HEALTH POST COVID PATIENTS MUST UNDERGO THESE TESTS EVERY SIX MONTHS SUGGESTS DOCTORS AK GH
కరోనా వచ్చి తగ్గిందా? ఆరు నెలలకోసారి ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే.. లేకపోతే..
ప్రతీకాత్మక చిత్రం
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత చాలా మంది కరోనా పేషెంట్లకు గుండె నొప్పి, గుండె కండరాల్లో వాపు, గుండె కొట్టుకోవడంలో ఇబ్బందులు, గుండె నొప్పి, రక్తం గడ్డ కట్టడం, స్ట్రోక్ వంటివి వస్తున్నాయట.
కరోనా మన శరీరంలోని ఎన్నో అవయవాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థపై వైరస్ ప్రభావం కొన్ని నెలల వరకు కనిపిస్తోంది. గుండెల్లో నొప్పి, ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, గుండె నొప్పి, గుండె పనిచేయడంలో ఇబ్బంది వంటి ఎన్నో సమస్యలు కరోనా వచ్చి తగ్గిన వారిలో కనిపిస్తున్నాయట. అందుకే కోవిడ్ నుంచి కోలుకున్నవారు కనీసం ఆరు నెలలకు ఒకసారైనా గుండె పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత చాలా మంది కరోనా పేషెంట్లకు గుండె నొప్పి, గుండె కండరాల్లో వాపు, గుండె కొట్టుకోవడంలో ఇబ్బందులు, గుండె నొప్పి, రక్తం గడ్డ కట్టడం, స్ట్రోక్ వంటివి వస్తున్నాయట. అది కూడా 100లో 78 మందికి వస్తున్నాయట. దీంతో వీరు తప్పనిసరిగా గుండె పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. శరీరం వైరస్‌తో పోరాడుతున్నప్పుడు ఇన్ ఫ్లమేటరీ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. దీంతో అది ఆరోగ్యంగా ఉన్న అవయవాలపైనా ప్రభావం చూపుతుంది.
అసలు గుండె సమస్యలు లేని వారిలో కూడా కరోనా తర్వాత గుండె పోటు రావడం గమనించామని డాక్టర్లు చెబుతున్నారు. వీరిలో చాలామందికి ఛాతిలో పట్టేసినట్లు ఉండడం, ఊపిరి అందకపోవడం వంటివి కనిపించాయి. ఇవి గుండె దెబ్బతినడం వల్ల మాత్రమే కాదు.. కొన్ని రోజుల పాటు బెడ్‌పైనే ఉండడం వల్ల కూడా జరుగుతాయి. ముందుగా ఎలాంటి గుండె జబ్బులు లేని పదిలో ఆరుగురికి కరోనా తర్వాత గుండె నొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయట. అందుకే ముందుగానే పరీక్షలు చేయించుకొని, అవసరమైన మందులు వాడుతూ ప్రమాదాన్ని నిరోధించవచ్చని వైద్యులు తెలిపారు.
కోవిడ్ నుంచి కోలుకున్నవారు ఈసీజీ, చెస్ట్ ఎక్స్ రే, లిపిడ్ ప్రొఫైల్ వంటివన్నీ ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవాలి. హై బీపీ, డయాబెటిస్ వంటివి ఉన్నవారు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు మీ గుండె పనితీరు ఎలా ఉంది. అంతా సజావుగా పనిచేస్తుందా? లేదా? అని చెక్ చేయడానికి వీలుగా ఉంటాయి. ఇవి చేసిన తర్వాత రెగ్యులర్ గా డాక్టర్ ని సంప్రదించడం కూడా మర్చిపోవద్దు.
అంతే కాదు.. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు చక్కటి ఆహారం తీసుకోవాలి. నిల్వ ఉన్న ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. మీ బీపీ, కొలెస్ట్రాల్ రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవాలి. బరువు కూడా మరీ ఎక్కువగా ఉండకుండా కాపాడుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటివి కూడా మానేయాలి. ఒకవేళ శరీరంలో ఏవైనా అనుకోని మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.