HEALTH POLICY PLUM OFFERS GROUP HEALTH INSURANCE UP TO RS 5 LAKH TO SMALL STARTUPS GIG WORKERS AND SMES AT JUST RS 85 PER MONTH GH SK
Health Insurance: నెలకు రూ. 85తో రూ. 5 లక్షల వరకు బీమా.. కొత్త హెల్త్ పాలిసీ.. వివరాలు ఇవే
ప్రతీకాత్మక చిత్రం
Health Insurance: ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫాం ప్లమ్.. సరికొత్త ప్లమ్ లైట్ స్కీమ్‌ను ప్రారంభించింది. ప్రారంభ దశలో ఉన్న స్టార్ట్-అప్లు, SMEలు, గిగ్ వర్కర్లు/ఫ్రీలాన్స్ కన్సల్టెంట్ల కోసం ప్రత్యేకంగా సమగ్ర గ్రూప్ హెల్త్ బెనిఫిట్స్ మెంబర్షిప్ ను ఈ స్కీమ్ ద్వారా అందిస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా తరువాత హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోళ్లు భారీగా పెరిగాయి. కంపెనీలు సైతం ఎక్కువ కవరేజీ అందించే ఎంప్లాయీ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు అమలుచేస్తున్నాయి. తాజాగా ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫాం ప్లమ్ (Plum).. సరికొత్త ప్లమ్ లైట్ (Plum-Lite) స్కీమ్‌ను మంగళవారం (2021, డిసెంబర్ 21న) ప్రారంభించింది. ప్రారంభ దశలో ఉన్న స్టార్ట్-అప్లు, SMEలు, గిగ్ వర్కర్లు/ఫ్రీలాన్స్ కన్సల్టెంట్ల కోసం ప్రత్యేకంగా సమగ్ర గ్రూప్ హెల్త్ బెనిఫిట్స్ మెంబర్షిప్ (Health Benefits Membership) ను ఈ స్కీమ్ ద్వారా అందిస్తున్నట్లు ప్రకటించింది.
ప్లమ్-లైట్ మెంబర్షిప్ న్యూ ఏజ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్లు, డాక్టర్ కన్సల్టేషన్లు, కోవిడ్- 19 ట్రీట్మెంట్ కవర్లను అందిస్తుంది. కనీసం ఇద్దరు సభ్యులతో టీమ్‌లను కలిగి ఉన్న కంపెనీలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇందుకు నెలవారీ ప్రీమియంను రూ. 85గా నిర్దేశించింది.
* ఆ సంస్థలకు ప్రయోజనం
ఏదైనా ప్రారంభ దశలో ఉన్న బిజినెస్ విషయంలో, ఉద్యోగులకు మొదటి రోజు నుంచి హెల్త్ బెనిఫిట్స్ అందించడం అనేది ఒక సవాలుగా ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగుల హెల్త్ ప్లాన్లు పెద్ద టీమ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందుకు ఒక టీమ్‌కు కనీసం 10 మంది సభ్యులు అవసరం. అయితే ప్లమ్ సంస్థ అందిస్తోన్న కొత్త హెల్త్ బెనిఫిట్స్ మెంబర్షిప్ ద్వారా, కేవలం ఇద్దరు సభ్యులతో ప్రారంభమయ్యే బూట్స్ట్రాప్డ్ టీమ్‌లు పాలసీ ప్రయోజనాలు పొందవచ్చు.
ఈ పాలసీ ప్రీమియం కేవలం రూ.85 నుంచి ప్రారంభమవుతుందని సంస్థ వెల్లడించింది. ఇది ఒక మెంబర్ ఒకసారి భోజనానికి చేసే ఖర్చు కంటే తక్కువగా ఉంటుందని, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు కంటే చాలా తక్కువగా ఉంటుందని తెలిపింది. మంథ్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా ఈ మెంబర్షిప్ పొందవచ్చు. అందువల్ల బూట్‌స్ట్రాప్ బిజినెస్‌లు ఉద్యోగుల హెల్త్ బెనిఫిట్స్ కోసం అతిపెద్ద యాన్యువల్ ఇన్వెస్ట్‌మెంట్‌ను లాక్-ఇన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెంబర్షిప్ స్కీమ్ రూ. 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్, అన్లిమిటెడ్ డాక్టర్ కన్సల్టేషన్లు, వారానికోసారి వెల్నెస్ సెషన్లు, డెంటల్, విజన్ చెకప్‌లు, మెంటల్ వెల్నెస్ కన్సల్టేషన్లు, కోవిడ్- 19 ట్రీట్మెంట్ క్లెయిమ్‌లు... వంటి సమగ్ర కవరేజీ ప్రయోజనాలు అందిస్తుంది. ఇది ఉద్యోగులు, వారి జీవిత భాగస్వామి, పిల్లలను కూడా కవర్ చేస్తుంది.
కొత్త హెల్త్ బెనిఫిట్స్ మెంబర్షిప్ ప్రారంభం గురించి ప్లమ్ సంస్థ CEO అభిషేక్ పొద్దార్ మాట్లాడారు. హెల్త్ బెనిఫిట్స్, కాంప్రహెన్సివ్ ఎంప్లాయర్- ఎంప్లాయీ ఇన్సూరెన్స్‌ను అత్యంత వెనుకబడిన వ్యాపార వర్గాలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తమ సంస్థ పనిచేస్తుందన్నారు. మొదటి దశలో స్టార్టప్‌లు, SMEలు, గిగ్ వర్కర్లు/ఫ్రీలాన్స్ కన్సల్టెంట్ల కోసం పాలసీలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. 2024 నాటికి కోటి మందికి బీమా చేయాలనే ప్లమ్ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలోని 6.3 కోట్ల SMEలు, 15 మిలియన్ల గిగ్ వర్కర్లకు ఇన్సూరెన్స్ కవరేజీ అందుబాటులో లేదు. ప్లమ్-లైట్ స్కీమ్ ద్వారా ఈ రంగాల ఉద్యోగులకు సమగ్ర హెల్త్ పాలసీ ప్రయోజనాలు అందుతాయని సంస్థ వెల్లడించింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.