Home /News /life-style /

HEALTH POLLUTION MAY CUT LIFE EXPECTANCY OF 40 PC INDIANS BY 9 YEARS US STUDY MK GH

Air Pollution: భారత్‌లో పెరుగుతున్న వాయుకాలుష్యం.. తొమ్మిదేళ్ల వరకు తగ్గనున్న ఆయుర్దాయం

Air Pollution: భారత్‌లో పెరుగుతున్న వాయుకాలుష్యం.. తొమ్మిదేళ్ల వరకు తగ్గనున్న ఆయుర్దాయం

Air Pollution: భారత్‌లో పెరుగుతున్న వాయుకాలుష్యం.. తొమ్మిదేళ్ల వరకు తగ్గనున్న ఆయుర్దాయం

గాలిలోకి విడుదల అవుతున్న ప్రమాదకర ఉద్గారాల వల్ల వాతావరణ మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ విపత్తు భారతీయుల ఆయుర్దాయంపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతుందని వెల్లడించింది తాజా అధ్యయనం.

Air Pollution : వాయు కాలుష్యం పర్యావరణంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుందని ఎన్నో పరిశోధనలు తేల్చాయి. గాలిలోకి విడుదల అవుతున్న ప్రమాదకర ఉద్గారాల వల్ల వాతావరణ మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ విపత్తు భారతీయుల ఆయుర్దాయంపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతుందని వెల్లడించింది తాజా అధ్యయనం. వాయు కాలుష్యం దాదాపు 40 శాతం మంది భారతీయుల ఆయుర్దాయాన్ని తొమ్మిదేళ్లపాటు తగ్గిస్తుందని ఈ అధ్యయనం గుర్తించింది. న్యూఢిల్లీ సహా మధ్య, తూర్పు, ఉత్తర భారతదేశంలో నివసిస్తున్న 48 కోట్లకు పైగా ప్రజలు తీవ్రమైన కాలుష్యం ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ (EPIC) ఈ అధ్యయనం చేపట్టింది. వాయుకాలుష్యం భారతదేశం అంతటా విస్తరిస్తోందని EPIC నివేదిక పేర్కొంది.

స్వచ్ఛమైన గాలిని శ్వాసగా తీసుకునే వారితో పోలిస్తే.. కలుషితమైన గాలిని శ్వాసించే వారి ఆయుర్దాయం ఎలా ఉంటుందనే అంశంపై షికాగో యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించిందని ఈ నివేదిక వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో కాలుష్య తీవ్రత కారణంగా ఇక్కడి ప్రజల ఆయుర్దాయం 2.5 నుంచి 2.9 సంవత్సరాల వరకు తగ్గిపోవచ్చని తెలిపింది.

ప్రమాదకరమైన కాలుష్య స్థాయిలను నియంత్రించడానికి 2019లో ప్రారంభించిన భారతదేశ జాతీయ స్వచ్ఛ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) విధానాన్ని ఈ రిపోర్టు ప్రశంసించింది. NCAP లక్ష్యాలను సాధించి, వాటిని కొనసాగిస్తే దేశం ప్రజల మొత్తం ఆయుర్దాయం 1.7 సంవత్సరాలు.. న్యూఢిల్లీ వాసుల ఆయుర్దాయం 3.1 సంవత్సరాలు పెరుగుతుందని EPIC నివేదిక పేర్కొంది

ఇది చదవండి... Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టినతేదీ వివరాలు తప్పనిసరి.. స్పష్టం చేసిన ఫేస్‌బుక్

2024 నాటికి వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న 102 నగరాల్లో కాలుష్యాన్ని 20 -30 శాతం వరకు తగ్గించాలని NCAP లక్ష్యంగా పెట్టుకుంది. పారిశ్రామిక ఉద్గారాలు, వాహనాల నుంచి వెలువడే వాయువులను తగ్గించడంతో పాటు జీవ వ్యర్థాల దహనం, ధూళి కాలుష్యం వంటివి తగ్గించడానికి కఠినమైన నియమాలను ప్రవేశపెట్టాలని ఎన్‌సీఏపీ సూచిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన స్థాయికి దేశంలో గాలి నాణ్యత మెరుగుపడితే.. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ సగటు ఆయుర్దాయం సైతం 5.4 సంవత్సరాలు పెరుగుతుందని EPIC రిపోర్టు తెలిపింది.

ఇది చదవండి...Electricity from Footsteps: స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల అద్భుత ప్రయోగం.. ఆ ఫ్లోర్‌పై నడిస్తే విద్యుత్ ఉత్పత్తి

అత్యంత కలుషితమైన రాజధాని నగరాల్లో ఢిల్లీ ఒకటని ఐక్యూఎయిర్ (IQAir) సంస్థ గతంలో తెలిపింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ సంస్థ.. పీఎమ్ 2.5 కాలుష్య కణాల ఆధారంగా గాలి నాణ్యత స్థాయిలను అంచనా వేస్తుంది. గత సంవత్సరం కరోనావైరస్ లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా వేసవిలో రికార్డు స్థాయిలో కాలుష్యం తగ్గిపోయింది. అయితే తరువాతి శీతాకాలంలో పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాల దహనం కారణంగా మళ్లీ కాలుష్యం పెరిగిందని ఐక్యూఎయిర్ వెల్లడించింది. ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి పెట్టాలని నివేదికలు సూచిస్తున్నాయి.
Published by:Krishna Adithya
First published:

Tags: Air Pollution

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు