావెండర్
లావెండర్.. పుదీనా రకానికి చెందినది. వీటి నుంచి తీసిన నూనెలు దోమలకు అస్సలు ఇష్టం ఉండదు. వీటి వాసన చూడగానే పారిపోతాయి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉండే చోట చిన్న రిబ్బన్‌కు లావెండర్‌ నూనెను పూసి ఉంచాలి.

2. రోజ్‌మేరీ
దోమలు ఎక్కువగా ఆహార పదార్థాలపై వాలతాయి. ముఖ్యంగా మాంసం అంటే పరుగెత్తుకుంటూ వస్తాయి. వాటిపైనే మల విసర్జన చేస్తూ మన రోగాలకు కారణమవుతాయి. అందువల్ల దోమల్ని దూరంగా ఉంచేందుకు మాంస పదార్థాలపై రోజ్‌మేరీ చల్లితే ఫలితం ఉంటుంది. పైగా, ఆహారం రుచిని పెంచుతుంది.



3. వేపనూనె
హానికర కీటకాలను దూరంగా ఉంచడంలో వేపకు ఉన్న గొప్ప లక్షణం. ఈ చెట్టు నుంచి తీసిన నూనె అంటే దోమకు భయం. ఈ నూనెను ఒంటికి రాసుకుంటే మశకము మన దరి చేరదు.

4. కాఫీ పొడి
వాటర్ స్టోరేజీ ఉన్న స్థలాల్లో కాఫీ పొడి చల్లితే దోమలు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడానికే భయపడతాయి. నీటిపై వాలడానికి రాగానే ఆక్సిజన్ అందకుండా చేసి చంపేస్తాయి.

5. నిమ్మగడ్డి కొవ్వొత్తులు
నిమ్మగడ్డి నుంచి తీసిన రసంతో తయారు చేసిన కొవ్వొత్తులను ఇంట్లో ఉంచుకుంటే మంచిది. కొవ్వొత్తి కాలిన కొద్దీ వచ్చే వాసన దోమలు పారిపోయేలా చేస్తాయి.
First published: July 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...