HEALTH PROTEIN RICH FOODS FOR WEIGHT LOSS 9 HIGH PROTEIN FOODS FOR VEGETARIANS TO LOSE WEIGHT GH VB
Weight Loss Tips: మీరు శాకాహారులా..? బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ ప్రోటీన్ ఫుడ్స్ ట్రై చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
బరువు తగ్గదలుచుకున్న శాకాహారులు హై-ప్రోటీన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఏవో తెలియక తికమకపడుతుంటారు. అలాంటి వారి కోసం కొన్ని ప్రోటీన్-రిచ్ వెజిటేరియన్ ఫుడ్స్‌ను పోషకాహార నిపుణులు తెలియజేశారు. మరి అవేంటో తెలుసుకుందాం.
పుష్కలంగా ప్రోటీన్లు లభించే ఆహారాలు అనగానే మనకు మాంసాహారం, చికెన్, గుడ్లు గుర్తుకు వస్తాయి. అయితే మాంసాహార ఆహారాల్లో ప్రోటీన్ అత్యధికంగా లభిస్తుందన్న మాట వాస్తవమే. కానీ మాంసం ముట్టని వారు ఏ శాకాహారాలు తినాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా బరువు తగ్గదలుచుకున్న శాకాహారులు హై-ప్రోటీన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఏవో తెలియక తికమకపడుతుంటారు. అలాంటి వారి కోసం కొన్ని ప్రోటీన్-రిచ్ వెజిటేరియన్ ఫుడ్స్‌ను పోషకాహార నిపుణులు తెలియజేశారు. మరి అవేంటో తెలుసుకుందాం.
-బాదం పప్పుబాదం పప్పులో కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు పావుకప్పు బాదం పప్పులు తినడం ద్వారా ప్రోటీన్ అవసరాలు తీరుతాయి. అలాగే బరువు పెరగకుండా బాదంపప్పు చేయగలదు.
-పాలకూరపాలకూరను సూప్ గా, కూరగా లేదా శాండ్విచ్ లో యాడ్ చేసుకుని అయినా తినొచ్చు. ఇందులో సమృద్ధిగా లభించే ప్రోటీన్లు, ఐరన్ జుట్టు బలంగా పెరిగేలా సహాయపడతాయి. అలాగే ఇందులోని న్యూట్రియంట్స్ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి. బరువు తగ్గడంలోనూ పాలకూర బాగా సహాయపడుతుంది.
- బీన్స్ - చిక్కుళ్లు బీన్స్ లోని అత్యధిక ప్రోటీన్ కండ పెరుగుదలకు తోడ్పడుతుంది. వీటిని తినే ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మెదడు పనితీరు చలాకీగా మారుతుంది. చాలా నెమ్మదిగా జీర్ణమయ్యే బీన్స్ కడుపు నిండిన భావన ఎక్కువ కాలం కల్పిస్తాయి. వీటిని రోజూ తినడం ద్వారా ఆకలి బాధ తగ్గి బరువు కూడా తగ్గుతారు.
- సోయాబీన్స్అత్యధిక ప్రోటీన్లు గల శాకాహార పదార్థాల్లో సోయాబీన్స్ పైవరుసలో ఉంటాయి. వీటిని మీరు భోజనంలో యాడ్ చేసుకోవచ్చు లేదా వెజిటేబుల్స్ తో కలిపి తినవచ్చు. లేదంటే వీటిని నేరుగా అలాగే తినవచ్చు. సోయాబీన్, సోయా ఉత్పత్తుల్లో సమృద్ధిగా ప్రోటీన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా శరీరానికి అన్ని ప్రోటీన్లు అందుతాయి. సోయాబీన్స్ తరచూ తినడం ద్వారా బరువు తగ్గొచ్చు.
- చియా విత్తనాలుఈ మధ్యకాలంలోనే చియా విత్తనాలకు ప్రజాదరణ పెరిగిపోయింది. చియా విత్తనాల్లో పుష్కలంగా ప్రోటీన్లు లభించడమే ఇందుకు కారణం. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చు. ఈ విత్తనాలు మీ జుట్టును ఒత్తుగా బలంగా పెరగడానికి.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి దోహదపడతాయి. ఈ విత్తనాలను కాస్త తేనెతో కలిపి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
- క్వినోవాసంపన్నుల పోషకాహారంగా పేరున్న క్వినోవాని వరి అన్నానికి బదులుగా సెలబ్రిటీలు ఆరగిస్తుంటారు. ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు రాకుండా, లావు తగ్గడానికి, లావు పెరగకుండా ఉండటానికి దీన్ని విరివిగా వాడుతుంటారు. బరువు తగ్గాలనుకునే వారు క్వినోవా బియ్యాన్ని అల్పాహారంగా ఆరగించవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.